అన్వేషించండి

Ben Stokes: చివరి వరకూ పోరాడాం కానీ, స్పిన్నర్ల వల్లే ఇదంతా: స్టోక్స్‌

Ben Stokes : మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కోల్పోవడంపై ఇంగ్లాండ్‌ సారధి బెన్‌ స్టోక్స్‌ స్పందించాడు. తప్పకుండా ఇది గొప్ప టెస్టు మ్యాచ్‌ అని స్టోక్స్‌ అన్నాడు.

England captain praises young spin attack: రాంచీ(Ranchi) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో విజయంతో ఇంగ్లాండ్‌(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌(Bharat) 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కోల్పోవడంపై ఇంగ్లాండ్‌ సారధి బెన్‌ స్టోక్స్‌(Ben Stokes) స్పందించాడు. తప్పకుండా ఇది గొప్ప టెస్టు మ్యాచ్‌ అని స్టోక్స్‌ అన్నాడు. కేవలం ఐదు వికెట్ల తేడాతోనే భారత్ గెలిచిందని అందరూ గుర్తుంచుకోవాలని ఇంగ్లాండ్‌ సారధి తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ప్రతి రోజు ఎత్తుపల్లాలు చవిచూశామని.. తమ జట్టులో పెద్దగా అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నా వారు రాణించారని కొనియాడాడు.  వారి నుంచి ఇంకేం ఆశించలేనని కూడా స్టోక్స్‌ అన్నాడు. తన కెప్టెన్సీలో యువకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నాడు. భారత్‌లో అశ్విన్‌, కుల్‌దీప్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లను ఎదుర్కొని పరుగులు చేయడం సులువేం కాదని తెలిపాడు. జో రూట్‌పై టెస్టుల్లో 12వేలకుపైగా పరుగులు చేశాడని.. అతడిపై విమర్శలను పట్టించుకోనని స్టోక్స్‌ అన్నాడు. 
 
రోహిత్‌ ఏమన్నాడంటే..?
బ్రిటీష్‌ జట్టుపై ఘన విజయం సాధించిన అనంతరం భారత జట్టు సారధి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చినా ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకొంటామని హిట్‌ మ్యాన్‌ స్పష్టం చేశాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని అద్భుతంగా ఆడిన ధ్రువ్‌ జురెల్‌పై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టు సిరీస్‌లో అద్భుత పోరాటంతో యువ ఆటగాళ్లు సత్తా చాటారాన్న రోహిత్‌... మరో మ్యాచ్‌ మిగిలిఉండగానే టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. 
 
ఆధిపత్యం ప్రదర్శించాం
మైదానంలో మేం ఎలా ఆడాలని భావించామో.. అదే తీరులో ఆధిపత్యం ప్రదర్శించామని తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడి నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్లేయర్లూ సత్తా చాటారని హిట్‌మ్యాన్‌ కొనియాడాడు. యువ క్రికెటర్లకు స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయగలగడంలో తాను, కోచ్‌ ద్రావిడ్‌ విజయవంతం అయ్యామని రోహిత్‌ తెలిపాడు. రెండో టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ ఏ ఒత్తిడికి గురికాకుండా గొప్ప పరిణితి ప్రదర్శించాడని హిట్‌ మ్యాన్‌ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీతో సహా సీనియర్లు వచ్చినప్పుడు జట్టులో మార్పుల గురించి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని రోహిత్‌ స్పష్టం చేశాడు. చివరి మ్యాచ్‌లోనూ ఉత్సాహంగా బరిలోకి దిగుతామని రోహిత్ వెల్లడించాడు.
 
కల సాకారమైందన్న జురెల్‌
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ధ్రువ్‌ జురెల్‌..తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్‌ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్‌ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని...  బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్‌.. తన మొదటి సిరీస్‌ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అని. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్‌ తెలిపాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
ICC Action Against Gurnoor Brar: టీమిండియా యంగ్ పేసర్ పై ఐసీసీ కొరడా.. పనిష్మెంట్ తో స్ట్రాంగ్ వార్నింగ్!
టీమిండియా యంగ్ పేసర్ పై ఐసీసీ కొరడా.. పనిష్మెంట్ తో స్ట్రాంగ్ వార్నింగ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget