IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది.
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. దీనికి రెండు టీమ్స్ ఇప్పటికే రెడీ అయ్యాయి. చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి ఇండియా, పాక్ మంచి ఊపు మీదున్నాయి. అయితే వాస్తవంగా ఈ ప్రపంచకప్‌కు ముందు భారత్ పాకిస్తాన్ మధ్య పెద్ద మ్యాచ్‌లు చాలా లేవు. ప్రపంచకప్‌లో ఈ రెండు దేశాలు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు బీసీసీఐ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో అహ్మదాబాద్‌కు వచ్చే విమానాల టికెట్ల ధరలు, హోటళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
How Can Do it this BCCI😡
— Deepak Jangid (@itsDeepakJangid) October 13, 2023
What BCCI and Jay Shah have done in the honor of Pakistan team will not be tolerated at all.
Our soldiers are fighting bravely against Pakistan supported terrorists on the border.
Maximum Likes For Indian Army🇮🇳#BoycottIndoPakMatch #BoycottBCCI pic.twitter.com/7gfBis4Ro8
ఈనెల 5తేదీన వన్డే వరల్‌కప్ ప్రారంభమైనప్పటికి గ్రాండ్ సెలబ్రేషన్స్ జరగలేదు. తాజాగా అహ్మదాబాద్‌లో భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్స్‌కి ప్లాన్ చేసింది బీసీసీఐ. మ్యాచ్‌కి అభిమానులు భారీగా వస్తుండడంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సింగర్లు అర్జిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్విందర్ సింగ్‌తో ప్రత్యేక ప్రదర్శనలను సిద్ధం చేసింది. ఈ యాక్టివిటీస్ 12.30 గంటలకు మొదలవుతాయి. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చే అవకాశముంది.
Cricket match is nothing infront of our Soldiers.
— GlobalIntellectHub (@hub_intellect) October 13, 2023
Enemies are always enemy.
Shame on BCCI and Jay Shah
Pakistani doesn't deserve this type of welcome.#BoycottIndoPakMatch #INDvsPAK pic.twitter.com/4tIuE2Mw1s
ఇటువంటి సమయంలో మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో ట్విట్టర్)లో #BoycottIndoPakMatch ట్రెండింగ్‌లో ఉంది. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయ సంబంధాల కారణంగా IND vs PAK ప్రపంచ కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఒక విభాగం సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తోంది. పాక్ కారణంగా భారత్ ఎంతో నష్టపోయిందని, వందల మంది సైనికులను పాక్ పొట్టన పెట్టుకుందంటూ మండిపడుతూ భారత్, పాక్ మ్యాచ్‌ను బహిష్కరిచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
I've been seeing lot of clips since couple of days. I was ignoring it because I knew what hyderabadis are upto, it was quite expected. But, It's truly disgusting to realise BCCI is equally responsible, show money to BCCI they'll lure like nothing#BoycottIndoPakMatch#ShameOnBCCI pic.twitter.com/bBFgpVhRxN
— The Right Patriot (@bharatvichaar) October 13, 2023
ప్రపంచకప్ చరిత్రలో ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు ఒకరితో ఒకరు ఏడుసార్లు తలపడ్డారు. అయితే, ఏడు సందర్భాల్లో భారత్ విజేతగా నిలిచింది. ఎనిమిదో సారి గెలిచి విజయపరంపర కొనసాగించాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర తిరగరాయాలని పాక్ భావిస్తోంది.