అన్వేషించండి

ఆసియాను గెలిచాం - నెక్స్ట్ ఏంటి? - మెగా టోర్నీకి ముందు టీమిండియాకు మినీ సవాల్

ఆసియా కప్ - 2023 ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ముందు మరో కీలక సిరీస్ ఆడనుంది.

2018లో ఆసియా కప్ గెలిచిన తర్వాత ఐదేండ్లుగా  మేజర్ ట్రోఫీ గెలవలేక చతికిలపడుతున్న భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు మళ్లీ  ట్రాక్ లోకి వచ్చింది. ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంకతో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి 8వ ఆసియా కప్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.  మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్ ముందు భారత్‌కు ఈ విజయం ఉత్సాహాన్ని ఇచ్చేదే. అయితే  ఆసియా కప్ - వన్డే వరల్డ్ కప్‌కు మధ్య భారత్‌కు ఓ మినీ పరీక్ష  ఎదురుకానుంది.   ఆ పరీక్షలో భారత్  కంగారూలను  ఎదురోవాల్సి ఉంది. 

వన్డే వరల్డ్ కప్ కంటే ముందే భారత్.. ఆస్ట్రేలియాతో మూడు  వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.  వరల్డ్ కప్ సన్నాహకాల్లోనే భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ ఈనెల 22 నుంచి మొదలుకానుంది. ఐదు రోజుల వ్యవధిలో భారత్ - ఆస్ట్రేలియాలు మూడు వన్డేలు ఆడనున్నాయి.  ఈ సిరీస్‌కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం.  

భారత్ - ఆసీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ : 

- తొలి వన్డే :  సెప్టెంబర్ 22  (శుక్రవారం) - మొహాలీ
- రెండో వన్డే : సెప్టెంబర్ 24 (ఆదివారం) - ఇండోర్
- మూడో వన్డే : సెప్టెంబర్ 27 (బుధవారం) - రాజ్‌కోట్ 

- ఈ మ్యాచ్‌లు అన్నీ మధ్యాహ్నం  1.30 గంటలకు మొదలవుతాయి. 

వన్డే సిరీస్ తర్వాత  భారత్ - ఆసీస్‌లు అక్టోబర్ 08న తమ వన్డే వరల్డ్ కప్ వేటను మొదలుపెడతాయి. చెన్నై వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.  వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా ఆసీస్  మరికొన్ని రోజులు భారత్‌లోనే ఉంటుంది. ఇరు జట్ల మధ్య  నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. 20‌24 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నాహకంగా ఈ సిరీస్‌ను నిర్వహించనున్నారు. 

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లైవ్.. 

- ఈ వన్డే సిరీస్  ప్రత్యక్ష ప్రసారాలను టెలివిజన్‌లో అయితే  స్పోర్ట్స్ 18లో.. యాప్స్, వెబ్‌సైట్స్‌లో అయితే జియో  సినిమా యాప్‌లో  చూడొచ్చు. ప్రస్తుతానికైతే  జియో సినిమా యాప్ ఉచితంగానే అందుబాటులో ఉంది. వచ్చే ఐదేండ్ల కాలానికి గాను టీమిండియా స్వదేశంలో ఆడే  మ్యాచ్‌ల హక్కులను ఇటీవలే వయాకామ్ 18 దక్కించుకున్న నేపథ్యంలో  ఆ సంస్థకు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. 

జట్లు :  వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించిది. సౌతాఫ్రికా పర్యటనకు మిస్ అయిన పలువురు కీలక ఆటగాళ్లు  భారత్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు.   పాట్ కమిన్స్ సారథిగా ఉన్న ఈ జట్టులో   స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్,    వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తిరిగి జట్టుతో చేరనున్నారు.  ఈ సిరీస్‌ కోసం భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. 

ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, స్టీవ్ స్మిత్ , అలెక్స్ కేరీ, మార్నస్ లబూషేన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, జోష్ హెజిల్‌వుడ్, తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Shami Career End..!.: షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
Ajinkya Rahane Retirement: టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget