అన్వేషించండి

India vs England 1st Test: ఇంగ్లాండ్‌లో రిషబ్ రోరింగ్- రికార్డుల మోత మోగిస్తున్న పంత్

India vs England 1st Test:ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో వికెట్ కీపర్‌ రిషబ్ పంత్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ దెబ్బకు ధోని, సయ్యద్ కిర్మాణి సరసన చేరాడు.

India vs England 1st Test: భారత జట్టు వైస్ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో మరో రికార్డు నెలకొల్పాడు.  ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడవ రోజున, పంత్ ఓలీ పోప్ క్యాచ్ పట్టుకున్న వెంటనే ఒక ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. పోప్ క్యాచ్ పట్టుకున్న వెంటనే పంత్ తన టెస్ట్ కెరీర్‌లో 150వ క్యాచ్ పూర్తి చేశాడు.

ఇప్పుడు రిషబ్ పంత్ భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో 150 క్యాచ్‌లు పూర్తి చేసిన మూడో వికెట్ కీపర్ అయ్యాడు. అతని కంటే ముందు, మాజీ దిగ్గజ ఆటగాడు MS ధోని, సయ్యద్ కిర్మాణి ఈ ఘనత సాధించారు. ఈ క్యాచ్‌తో, పంత్ భారతదేశం తరపున వికెట్ కీపర్‌గా మొత్తం 151 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లతో సహా 166 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన రికార్డు

మూడో రోజున ఇంగ్లాండ్ జట్టు తమ ఇన్నింగ్స్‌ను 209/3 తొ మొదలు పెట్టింది.  ఇంగ్లీష్ జట్టు తరపున, వారి బ్యాట్స్‌మన్ ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉంటూ భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.  ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఓలీ పోప్‌కు ఆఫ్ స్టంప్ వెలుపల వైడ్ బంతిని విసిరిన వెంటనే, పోప్ దానిపై కట్ షాట్ ఆడాడు. అంతే బంతి ఓలీ బ్యాట్ అంచున తగిలి నేరుగా రిషబ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. పోప్ 137 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో 106 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఈ వికెట్‌తో, రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో 150 క్యాచ్‌లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారతదేశం తరపున మూడో వికెట్ కీపర్‌గా నిలిచాడు.

వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్

ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ బ్యాట్‌తో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. అతను కేవలం 178 బంతుల్లో 134 పరుగులు చేశాడు, ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో ఏడో సెంచరీ. పంత్ ఇప్పుడు భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ కూడా అయ్యాడు. పంత్ తన ఇన్నింగ్స్‌లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుతమైన సెంచరీ కారణంగా, పంత్ టెస్ట్ క్రికెట్‌లో ఆసియాలో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ కేవలం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత సాధించాడు.

భారతదేశం టాప్-3 టెస్ట్ వికెట్ కీపర్లు (క్యాచ్‌ల ఆధారంగా)

1. MS ధోని - 90 టెస్ట్‌లు, 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు

2. సయ్యద్ కిర్మాని - 88 టెస్ట్‌లు, 160 క్యాచ్‌లు, 38

3. రిషబ్ పంత్ - 40 టెస్ట్‌లు, 151 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు

భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది

3వ రోజు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆట త్వరగా ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 90 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌పై 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెఎల్ రాహుల్ 47 పరుగులతో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్‌ అవకాశాన్ని ఇచ్చింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగుల స్కోరు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. దీనికి సమాధానంగా, ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓల్లీ పోప్ అద్భుతమైన సెంచరీ సాధించగా, హ్యారీ బ్రూక్ 99 పరుగులు చేశాడు.  

భారత జట్టు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మరోసారి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్, యశస్వి జైస్వాల్‌ను కేవలం 4 పరుగులకే బ్రైడాన్ కార్సే చేతిలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్ రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. బెన్ స్టోక్స్ సుదర్శన్‌ను 30 పరుగుల వద్ద అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేశాడు.అర్ధ సెంచరీకి చేరువలో ఉన్న కెఎల్ రాహుల్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి 4వ రోజు ఆధిక్యాన్ని నిర్మించాలని చూస్తున్నాడు.  

టాప్ హెడ్ లైన్స్

Arshdeep - Samreen Romance:
"మై పర్సన్" అంటూ పిక్స్ షేర్ చేసిన అర్షదీప్ .. బాలీవుడ్ బ్యూటీతో యూకేలో రొమాంటిక్ వెకేషన్!
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget