Commonwealth Games 2022: టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణం! వెయిట్ లిఫ్టింగ్‌లో వికాస్‌కు రజతం
Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల టేబుల్ టెన్నిస్‌లో భారత్ పడిసి పతకం ముద్దాడింది.
Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పురుషుల టేబుల్ టెన్నిస్‌లో భారత్ పడిసి పతకం ముద్దాడింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సింగపూర్‌ను 3-1 తేడాతో ఓడించింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో వికాస్ ఠాకూర్ రజతం గెలిచాడు. దాంతో భారత్ ఖాతాలో 12 పతకాలు చేరాయి.
3⃣rd GOLD FOR MEN'S TEAM 🏓🏓 at #CommonwealthGames 🔥🔥🔥#TeamIndia🇮🇳 defeat Team Singapore 🇸🇬 3️⃣-1️⃣ in the FINAL, defending their 2018 CWG 🥇
— SAI Media (@Media_SAI) August 2, 2022
Bringing home 1️⃣1️⃣th Medal for India at @birminghamcg22
Superb Champions!!#Cheer4India#India4CWG2022
1/1 pic.twitter.com/MgIcBmMl2o
టేబుల్ టెన్నిస్ ఫైనల్లో మొదట సాతియన్ గుణశేఖరన్, హర్మీత్ దేశాయ్ తలపడ్డారు. అద్భుతమైన విజయంతో టీమ్‌ఇండియాకు 1-0 ఆధిక్యం అందించారు. అయితే పురుషుల సింగిల్స్‌లో అనుభవజ్ఞుడైన శరత్ కమల్‌ను క్లియరెన్స్ చెవ్ ఓడించాడు. దాంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత సాతియన్, హర్మీత్ పురుషుల సింగిల్స్‌తో తమ మ్యాచులు గెలవడంతో భారత్ 3-1 తేడాతో స్వర్ణం ముద్దాడింది.
1️⃣2️⃣th 🏅 FOR INDIA 🇮🇳 🥳@thakur671 wins his 3rd Consecutive medal 🥈🥉🥈 at #CommonwealthGames 🔥 🔥
— SAI Media (@Media_SAI) August 2, 2022
Vikas clinched 🥈 in Men's 96kg Final with a total lift of 346Kg 🏋♂️ at #B2022
Snatch- 155kg
C&J- 191kg
With this #TeamIndia🇮🇳 wins its 8️⃣th Medal in 🏋♀️ 💪#Cheer4India pic.twitter.com/eSuHjBRoPF
పురుషుల వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజత పతకం వచ్చింది. 96 కిలోల విభాగంలో అతడు 346 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 155, క్లీన్ అండ్ జర్క్‌లో 191 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లో వికాస్‌కు వరుసగా ఇది మూడో పతకం. ప్రస్తుత పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఎనిమిదో పతకం కావడం గమనార్హం. అంతకు ముందు లాన్ బౌల్స్‌లో అమ్మాయిల జట్టు బంగారు పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇప్పటి వరకు 12 పతకాలు అందాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, కెనడా, దక్షిణాఫ్రికా మనకన్నా ముందున్నాయి.
Great news in Table Tennis! Congratulations to the dynamic team of G. Sathiyan, Harmeet Desai, Sharat Kamal and Sanil Shetty for winning the Gold medal at the CWG. This team has set high benchmarks, be it in skill or determination. Best wishes for their future endeavours. pic.twitter.com/whzotVIXrh
— Narendra Modi (@narendramodi) August 2, 2022