అన్వేషించండి
Advertisement
ENG vs NED: టాస్ గెలిచిన ఇంగ్లాండ్, పరువు నిలుపుకుంటుందా?
ODI World Cup 2023: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
England vs Netherlands: ప్రపంచకప్‌లో నేడు మరో నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు సెమీస్ అవకాశాలు కోల్పోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పిచ్ పై బ్యాటింగ్ చేసి తమ పేరు కాస్త అయినా కాపాడుకోవాలని చూస్తున్నాది టీం ఇంగ్లాండ్.
ప్రపంచ కప్‌లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక విజయాన్ని మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఏ ఇంగ్లండ్ జట్టు కూడా ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోలేదు. అందుకే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని బ్రిటీష్ జట్టు చూస్తోంది. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్‌కు కాస్తైన పరువు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఇంగ్లండ్ బ్యాటింగ్ ఈ ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్ ఆశించిన ఆరంభాన్ని ఇవ్వడం లేదు. జో రూట్ క్రీజులో నిలబడడం లేదు. జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ ఫామ్‌లో లేరు. ఇలా బ్రిటీష్ బ్యాటర్లు అంతా ఘోరమైన ఫామ్‌లో ఉన్నారు. వీరు ఈ మ్యాచ్‌లో అయినా రాణించాలని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఇంగ్లండ్ బౌలింగ్ మాత్రం పర్వాలేదనిపిస్తోంది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ బౌలర్లు నిలకడగా రాణించారు. డేవిడ్ విల్లీ ఈ మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడంతో, హ్యారీ బ్రూక్, శామ్ కరణ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు.
కానీ ఒకవేళ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయం సాధిస్తే మాత్రం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. పాయింట్ల పట్టికలో టాప్ ఏడు జట్లు, ఆతిథ్య పాకిస్థాన్ మాత్రమే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుందని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పటికే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలను కూడా కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు... నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లపై మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలని భావిస్తోంది. ఒకప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ అనే పేరున్న ఇంగ్లండ్ జట్టు, విశ్వాసం, ఫామ్ కోల్పోయి కష్టాలు పడుతోంది.
ఇటు నెదర్లాండ్స్ ఏడు మ్యాచుల్లో రెండు విజయాలు, అయిదు పరాజయాలతో నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌కు ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకోవడానికి ఇది సువర్ణావకాశం. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై డచ్ జట్టు విజయాలు సాధించింది. ఇంగ్లండ్‌పై కూడా అద్భుతం చేయాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. ఆల్‌రౌండర్లతో నిండిన నెదర్లాండ్స్ తాము గెలవగలమని ఇప్పటికే నిరూపించింది. టాప్ ఆర్డర్, బౌలింగ్ మరింత నిలకడగా రాణిస్తే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్.
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, వెస్లీ బరేసి, బాస్ డి లీడే, ఆర్యన్ దత్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బెక్ రోలోఫ్, వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
సినిమా
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion