అన్వేషించండి

Asian Games Squad: జపాన్ ఏర్పాట్లపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి.. ఏషియన్ గేమ్స్ కు టీమ్ ఇండియా బి టీమ్ పంపే ఆలోచ‌న‌లో బోర్డు!

జపాన్ లో సరైన వసతులు లేకపోవడంతో ఏషియన్ గేమ్స్ కు భారత బి జట్టును పంపే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని స‌మాచారం.

BCCI Evaluates Asian Games Arrangements In Japan:  జపాన్ లోని ఐచి నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఈవెంట్ కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ క్రికెటర్ల కోసం చేసిన ఏర్పాట్లు, హోటల్ వసతులపై బీసీసీఐతో పాటు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. పరిస్థితులను సమీక్షించడానికి ఒక అబ్జర్వర్‌ను జపాన్ కు పంపాలని బోర్డు భావిస్తోంది. ఒకవేళ వసతులు ఏమాత్రం సరిగ్గా లేవని తేలితే ప్రధాన జట్టుకు బదులుగా 'బి' టీమ్ ను అక్కడికి పంపే అంశాన్ని బోర్డు పరిశీలిస్తోందని తెలుస్తోంది.

అసౌక‌ర్యాల పుట్ట‌..
జపాన్ లో క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై బీసీసీఐ వర్గాలు అన్ హేపీగా ఉన్నాయి. "ఏసీసీ సమావేశంలో జపాన్ ఒలింపిక్స్ నిర్వాహకులకు మా అభ్యంతరాలను తెలిపాం. క్రికెటర్ల కోసం డ్రెస్సింగ్ రూమ్ లను టెంట్లలో ఏర్పాటు చేశారు. పైగా వాష్ రూమ్స్ ఆ టెంట్ల నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఆటగాళ్లకు కేటాయించిన హోటల్ గదులు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి" అని బోర్డు ప్రతినిధి తెలిపాడు. అబ్జర్వర్ ఇచ్చే గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మహిళల క్రికెట్ ఈవెంట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు, పురుషుల విభాగం మ్యాచ్ లు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వ‌హిస్తారు.

బ‌ల‌మైన స్క్వాడ్..
చైనాలో చివ‌రిసారిగా జ‌రిగిన‌ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన ఇండియా, ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకోవడానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బలమైన స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ జట్టులో వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ ఉండగా, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఆడ‌తారు.

మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయ‌కత్వం..
మహిళల విభాగానికి కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ గా స్మృతి మంధాన వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, జి కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయంక పాటిల్, రాధా యాదవ్, నందిని శర్మ జట్టులో స్థానం పొందారు. అయితే వసతులపై నెలకొన్న సందిగ్ధత తేలిన తర్వాతే సీనియర్ల ప్రయాణంపై స్పష్టత రానుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Threat: వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget