(Source: ECI/ABP News/ABP Majha)
Ronaldo Joins Man United: జువెంటస్ క్లబ్‌ను వీడిన రొనాల్డో... మాంచెస్టర్ యునైటెడ్‌కి రొనాల్డో
రొనాల్డో జువెంటస్ క్లబ్బుకు గుడ్ బై చెప్పాడు. తాజాగా అతడు మాంచెస్టర్ యునైటెడ్‌తో ఒప్పందం చేసుకున్నాడు.
ఫుట్‌బాల్ దిగ్గజం, ఐదు సార్లు బ్యాలన్ డి ఓర్ అవార్డు గ్రహీత క్రిస్టియానో రొనాల్డో జువెంటస్ క్లబ్బుకు గుడ్ బై చెప్పాడు. తాజాగా అతడు మాంచెస్టర్ యునైటెడ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకోసం 28మిలియన్ల యూరోలు యునైటెడ్... రొనాల్డోకి ఇవ్వనున్నట్లు సమాచారం.
Man Utd have made a €28m offer for Cristiano Ronaldo 😲 pic.twitter.com/4xWcxwjWS5
— Goal (@goal) August 27, 2021
రొనాల్డో జువెంటస్ క్లబ్‌తో కొనసాగడానికి ఆసక్తిగా లేడు అని ఆ క్లబ్ మేనేజర్ మాక్స్ అలెగ్రీ స్పష్టం చేశాడు. క్లబ్‌తో భవిష్యత్తులో కొనసాగలేనని గురువారం రొనాల్డో చెప్పాడు. నిన్న జరిగిన ట్రైనింగ్‌లో అతడు పాల్గొనలేదు. ఇదే విషయాన్ని ఈ రోజు ఉదయం జట్టులోని ఆటగాళ్లకి వివరించాడు. ‘ఫుట్‌బాల్‌లో ఎవరి అభిరుచులు వారికి ఉంటాయి. ఎవరి మార్కెట్ వారిది. ఈ క్లబ్ కోసం రొనాల్డో ఎంతో చేశాడు. అతడో ఛాంపియన్. అతడి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నా’ అని అలెగ్రీ తెలిపాడు.
Manchester United are preparing their official contract proposal to Cristiano Ronaldo! Jorge Mendes will receive it soon. Man Utd are “confident” now. 🔴🇵🇹 #MUFC #Ronaldo
— Fabrizio Romano (@FabrizioRomano) August 27, 2021
Paul Pogba is currently not involved in any talk. Man City are OUT of the race for Cristiano Ronaldo. pic.twitter.com/Ay4GUZfduS
‘ఈ వార్త గురించి ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. ఈ క్లబ్‌లో రొనాల్డో లెజండ్. ఎప్పటికీ అతడు గ్రేటెస్ట్ ప్లేయర్. నేను అతనికి కోచింగ్ ఇచ్చాను. నేను గాయపడిన సమయంలో అతడే జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అంతటి ప్రతిభ అతడి సొంతం. రొనాల్డో, మెస్సీ... ఈ ఇద్దరూ గొప్ప ప్లేయర్లు. అతడు జువెంటస్‌ను వీడుతున్నాడంటే నమ్మలేకపోతున్నా. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మా మధ్య మంచి సంబంధం ఉంది.
పోర్చుగల్‌కి చెందిన క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటాస్ అవీరో 198 ఫిబ్రవరి 5న జన్మించాడు. రొనాల్డో పోర్చుగల్ జాతీయ జట్టుకు 2003 నుండి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రొనాల్డో జువెంటస్ క్లబ్బుకు ఫార్వార్డ్ స్థానంలో ఆడేవాడు. రొనాల్డో ఐదు సార్లు బ్యాలన్ డి ఓర్ అవార్డులు, నాలుగు సార్లు యూరోపియన్ గోల్డెన్ షూస్‌ను గెలుచుకున్నాడు. ఈ రెండు రికార్డులు సాధించిన ఏకైక ఐరోపా ఆటగాడు.
Welcome 𝗵𝗼𝗺𝗲, @Cristiano 🔴#MUFC | #Ronaldo
— Manchester United (@ManUtd) August 27, 2021
రొనాల్డో తన కెరీర్‌లో 30 ట్రోఫీలను గెలుచుకున్నాడు. వీటిలో ఏడు లీగ్ టైటిల్స్, 5 UEFA ఛాంపియన్స్ లీగ్స్, ఒకటి UEFA యూరోపియన్ ఛాంపియన్‌షిప్, ఒకటి UEFA నేషన్స్ లీగ్ టైటిల్స్ ఉన్నాయి. రొనాల్డోకు UEFA ఛాంపియన్స్ లీగ్ చరిత్రలో అత్యధిక గోల్స్ (134), అత్యధిక అసిస్ట్ (41) రికార్డులు కలిగి ఉన్నాడు. క్లబ్, దేశం కోసం 750 కి పైగా గోల్స్ చేశాడు. 100 అంతర్జాతీయ గోల్స్ ఘనత సాధించిన రెండో ఆటగాడు, ఐరోపా దేశాల్లో మొదటివాడు.