అన్వేషించండి

Tahir World Record: 47 ఏళ్ల వయసులోనూ తగ్గని స్పిన్ మ్యాజిక్.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఇమ్రాన్ తాహిర్  

సీపీఎల్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌పై 17 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన‌ అత్యంత పెద్ద వయస్కుడిగా ఇమ్రాన్ తాహిర్ రికార్డు సృష్టించాడు.

Veteran Imran Tahir Scripts CPL History In Providence:  సమకాలీన క్రికెటర్లందరూ రిటైర్మెంట్ ప్రకటించి విశ్రాంతి తీసుకుంటున్న వేళ, 47 ఏళ్ల ప్రాయంలోనూ సౌతాఫ్రికా వెటరన్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన అతడు సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో 5 వికెట్ల ఘనత సాధించాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు నేలకూల్చాడు. దీంతో ప్రత్యర్థి జట్టు 119 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ లక్ష్యాన్ని గయానా జట్టు 18.3 ఓవర్లలో ఛేదించింది. 47 ఏళ్ల 167 రోజుల వయసులో ఈ ఫీట్ నమోదు చేయడం ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలోనే ఐదు వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచి తన పేరిట ఉన్న పాత రికార్డును తానే తిరగరాశాడు. 2025 సీజన్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌పై 46 ఏళ్ల వయసులో 5 వికెట్లు తీసి నెలకొల్పిన రికార్డును ఇప్పుడు మళ్లీ బద్దలు కొట్టాడు. ఈ పోరులో రోస్టన్ చేజ్ వంటి కీలక బ్యాటర్లను అతడు పెవిలియన్ చేర్చాడు.

ఫాల్కన్స్ చేతిలో గయానాకు తొలి ఓటమి.. షాదాబ్ మెరుపులు
అంతకుముందు ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ చేతిలో గయానా అమెజాన్ వారియర్స్ ఈ సీజన్‌లో మొదటిసారి 65 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ జట్టులో కరీమా గోర్, ఎవిన్ లూయిస్ ఆరంభంలో ధాటిగా ఆడారు. అయితే వీరిని గయానా బౌలర్లు కట్టడి చేశారు. లూయిస్‌ను ఇమ్రాన్ తాహిర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి దెబ్బకొట్టాడు. మరో ఎండ్‌లో సీనియర్ స్పిన్నర్ మహ్మద్ నబీతో కలిసి తాహిర్ ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కానీ ఆఖరి ఐదు ఓవర్లలో ఫాల్కన్స్ బ్యాటర్లు ఏకంగా 72 పరుగులు పిండుకున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కేవలం తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 182/5 కు చేర్చాడు.

అల్జారీ జోసెఫ్ పేస్ దాడి.. కుప్పకూలిన వారియర్స్
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా జట్టు పవర్‌ప్లేలో దూకుడుగా ఆడినప్పటికీ, పేసర్ అల్జారీ జోసెఫ్ ఒకే ఓవర్లో రహ్మానుల్లా గుర్బాజ్, షాయ్ హోప్‌లను వెనక్కి పంపి కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ తర్వాత జోషువా జేమ్స్ వేసిన తొలి బంతికే హిట్టర్ షిమ్రాన్ హెట్‌మయర్ డకౌటయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షాదాబ్ ఖాన్, సూఫియాన్ మోఖిమ్ స్పిన్ ధాటికి మిడిల్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది.

117 రన్స్‌కే గయానా ఆలౌట్.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు
తాహిర్, మహ్మద్ నబీ కాసేపు క్రీజులో నిలిచి పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. జోసెఫ్ వేసిన అద్భుతమైన యార్కర్‌కు తాహిర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జోసెఫ్ 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, గయానా జట్టు 15వ ఓవర్లోనే 117 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ గయానా అమెజాన్ వారియర్స్ ఇప్పటికే అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Abhishek ODI Place: వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
Embed widget