IND vs AUS, 2nd Test: వణికిస్తున్న యాష్, షమి - టీ బ్రేక్‌కు ఆసీస్ 199/6
IND vs AUS, 2nd Test: దిల్లీ టెస్టులో టీమ్‌ఇండియా బౌలర్లు దుమ్మురేపుతున్నారు! ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తేనీటి విరామానికి 199/6కు పరిమితం చేశారు.
IND vs AUS, 2nd Test:
దిల్లీ టెస్టులో టీమ్‌ఇండియా బౌలర్లు దుమ్మురేపుతున్నారు! ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. గింగిరాలు తిరిగే బంతులతో కంగారూలను కంగారు పెడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో తేనీటి విరామానికి 199/6కు పరిమితం చేశారు. పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (36; 75 బంతుల్లో 4x4), ప్యాట్ కమిన్స్ (23; 21 బంతుల్లో 2x4, 2x6) ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్ (3), మహ్మద్ షమి (2) ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ICYMI - WHAT. A. CATCH 😯😯
— BCCI (@BCCI) February 17, 2023
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభమే లభించింది. టర్నింగ్ పిచ్ కావడంతో ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ (15) నిలకడగా ఆడారు. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఖవాజా కాస్త దూకుడు ప్రదర్శించినా వార్నర్ మాత్రం ఆచితూచి ఆడాడు. అయితే 15.2వ బంతికి అతడిని మహ్మద్ షమి ఔట్ చేశాడు. రౌండ్ ది వికెట్ వచ్చిన వేసిన ఈ బంతి బ్యాటర్ బ్యాటు అంచుకు తగిలి నేరుగా కీపర్ శ్రీకర్ భరత్ చేతుల్లో పడింది.
ఆ తర్వాత మార్నస్ లబుషేన్ (18) పోరాడాడు. నాలుగు బౌండరీలు బాదేశాడు. ఖవాజాకు అండగా నిలిచాడు. అతడిని అశ్విన్ పెవిలియన్ పంపించాడు. అతడు వేసిన 22.4వ బంతిని లబుషేన్ ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించాడు. మిస్సైన బంతి మోకాళ్లను తాకింది. అదే ఓవర్ ఆఖరి బంతికి స్టీవ్ స్మిత్ (0) డకౌట్ అయ్యాడు. పిచైన బంతిని ఆడబోయిన స్టీవ్ నేరుగా కీపర్‌కు క్యాచ్ ఇచ్చేశాడు.
ఒకవైపు మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నా ఉస్మాన్ ఖవాజా మాత్రం అదరగొట్టాడు. భారత స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కొన్నాడు. దొరికిన బంతుల్ని బౌండరీకి పంపించాడు. ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 71 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి అందుకున్నాడు. శతకం వైపు సాగిన అతడిని రవీంద్ర జడేజా పెవిలియన్ పంపించాడు. జట్టు స్కోరు 167 వద్ద ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అంతకు ముందే హెడ్ (12)ను షమి ఔట్ చేశాడు. అలెక్స్ కేరీ (0) యాష్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. కష్టాల్లో పడ్డ జట్టును హ్యాండ్స్‌కాంబ్, కమిన్స్ ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 60 బంతుల్లో 31 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
Tea on Day 1 of the 2nd Test.#TeamIndia get three wickets in the afternoon session with Australia on 199/6 at Tea.
— BCCI (@BCCI) February 17, 2023
Scorecard - https://t.co/hQpFkyZGW8 #INDvAUS @mastercardindia pic.twitter.com/3gxh960JS8