అన్వేషించండి

AUS vs NED: భారీ స్కోరు ఖాయమేనా? టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్‌ - నెదర్లాండ్ షాకిస్తుందా!

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలన్న పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా.. పసికూన నెదర్లాండ్స్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది.

ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలన్న పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా.. పసికూన నెదర్లాండ్స్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. భారీ స్కోరు చేసి నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ మెరుగుపరుచుకోవాలని కంగారులు భావిస్తున్నారు. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లోకి వస్తాడని భావించినా తుది జట్టులోకి మాత్రం రాలేదు. మార్కస్‌ లబుషేన్‌ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. భారత్‌ వేదికగా జరుగుతున్న మహా సంగ్రామంలో ఆరంభ మ్యాచుల్లో ఓటములతో డీలా పడ్డ కంగారు జట్టు... తర్వాత అద్భుతంగా పుంజుకుని విజయాల బాట పట్టి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీ ఫైనల్‌ దిశగా మరో ఆడుగు ముందుకు వేయాలని చూస్తోంది. ఇప్పటికే డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయొద్దన్న విషయం కంగారు జట్టుకు బాగా తెలుసు. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాంటి అలసత్యం ప్రదర్శించబోమని.. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌ అత్యంత కీలకమని తమకు తెలుసని ఆస్ట్రేలియా సారధి పాట్‌ కమిన్స్‌ వెల్లడించాడు. కంగారు ఓవెనర్లు ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. వాళ్ల విధ్వంసం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పష్టంగా తెలిసింది. ఈ మ్యాచ్‌లోనూ వార్నర్‌ రాణిస్తే ఆసిస్‌ను ఆపడం డచ్‌ జట్టుకు తలకు మించిన బారం కానుంది. అదికాక ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌లో వేగంగా ఎలా పుంజుకోవాలో ఆస్ట్రేలియా జట్టుకు తెలిసినంత బాగా మరే జట్టుకు తెలీదని కూడా మాజీలు గుర్తు చేస్తున్నారు.
 
ప్రపంచకప్‌ అరంభంలో వరుసగా రెండు పరాజయాలతో వెనకపడ్డ  కంగారులు... శ్రీలంక, పాకిస్తాన్‌లపై ఘన విజయాలు సాధించి మళ్లీ బరిలో నిలిచారు. కానీ ఇప్పటికే అద్భుత పోరాటంతో క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్న డచ్‌ జట్టును తేలిగ్గా తీసుకుంటే కంగారులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ధర్మశాలలో ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించిన విషయం కంగారులు మర్చిపోరు. ఈ ప్రపంచకప్‌లో ప్రొటీస్‌ ఓడిపోయిన ఒకే ఒక్క మ్యాచ్‌... నెదర్లాండ్స్‌ చేతుల్లోనే కావడం విశేషం. 
 
కంగారులకు మిడిల్‌ ఆర్డర్‌ కంగారు
ఆస్ట్రేలియా జట్టులో టాపార్డర్‌ బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌ విధ్వంస బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్నారు. పాకిస్థాన్‌పై వీరిద్దరూ 259 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నిర్మించారు. మార్ష్ ఓపెనర్‌గా ఏడు ఇన్నింగ్స్‌లలో 108.3 స్ట్రైక్ రేట్‌తో 351 పరుగులు చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్లు మెరుగ్గా రాణిస్తున్నా మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యం కంగారు జట్టును ఆందోళన పరుస్తోంది. బౌలర్లు కూడా సమష్టిగా రాణిస్తున్నారు.  స్టీవ్ స్మిత్, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్‌ ఇప్పటివరకూ ఒక్క మంచి ఇన్నింగ్స్‌ కూడా ఆడలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ శ్రీలంకపై కీలక అర్ధశతకం సాధించి పర్వాలేదనిపించాడు. వీళ్లు మళ్లీ గాడిన పడితే ఈప్రపంచకప్‌లో కంగారులు మళ్లీ ప్రమాదకరంగా మారుతారు. స్పిన్నర్ ఆడమ్ జంపా, పేసర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌ స్థిరంగా రాణిస్తున్నారు. 
 
చరిత్ర సృష్టిస్తారా..?
నెదర్లాండ్స్‌ ఇప్పటివరకూ వన్డేల్లో ఆస్ట్రేలియాను ఎన్నడూ ఓడించలేదు. 2003, 2007లోఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయారు. కానీ డచ్‌ జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించి.. శ్రీలంకపై కొద్దిలో ఓడిపోయారు. ఇది వారి సత్తాను ప్రపంచానికి చాటింది. నెదర్లాండ్స్‌ జట్టులో స్థిరమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఓపెనర్ మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ ఇప్పటివరకూ శుభారంభం అందించలేదు. ఈ మ్యాచ్‌లో రాణించాలని ఈ ఓపెనింగ్ జోడీ భావిస్తోంది. బాస్ డి లీడే, ఆర్యన్ దత్, వాన్ మీకెరెన్‌లు బంతితో రాణిస్తున్నారు. 
 
ఆస్ట్రేలియా ఫైనల్‌ లెవన్‌: 
డేవిడ్ వార్నర్, మిచెల్‌ మార్ష్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, లబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా
 
నెదర్లాండ్స్ ఫైనల్‌  లెవన్: 
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), కోలిన్ అకెర్మాన్,  బాస్ డి లీడే, ఆర్యన్ దత్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజా నిడమనూరు, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బెక్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, విక్రమ్‌జిత్ సింగ్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget