అన్వేషించండి

అన్ని జట్ల నుంచి ప్లేయర్స్ తో ఓ జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుంది..?

ఓ అద్భుతమైన వరల్డ్ కప్ ముగిసిపోయింది. మరి ఈ టోర్నమెంట్ లో ఓవరాల్ గా మంచి ప్రదర్శనలు చేసిన ఆటగాళ్లు ఎవరు..? అన్ని జట్ల ప్లేయర్స్ తో ఓ బెస్ట్ టీం తయారు చేస్తే అది ఎలా ఉంటుంది...? ఇప్పుడు చూద్దాం.

ఓ అద్భుతమైన వరల్డ్ కప్ ముగిసిపోయింది. ఇంగ్లండ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ గా నిలిచింది. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ చేసిన ఆ జట్టుకు... విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. మరి ఈ టోర్నమెంట్ లో ఓవరాల్ గా మంచి ప్రదర్శనలు చేసిన ఆటగాళ్లు ఎవరు..? అన్ని జట్ల ప్లేయర్స్ తో ఓ బెస్ట్ టీం తయారు చేస్తే అది ఎలా ఉంటుంది...? ఇప్పుడు చూద్దాం.

ముందు ఓపెనర్స్ గురించి మాట్లాడుకుందాం. 

1. అలెక్స్ హేల్స్

అసలు వరల్డ్ కప్ ముందు దాకా హేల్స్... ఇంగ్లండ్ జట్టు సెటప్ లోనే లేడు. జానీ బెయిర్ స్టో గోల్ఫ్ ఆడుతూ గాయపడటంతో టీంలోకి వచ్చిన హేల్స్... ఇన్నేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న కసినంతా ఆటలో చూపించాడు. 6 ఇన్నింగ్స్ లో 212 పరుగులు, 42 యావరేజ్, 147 స్ట్రైక్ రేట్. సో సూపర్ సక్సెస్ అన్నమాట

2. జోస్ బట్లర్ ( కెప్టెన్ & కీపర్ )

స్టార్టింగ్ మ్యాచెస్ లో కాస్త ఇబ్బందిపడ్డా... కీలక మ్యాచెస్ టైంకి రిథమ్ అందుకున్నాడు ఈ ఇంగ్లండ్ కెప్టెన్. 6 ఇన్నింగ్స్ లో 45 యావరేజ్, 144 స్ట్రైక్ రేట్ తో 225 పరుగులు చేశాడు. సో ఇంగ్లండ్ ఓపెనర్సే... ఈ బెస్ట్ టీం ఓపెనర్స్ గా ఫిక్స్ అన్నమాట.

3. విరాట్ కోహ్లీ

ఇది మూడోసారి అనుకుంటా. టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించినా టీమిండియాకు కప్ దక్కకపోవడం. 2014,16 లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచినా... ఈసారి కూడా అదే స్థాయి ప్రదర్శన చేశాడు. టోర్నీ మొత్తం మీద అందరి కన్నా ఎక్కువ కన్నా 296 పరుగులు చేశాడు. కళ్లు చెదిరే 98.67 యావరేజ్. ఇక పాకిస్థాన్ మీద ఇన్నింగ్స్ గురించి రాబోయే కాలంలో చెప్పుకుంటూనే ఉంటారు. 

4. సూర్యకుమార్ యాదవ్
స్కైను ప్రస్తుత టీ20 క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ అని కన్పార్మ్ చేసిన టోర్నమెంట్ ఇది. సూర్య ఆట గురించి చెప్పుకుంటూ పోతే మాటలు చాలవు. 6 ఇన్నింగ్స్ లో 239 పరుగులు. ఆ స్ట్రైక్ రేట్ గురించి చెప్పుకుంటే మైండ్ బ్లోయింగ్ అసలు. 189.68

5. గ్లెన్ ఫిలిప్స్

కివీస్ బ్యాటర్, కీపర్, అవసరమైతే పార్ట్ టైం బౌలర్. ఫీల్డింగ్ లో చిరుత. ఈ టోర్నీలో 5 మ్యాచెస్ లో 201 స్కోర్ చేశాడు. శ్రీలంక మీద క్లిష్ట పరిస్థితుల్లో చేసిన సెంచరీ అయితే ఈ టోర్నీలో బెస్ట్ మూమెంట్స్ లో ఒకటి. 

6. సికందర్ రజా

జింబాబ్వేకు ఈ టోర్నమెంట్ లో పాకిస్థాన్ పై విజయం, సికందర్ రజా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రజా ఒంటిచేత్తో నడిపించాడు. బ్యాటింగ్ లో 219 పరుగులు చేశాడు. బౌలింగ్ లో పది వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో బెస్ట్ ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు.

7. షాదాబ్ ఖాన్
 మరో స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్. అందరూ పాక్ పేసర్ల గురించే మాట్లాడుకుంటారు కానీ వాళ్లతో సమానంగా ప్రభావం చూపిన లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్. 7 మ్యాచెస్ లో 11 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో కూడా సౌతాఫ్రికాతో మ్యాచ్ లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును ఫిఫ్టీతో ఆదుకుని విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 

8. సామ్ కరన్

ఈ 24 ఏళ్ల కుర్ర ఇంగ్లండ్ బౌలర్ లో ఇంకో కోణాన్ని ఆవిష్కరించింది...ఈ వరల్డ్ కప్. ఇన్నాళ్లూ ఆరంభ ఓవర్లలో స్వింగ్ బౌలర్ గా మాత్రమే కనిపించిన కరన్... ఇప్పుడు డెత్ ఓవర్లలోనూ రాణించగలను అని నిరూపించుకున్నాడు. 6 మ్యాచెస్ లో 13 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా కూడా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని పెద్ద గ్రౌండ్లను తన బౌలింగ్ ద్వారా అద్బుతంగా వాడుకున్నాడు.

9. మార్క్ వుడ్

తన ఎక్స్ ప్రెస్ పేస్ తో మిడిల్ ఓవర్లలో ఇంగ్లండ్ పైచేయి సాధించేలా చేశాడు... మార్క్ వుడ్. 4 మ్యాచెస్ ఆడి 9 వికెట్లు తీశాడు. ఆఖర్లో 2 మ్యాచెస్ గాయం వల్ల దూరమయ్యాడు. కానీ తన పేస్ కోసం మాత్రం జట్టులో చోటు ఇచ్చేయొచ్చు.

10. ఆన్రిచ్ నోకియా

మరో అద్భుతమైన పేస్ బౌలర్. సౌతాఫ్రికా సెమీస్ చేరలేదు కానీ ఆన్రిచ్ నోకియా టోర్నమెంట్ అంతా చాలా బాగా బౌలింగ్ చేశాడు. 5 మ్యాచెస్ లో 11 వికెట్లు తీశాడు. కానీ చెప్పుకోవాల్సింది తన బౌలింగ్ ఎకానమీ, యావరేజ్, స్ట్రైక్ రేట్ గురించి. ఓవర్ కు 5.37 మాత్రమే రన్స్ ఇచ్చాడు. ప్రతి 8.55 పరుగులకు వికెట్ తీశాడు. ప్రతి 9.55 బాల్స్ కు వికెట్ తీశాడు.

11. అర్షదీప్ సింగ్

ఈ లాస్ట్ ప్లేస్ గురించి మాకైతే ఇద్దరు ప్లేయర్స్ మధ్య కన్ఫ్యూజన్ నెలకొంది. ఇద్దరూ లెఫ్టార్మ్ పేసర్లే. పాకిస్థాన్ షాహిన్ అఫ్రిదినా లేకపోతే ఇండియన్ అర్షదీప్ సింగ్ కా అని. ఆఖరికి అర్షదీప్ కే ఓటేశాం. ఎందుకంటే తనకు ఇది ఫస్ట్ టోర్నమెంట్. కానీ అలా ఎక్కడా కనపడలేదు. చాలా మెచ్యూర్డ్ గా బౌలింగ్ చేశాడు. టోర్నమెంట్ మొత్తం మీద టీమిండియా బౌలింగ్ లో కన్సిస్టెంట్ గా ఉన్నది ఈ యువ పంజాబీ బౌలర్ మాత్రమే. 6 మ్యాచెస్ లో 10 వికెట్లు తీశాడు. షాహిన్ అఫ్రిది తొలి 2 మ్యాచెస్ లో విఫలమయ్యాడు. ఆ తర్వాత రికవర్ అయ్యాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే అర్షదీప్ సింగ్ ఈ జట్టులో ఫిట్ అవుతాడని మాకు అనిపించింది.

ఇది ఈ వరల్డ్ కప్ లో మాకు అనిపించిన బెస్ట్ టీం. ఇద్దరేసి లెఫ్టార్మ్, రైటార్మ్ పేస్ బౌలర్స్ ఉన్నారు. ఓ లెగ్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్ ఉన్నారు. ఆల్ రౌండర్స్ కు కొదవే లేదు. చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మీక్కూడా ఇదే బెస్ట్ టీం అనిపిస్తోందా లేదా ఏమైనా చేంజెస్ చేస్తారా కామెంట్స్ లో మెన్షన్ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget