అన్వేషించండి
Advertisement
IND vs AFG 3rd T20I: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి,పరువు కోసం అఫ్గాన్
India vs Afghanistan 3rd T20I: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది.
అఫ్గానిస్థాన్(Afghanistan)తో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న భారత్(India) క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. చివరి మ్యాచ్ నేడు బెంగళూరు(Bengaluru )లోని చిన్నస్వామి స్టేడియం( M Chinnaswamy stadium) వేదికగా జరగనుంది. ఇది నామమాత్రం మ్యాచే అయినా టీ-20 ప్రపంచకప్‌నకు భారత్ ఆడే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. దీన్ని సన్నాహకంగా సద్వినియోగం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్ జితేశ్ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ లేదా రవి బిష్ణోయ్‌లలో ఒకరిని తప్పించి కుల్‌దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అవేశ్ ఖాన్ కోసం పేసర్ ముకేశ్ కుమార్‌పై వేటు పడనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పరుగుల ఖాతా తెరవని కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్‌లో గాడిన పడాలని చూస్తున్నాడు.
రోహిత్ శర్మతోకలిసి భారత ఇన్నింగ్స్‌ను యశస్వీ జైశ్వాల్ ఆరంభించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా రాణించని శుభమన్ గిల్ అఫ్గానిస్తాన్‌పై సత్తా చాటడం ద్వారా తిరిగి గాడిలో పడాలని కోరుకుంటున్నాడు. మిడిల్‌ఆర్డర్‌లో రింకూ సింగ్ కీలకం కానున్నాడు. వికెట్‌కీపర్‌గా జితేశ్ శర్మకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కింద శివమ్ దుబే, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కింద అక్షర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అర్షదీప్, అవేశ్‌ఖాన్, ముఖేష్ కుమార్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కులదీప్ యాదవ్ లేదా రవిబిష్ణోయ్‌కు తుదిజట్టులో స్థానం దక్కవచ్చు.
మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్ ఆఖరి టీ20లో సత్తాచాటాలని చూస్తోంది. ఇప్పటివరకు భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనూ విజయం సాధించని అఫ్గానిస్థాన్ తొలిసారి నెగ్గి చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పెద్ద పెద్ద జట్లను ఓడించి అఫ్గానిస్తాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని జట్టు కోరుకుంటోంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
అఫ్గానిస్థాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), హజ్రతుల్లా జజాయ్, ఇక్రమ్ అలీఖిల్, నజీబుల్లా జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, మహ్మద్ నబీ, రహ్మత్ షాహ్, షరఫుద్దీన్ అష్రాఖ్, ఫజ్రీద్ అష్రాఖ్, షరఫుద్దీన్ అష్రాఖ్ మహ్మద్ సలీమ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, నూర్ అహ్మద్, కైస్ అహ్మద్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
టెక్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion