DPL Aryavir Replicates Virender Sehwag: తండ్రికి తగ్గ తనయుడిగా ఆర్యవీర్ సెహ్వాగ్ క్లాస్ షాట్లు.. తండ్రి మార్కు షాట్ తో వైరల్ వీడియో!
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ అచ్చం తన తండ్రిలాగే ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించి ఆకట్టుకున్నాడని అభిమానులు పేర్కొంటున్నారు.

DPL 2026 Aryavir Mimics Virender Sehwag Classic Shots టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భయం లేని బ్యాటింగ్ తో క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 1999 లో పాకిస్తాన్ పై అరంగేట్రం చేసిన సెహ్వాగ్, మూడు ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచ్ ల్లో 17253 పరుగులు, 38 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని అతడి కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ముందుకు నడిపిస్తున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్న ఆర్యవీర్, అచ్చం సెహ్వాగ్ లాగే స్క్వేర్ కట్స్, కవర్ డ్రైవ్స్ వంటి ట్రేడ్‌మార్క్ షాట్లు ఆడి క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. డీపీఎల్ యాజమాన్యం తండ్రీకొడుకుల షాట్లను పోలుస్తూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
Virender Sehwag 🤝 Aaryavir Sehwag.
— CricketGully (@thecricketgully) August 21, 2026
Like Father, Like Son... 🔥 pic.twitter.com/pNDY0db6KB
సెంట్రల్ ఢిల్లీ భారీ స్కోరు..
తాజాగా జరిగిన మ్యాచ్ లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఢీకొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 232 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సిద్ధార్థ్ జూన్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 33 రన్స్ చేసి మెరుపు ఆరంభం ఇవ్వగా, సమర్థ్ సేథ్ కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి సత్తా చాటాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా రాణించడంతో వెస్ట్ ఢిల్లీ ముందు భారీ లక్ష్యం ఎదురైంది
ತಂದೆಗೆ ತಕ್ಕ ಮಗ!😎😍#VirenderSehwag #AryavirSehwag #StarSportsKannada pic.twitter.com/rN8d8X9Eay
— Star Sports Kannada (@StarSportsKan) August 24, 2026
ఓడిన లయన్స్..
233 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్ట్ ఢిల్లీ లయన్స్ 4.5 ఓవర్లలోనే 71/2 స్కోరుతో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఆర్యవీర్ సెహ్వాగ్ వికెట్ కోల్పోయిన తర్వాత క్రిష్ యాదవ్ 26 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 46 నమోదు చేశాడు. అంకిత్ కుమార్ తో కలిసి నాల్గో వికెట్ కు 59 రన్స్ జోడించి జట్టును పోటీలో నిలిపాడు. తేజస్ బరోకా బౌలింగ్ లో క్రిష్ యాదవ్ అవుటైనప్పటికీ, అంకిత్ కుమార్ ఒంటరి పోరాటం చేస్తూ 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.
అకట్టుకున్న ఆర్యవీర్..
అంకిత్ కుమార్ పెవిలియన్ చేరిన తర్వాత రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోవడంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ వెనుకంజలో నిలిచింది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 211 రన్స్ మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, ఆర్యవీర్ సెహ్వాగ్ ప్రదర్శించిన బ్యాటింగ్ స్టైల్, సెహ్వాగ్ ను గుర్తుకు తెచ్చే షాట్లు అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెహ్వాగ్ గతంలో కొట్టిన షాట్లను , తాజా ఆర్యవీర్ షాట్లతో కంపేర్ చేస్తూ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ వీడియోలపై కామెంట్లు, లైకులు, షేర్లు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
Before You Go
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
ట్రెండింగ్ వార్తలు



















