అన్వేషించండి

David Warner: వార్నర్ ఫ్యూచర్ ప్లాన్‌ ఇదే!

David Warner: ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్‌లతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడతానని ఇప్పటికే ప్రకటించిన వార్నర్‌.. ఫ్యూచర్‌ ప్లాన్స్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Dawid Warner: ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) టెస్టులకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మట్‌ నుంచి డేవిడ్‌ భాయ్‌ తప్పుకొన్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్‌ బ్యాటింగ్‌ కు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్‌ భాయ్‌ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్‌పై వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) గెలిచిన మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్‌ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన వార్నర్‌ టెస్ట్‌, వన్డే ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. కంగారు జట్టుకు ఒంటి చేత్తో మరపురాని విజయాలు అందించిన డేవిడ్‌ భాయ్‌.... కెరీర్‌ను ముగించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి వికెట్ల ముందు గోడ కట్టి... ప్రతికూల పరిస్థితుల్లో కంగారు జట్టుకు ఎన్నోసార్లు అద్భుత ప్రారంభాలను వార్నర్‌ అందించాడు. టెస్టు, వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌.. టీ20ల్లో మాత్రమే ఆడనున్నాడు.

రిటైర్‌ తర్వాత ప్లాన్‌ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్‌లతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడతానని ఇప్పటికే ప్రకటించిన వార్నర్‌.. ఫ్యూచర్‌ ప్లాన్స్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్‌లో కోచ్‌గా కూడా వచ్చే అవకాశముందని, తనకూ ఆ ఆసక్తి ఉందని వార్నర్‌ తెలిపాడు. భవిష్యత్తులో క్రికెట్‌ నుంచి పూర్తిగా దూరమైతే కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తానని వార్నర్‌ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌ తర్వాత ఫాక్స్‌ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నేను కోచ్‌గా రాణించగలననే నమ్మకం ఉందని... భవిష్యత్తులో తన ఆశయం కూడా అదేనని అన్నాడు. దీని గురించి ఇప్పటికే తన భార్యతో మాట్లాడానని వార్నర్‌ తెలిపాడు. ‘అవును. నేను ఫ్యూచర్‌లో కోచ్‌గా రావాలనుకుంటున్నాను. అయితే నా భార్యను అనుమతి అడగాలి. కోచ్‌గా ఉండాలంటే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది కదా.. అందుకే ఆమె అనుమతి తప్పనిసరి..’ అంటూ వార్నర్‌ ఫన్నీగా వ్యాఖ్యానించాడు. 

కివీస్‌పై అరంగేట్రం.. పాక్‌పై వీడ్కోలు
2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్‌.. 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో డేవిడ్‌ భాయ్‌ భాగమయ్యాడు. ఓపెనర్‌గా ఎన్నో చిర్మసరణీయ విజయాలను కంగారూలకు అందించాడు. ప్రెజెంటేషన్ సమయంలో ఏకంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న అభిమానులని గ్రౌండ్ లోకి అనుమతించడంతో వార్నర్ వీడ్కోలు మరింత ఘనంగా ముగిసాయి. వీరందరూ వార్నర్.. వార్నర్.. అంటూ గ్రౌండ్ అంతటా హోరెత్తించారు. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో వార్నర్ కు దక్కిన అరుదైన గౌరవంగా దీనిని భావించవచ్చు. పాక్ క్రికెటర్లు సైతం వార్నర్ ఔటైన తర్వాత వరుసగా నిలబడి చప్పట్లతో అభినందించారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు సారథ్యం వహించిన ఈ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్.. తెలుగువాళ్లకు చేరువయ్యాడు. ఆటతోనే కాకుండా.. తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ.. సోషల్ మీడియా ద్వారా తెలుగువాళ్లకు మరింత చేరువయ్యాడు. ఐపీఎల్‌లో అత్యంత ప్రభావవంతమైన విదేశీ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

టాప్ హెడ్ లైన్స్

Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Vaas Bowling Mastermind: వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్  ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్ ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
Split Captaincy Move: సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget