IND Vs ENG semifinal: ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం.. ప్రపంచకప్ వేటలో ముగిసిన భారత్ కథ
బ్యాటర్ల విఫలం, బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్ల నిర్లక్ష్యం, కలిసిరాని టాస్.... కారణం ఏదైతేనేమి అనుకోనిది జరిగిపోయింది. ఇంగ్లండ్ పై 10 వికెట్ల ఘోర పరాజయంతో కప్పు గెలవకుండానే టీమిండియా ఇంటికి బయలుదేరింది.
IND Vs ENG semifinal: ఎన్నో కలలు..ఎన్నో ఆశలు..ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడాలని. డూ ఆర్ డై లా ఆ మ్యాచ్ జరిగి ఇండియా విశ్వవిజేతగా నిలిస్తే చూడాలని ప్రతీ భారతీయ క్రికెట్ అభిమానీ కోరుకున్నాడు. సౌతాఫ్రికా మ్యాచ్ ను మినహాయిస్తే లీగ్ స్టేజ్ మొత్తం అద్భుతంగా ఆడింది మన టీమ్. మన కొహ్లీ, మన సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ లతో ఫుల్ గా ఎంజాయ్ చేశాం. ఈ సారి కప్పు మనదే అని సంబరపడ్డాం.
పది వికెట్ల తేడాతో గెలుపు
కానీ.. సెమీస్ లో అనుకోని గండం మనల్ని ఇంటికి పంపించేసింది. ఇంగ్లండ్ బలమైన టీమే కానీ ఈ ప్రపంచకప్ లో తమ స్థాయికి తగిన ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. అదేంటో ప్రపంచంలో ఫామ్ లో లేని జట్టేదైనా ఫామ్ లోకి రావాలంటే ఇండియా మీదే ఆడాలి అన్నట్లు...అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ చెలరేగిపోయారు. వారు సాగించిన విధ్వంసం గురించి ఏమని చెప్పుకోవాలి. మరీ పది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలవడం భారత్ అభిమాని జీర్ణించుకోలేనిదే.
గెలవాలనే కసి ఎక్కడ?
అసలు టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకున్నప్పటి నుంచి విన్నింగ్ షాట్ వరకూ ప్రతీ పాయింట్ దగ్గర ఇంగ్లండ్ మ్యాచ్ గెలవాలనే కసితో ఆడింది. కానీ ఇండియా దానికి పూర్తిగా వ్యతిరేకం. త్వరగా వికెట్లు పడిపోతున్నా కోహ్లీ, హార్దిక్ తప్ప మిగిలిన వారంతా ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అన్నట్లు ఆడారు. రోహిత్, రాహుల్, సూర్య త్వరగా అవుటైపోవటంతో ఓవర్లు పరిగెత్తాయే కానీ స్కోరు బోర్డు కదల్లేదు. కొహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ కొట్టడం... హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించి 63 పరుగులు చేయటంతో టీమిండియా 168 పరుగులు చేయగలిగింది. వాస్తవానికి ఈ పిచ్ పైన ఈ స్కోరు కొంచెం ఫైట్ చేయగలిగేదే.
అయితే టీమిండియా బౌలింగ్ అసలు గెలవాలని వేసినట్లు లేదు. ఫీల్డింగ్ లోపాలు ఎప్పుడూ టీమిండియాను వెంటాడేవే. కనీసం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు తీసే బౌలర్లు కూడా ఈసారి అమాంతం చేతులెత్తేశారు. ఒక్క వికెట్ తీయటానికి, ఓపెనింగ్ పార్టనర్ షిప్ ను బ్రేక్ చేయటానికి కూడా ఆపసోపాలు పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు మన బౌలింగ్ దళం ఎంత దారుణంగా విఫలమైందో.
ఒక్క వికెట్ తీయలేదు
పేసర్లు భువనేశ్వర్, అర్ష్ దీప్, షమీ, ఆల్ రౌండర్ పాండ్యా, స్పిన్నర్లు అక్షర్, అశ్విన్ వికెట్లు తీయటం అటుంచి లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేయటానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చోకర్లు అని వాళ్లను వీళ్లను కాదు 2011 వరల్డ్ కప్ తర్వాత ఆడిన టోర్నమెంట్స్ లో మన పరిస్థితి అలానే తయారైంది. చచ్చీ చెడీ నాకౌట్ స్టేజ్ కు వెళ్లినా ఇలా గెలిచి తీరాల్సిన మ్యాచుల్లో చేతులెత్తేయటం పరిపాటిగా మారిపోయింది. ఈ ఒక్క మ్యాచ్ లో టోర్నీ లో భారత్ ఆడిన ఆటంతా తీసిపారేయలేం కానీ ఈ ఒక్క మ్యాచ్ ఆడకపోతే పడిన కష్టం అంతా వృథా అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని మన బౌలర్లు బౌలింగ్ వేయాల్సింది. మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి మొదలైన పరుగుల వరద ముందు..168 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. ఒక్క వికెట్ తీయకుండానే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓడిపోవటానికే ఆడామా అన్నట్లు ఆడిన ఈ ఆట టోర్నమెంట్ లో మన మొత్తం ప్రదర్శనకే మచ్చలా మిగిలింది.
ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఏ గేమ్. ఆట అన్నాక ఎవరో ఒకరు గెలవాలి. ఒకరు ఓడిపోవాలి. అయితే పోరాడి ఓడిపోయింటే బాగుండేది. ఇప్పుడు సగటు క్రికెట్ అభిమాని ఆవేదన ఇదే. మనం లేని ఈ టోర్నీలో పాకిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్ లో విజేత ఎవరో తెలియాలంటే ఆదివారం వరకూ ఆగాల్సిందే.
India will never forget these two innings. #INDvsENG pic.twitter.com/4nraZirabx
— JahanZaib (@JahanZaibb_) November 10, 2022
And the wait continues
— 𝑲𝒍𝒂𝒖𝒔 🧛 (@_fanofVIRAT18_) November 10, 2022
2014 T20 wc final 💔
2015 WC semi final 💔
2016 T20 wc final 💔
2017 CT final final 💔
2019 WC final 💔
2021 WTC final 💔#INDvsENG pic.twitter.com/vUqRfHKUzM
Most Runs in 2014 wc.
— Guddu pandit 🥚 (@vkholic18_) November 10, 2022
Most Runs For India in 2016 wc.
Most Runs in 2022 wc.
He deserves that t20 wc more than anyone else 💔.#INDvsENG pic.twitter.com/mX6CBfJI6z
England most definitely have the batting line up to chase this down, they’ve proven that on a number of occasions, but I feel India’s got this one. Just the thought of an India/Pakistan final makes my heart beat faster. Hardik & Ashwin to take the match winning poles imo
— AB de Villiers (@ABdeVilliers17) November 10, 2022