IND Vs IRE Match Delayed: ఇండియా, ఐర్లాండ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం - అభిమానులతో దోబూచులాడుతున్న వరుణుడు!
టీమిండియా, ఐర్లాండ్‌ల మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా రాత్రి 9 గంటలకు ప్రారంభం కావాల్సిన ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఆగి ఆగి వర్షం కురుస్తుండటంతో ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ మొదటిసారి టీమిండియాకు ఈ మ్యాచ్‌లోనే కెప్టెన్సీ వహించనున్నాడు. రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో హార్దిక్‌కు ఈ కెప్టెన్సీ అవకాశం దక్కింది. టీమిండియా తరఫున ఏస్ పేసర్ ఉమ్రాన్ మలిక్ అరంగేట్రం చేయనున్నాడు.
టీమిండియా తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మలిక్
ఐర్లాండ్ తుదిజట్టు
పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్‌బిర్నీ (కెప్టెన్), గ్యారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, మార్క్ అడెయిర్, ఆండీ మెక్‌బ్రెయిన్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, కానర్ ఆల్ఫెర్ట్
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు



















