అన్వేషించండి

World Cup Points Table: పాయింట్ల పట్టికలో తిరిగి టాప్‌కు టీమిండియా? - ఇంగ్లండ్ పరిస్థితి పాపం!

ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచాక పాయింట్ల పట్టిక ఎలా ఉంది? ఇంగ్లండ్ పరిస్థితి ఏంటి?

World Cup 2023: ఇంగ్లండ్‌ను ఓడించిన భారత జట్టు మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో టోర్నీలో జోస్ బట్లర్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రయాణం దాదాపుగా ముగిసింది. ఇంగ్లండ్‌పై టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లోనూ, ఇంగ్లండ్ చివరి స్థానంలోనూ ఉంది.

ఈ విజయం తర్వాత భారత్‌ దగ్గర 12 పాయింట్లు ఉన్నాయి. 2023 ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. భారత్ ఆరు మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.

ఇంగ్లండ్‌లో పరిస్థితి మరింత కిందకి...
ఇంగ్లండ్ తమ ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ చివరి స్థానంలో అంటే పదో స్థానంలో ఉంది. ఈ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిని చవి చూడగా, కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.

దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో టెంబా బవుమా జట్టు రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఆరు మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లు సాధించింది. దీని తర్వాత పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఆస్ట్రేలియా 6 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు సాధించింది.

పాయింట్ల పట్టికలో ఇతర జట్లు ఎక్కడ ఉన్నాయి?
శ్రీలంకతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆరేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రేట్ కారణంగా శ్రీలంక జట్టు ఐదో స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. నెదర్లాండ్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ 6 మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించింది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లు రెండేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. షకీబ్ అల్ హసన్ జట్టు మెరుగైన నెట్ రన్ రేట్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు పదో స్థానంలో ఉంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
IND vs NZ Final: భారతీయులను సైలెంట్‌ చేస్తామన్న మిచెల్ సాంట్నర్! సూర్య ఘాటు రిప్లై! బరిలోకి దిగేందుకు గంభీర్‌ సిద్ధమని ప్రకటన! 
భారతీయులను సైలెంట్‌ చేస్తామన్న మిచెల్ సాంట్నర్! సూర్య ఘాటు రిప్లై! బరిలోకి దిగేందుకు గంభీర్‌ సిద్ధమని ప్రకటన! 
IND vs NZ Pitch Update: T20 ప్రపంచ కప్‌ ఫైనల్లో 250 పరుగులు ఖాయమా? అహ్మదాబాద్ పిచ్ ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
T20 ప్రపంచ కప్‌ ఫైనల్లో 250 పరుగులు ఖాయమా? అహ్మదాబాద్ పిచ్ ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget