Chief Selector Sacked: 3 ఐసీసీ ట్రోఫీలు అందించినా వేటు తప్పలేదు.. రోహిత్ తో విభేదాలు బోర్డు జోక్యంతో అగార్కర్‌కు నిష్క్రమణ, బుమ్రా కెప్టెన్సీ నుంచే మొదలైన రచ్చ
మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిన సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌కు పొడిగింపు ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయించడంతో అతడి పదవీకాలం ముగింపునకు వచ్చింది.

Differences Over Team Selection Lead To Ajit Agarkar Exit: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించే ఆలోచనలో బోర్డు లేదని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. జూలై 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో భారత్ ఎన్నో చారిత్రక విజయాలను అందుకుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో పాటు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీలు, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను ముద్దాడింది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (టెస్టులు, టీ20ల నుంచి), రవిచంద్రన్ అశ్విన్ (అన్ని ఫార్మాట్ల నుంచి) లాంటి దిగ్గజాల రిటైర్మెంట్లు కూడా జరిగాయి. అయినప్పటికీ జట్టు ఎంపిక విషయంలో బోర్డు పెద్దల మితిమీరిన జోక్యాన్ని అగార్కర్ పలు సందర్భాల్లో తీవ్రంగా వ్యతిరేకించినట్లు తాజాగా ఒక కథనంలో వెల్లడైంది.
బుమ్రా కెప్టెన్సీ నుంచే మొదలైన వివాదం..
అగార్కర్, బీసీసీఐ మధ్య విభేదాలు జూలై 2023 ఐర్లాండ్ పర్యటన నుంచే మొదలైనట్లు సమాచారం. దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉండి పునరాగమనం చేసిన జస్ప్రీత్ బుమ్రాపై వర్క్‌లోడ్ తగ్గించాలని, అతడికి కెప్టెన్సీ ఇవ్వకూడదని అగార్కర్ భావించాడు. ఆ టూర్‌కు రుతురాజ్ గైక్వాడ్‌ను సారథిగా నియమించాలని ప్రతిపాదించాడు. అయితే బుమ్రా నాయకత్వం వహించడానికి ఆసక్తిగా ఉన్నాడంటూ బోర్డు పెద్దలు జోక్యం చేసుకుని పేస్ గుర్రానికే పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి సెలెక్టర్ల నిర్ణయాల్లో అధికార యంత్రాంగం ప్రభావం కొనసాగుతూ వచ్చింది.
రోహిత్ భవిష్యత్తు.. వీవీఎస్ తో పాలసీ విభేదాలు
రోహిత్ శర్మ భవిష్యత్ ప్రణాళికలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఏర్పడిన విధానపరమైన తేడాలు అగార్కర్ నిష్క్రమణను వేగవంతం చేశాయి. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని అగార్కర్ భావించినప్పటికీ కొత్త ముఖాన్ని తీసుకురావాలని బోర్డు ఇప్పటికే గట్టి నిర్ణయానికి వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటన వైఫల్యంపై ముంబైలో జరిగిన కీలక సమీక్ష సమావేశానికి అగార్కర్ కనీసం ఆన్‌లైన్ ద్వారా కూడా హాజరుకాకపోవడం వివాదాన్ని తారస్థాయికి చేర్చింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అతడికి మద్దతుగా మాట్లాడినా బోర్డులోని అత్యధికులు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అరుదైన ట్రాక్ రికార్డు ఉన్నా వీడ్కోలు.. కొత్త సారథి వేట
గత మూడేళ్లలో నాలుగు ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల ఫైనల్స్‌కు చేరిన బలమైన జట్లను ఎంపిక చేసిన ఘనత అగార్కర్ ప్యానెల్‌కు ఉంది. అయినప్పటికీ అంతర్గత విభేదాల కారణంగా అతడి ప్రస్థానం ముగియనుండగా, కొత్త చీఫ్ సెలెక్టర్ కోసం బోర్డు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
Before You Go
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
ట్రెండింగ్ వార్తలు



















