T20 world cup 2022: 1992 సీన్ రిపీట్.. ఈసారి కప్పు పాకిస్థాన్ దేనా!
T20 world cup 2022: టీ20 ప్రపంచకప్ ను పాకిస్థాన్ గెలవనుందా! ఈసారి పొట్టి కప్పును గెలుచుకునే అదృష్టం పాక్ జట్టుదేనా! అంటే అవుననే అంటున్నారు ఆ దేశ అభిమానులు. అంతేకాదు దానికి కారణాలను చూపిస్తున్నారు.
T20 world cup 2022: టీ20 ప్రపంచకప్ ను పాకిస్థాన్ గెలవనుందా! ఈసారి పొట్టి కప్పును గెలుచుకునే అదృష్టం పాక్ జట్టుదేనా! అంటే అవుననే అంటున్నారు ఆ దేశ అభిమానులు. అంతేకాదు దానికి కారణాలను చూపిస్తున్నారు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టుకు.. ఇప్పుడు ఫైనల్ కు చేరుకున్న పాక్ టీంకు పోలికలు చూపిస్తూ ఈసారి విజయం తమదే అంటూ ఆనందపడుతున్నారు పాకిస్థాన్ మాజీలు, అభిమానులు. మరి ఆ పోలికలేంటా చూద్దామా..
ఒకసారి 1992 జరిగిన ప్రపంచకప్ ను పరిశీలిస్తే.. ఇప్పుడు ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ జట్టు ప్రయాణం ఎలా సాగిందో అప్పుడు పాక్ జట్టు ప్రయాణం అలానే ఉంది.
1992 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రదర్శన
- ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ మైదానంలో తొలి మ్యాచ్ ఓడిపోయింది.
- గ్రూప్ దశలో భారత్ చేతిలో ఖంగుతింది.
- గ్రూపు దశలో చివరి వరుసగా చివరి 3 మ్యాచులను గెలిచింది.
- చివరి రోజు సెమీఫైనల్ కు అర్హత సాధించింది. అదీ ఒక్క పాయింట్ తేడాతో
- సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడింది.
- సెమీస్ లో లక్ష్యాన్ని ఛేదించి కివీస్ పై విజయం సాధించింది.
- అదే మెల్ బోర్న్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ గెలిచి కప్పు గెలుచుకుంది.
ఇదీ 1992 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రయాణం. అచ్చం అలాగే ప్రస్తుత ప్రపంచకప్ లో పాకిస్థాన్ ప్రదర్శన సాగింది. సూపర్- 12 తొలి మ్యాచులో భారత్ చేతిలో ఓడిన పాక్.. రెండో మ్యాచులోనూ జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. అయితే చివరి 3 మ్యాచుల్లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఐర్లాండ్ చేతిలో ఓడిపోవటంతో పాక్ కు సెమీఫైనల్ అవకాశం దక్కింది. అదీ ప్రొటీస్ కన్నా ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్న కారణంగా. సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడి విజయం సాధించింది. 1992 లో జరిగినట్లే రెండోసారి బ్యాటింగ్ చేస్తూ ఈ విజయం అందుకుంది.
కాబట్టి ఈ పోలికలన్నీ చూపిస్తూ ఈసారి పాకిస్థానే 2022 పొట్టి ప్రపంచకప్పును అందుకుంటుందని ఆ దేశ మాజీలు, అభిమానులు ఆశిస్తున్నారు.
ఇప్పటికే ఫైనల్ చేరుకున్న పాకిస్థాన్.. ఈ రోజు జరిగే భారత్- పాకిస్థాన్ రెండో సెమీఫైనల్ విజేతతో కప్పు కోసం పోటీపడనుంది.
WHAT A WIN, PAKISTAN! 🤯
— ICC (@ICC) November 9, 2022
Pakistan have reached their third Men's #T20WorldCup final 👏#NZvPAK pic.twitter.com/dumaIcWVeZ
Walking into the ICC Men's #T20WorldCup 2022 𝐅𝐈𝐍𝐀𝐋 in style!
— Star Sports (@StarSportsIndia) November 9, 2022
Describe your reaction to 🇵🇰's 7-wicket win against New Zealand in 1️⃣ word! #PAKvNZ #NZvPAK #PAKvsNZ pic.twitter.com/ObFQjfM1Ap