IND vs SL T20 Series: పంత్ లేకపోతే జట్టులో వచ్చే మార్పులేంటి? - హార్దిక్ ఏమన్నాడంటే?
టీమిండియాలో రిషబ్ పంత్ ప్రాధాన్యం గురించి, జట్టులో అతను లేకపోవడం గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడారు.
Hardik Pandya on Rishabh Pant: భారత్-శ్రీలంక మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా విలేకరుల సమావేశం నిర్వహించాడు. అందులో అతను అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ టీ20 సిరీస్ జనవరి మూడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టులో రిషబ్ పంత్ లేకపోవడంపై హార్దిక్ పాండ్యాను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పంత్ త్వరగా కోలుకోవాలని తొలుత ఆకాంక్షించారు. దీని తర్వాత అతను లేనప్పుడు టీమ్ ఇండియాపై కనిపించే ప్రభావాల గురించి మాట్లాడాడు.
రిషబ్ గురించి హార్దిక్ మాట్లాడుతూ, “జరిగింది చాలా దురదృష్టకరం. కొన్ని సార్లు పరిస్థితులు మన కంట్రోల్‌లో ఉండవు. అతను త్వరగా కోలుకోవాలని జట్టు మొత్తం కోరుకుంటోంది. అతని కోసం అందరం ప్రార్థిస్తున్నాం." అన్నారు.
జట్టులో పంత్ స్థానం గురించి మరింత మాట్లాడుతూ, "స్పష్టంగా అతను చాలా ముఖ్యమైన ఆటగాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. జట్టులో పంత్ ఉండటం చాలా తేడాను కలిగిస్తుంది. అతను లేకపోవడం మనం నియంత్రించలేని విషయం." పంత్‌కు బదులుగా ఏ ఆటగాడికి జట్టులో అవకాశం వచ్చినా, ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని హార్దిక్ అభిప్రాయపడ్డాడు.
విశేషమేమిటంటే, శ్రీలంకతో ఆడనున్న T20, ODI సిరీస్‌లలో పంత్‌ను జట్టులో చేర్చలేదు. అయితే ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియాతో జరగాల్సిన టెస్ట్ సిరీస్‌లో పంత్ జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నాడు. ఈ సిరీస్ కారణంగా అతను శ్రీలంక సిరీస్‌లో దూరం అయి ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టడానికి జాతీయ క్రికెట్ అకాడమీకి పిలిచారు. అయితే వీటన్నింటికీ ముందు అతనికి ఓ ఘోర ప్రమాదం జరిగింది.
View this post on Instagram
View this post on Instagram