By: ABP Desam | Updated at : 02 Jun 2023 06:14 PM (IST)
లక్ష్యసేన్ ( Image Source : PTI )
Thailand Open 2023:
భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21-19, 21-11 విజయం సాధించాడు. మలేసియా షట్లర్ లియాంగ్ హావోను వరుస గేముల్లో ఓడించాడు.
తొలి గేమ్ గెలిచేందుకు లక్ష్య సేన్ కష్టపడాల్సి వచ్చింది. లియాంగ్ 11-10తో ఆధిపత్యం చెలాయించాడు. ఆ తర్వాత 16-10తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. ఈ సిచ్యువేషన్లో లక్ష్యసేన్ బలంగా పుంజుకున్నాడు. వరుసగా 6 పాయింట్లు సాధించి 17-16తో ప్రత్యర్థిని వెనక్కినెట్టాడు. ఇదే ఊపులో 21-19తో గేమ్ గెలిచాడు. సేన్.. రెండో గేమ్‌లో తన మూమెంటమ్‌ను మరింత పెంచాడు. తెలివైన షాట్లు, స్మాష్‌లతో లియాంగ్‌ను కోర్టుకు ఇరువైపులా తిప్పాడు. 11-8 వద్ద గాయపడటంతో ప్రత్యర్థి కొంత విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత మెరుగ్గా ఆడలేదు. 21-11తో గేమ్‌ను ఫినిష్ చేసిన సేన్ సెమీస్‌కు చేరుకున్నాడు.
Lakshya triumphs and enters the Semi Finals🎉🙌
📸: @badmintonphoto#ThailandOpen2023 #IndiaontheRise#Badminton pic.twitter.com/ezq5hZEpQ2— BAI Media (@BAI_Media) June 2, 2023
లక్ష్య సేన్ తన తర్వాతి మ్యాచులో రెండో సీడ్ ఆటగాడు థాయ్‌లాండ్ షట్లర్ కున్లవుత్ విటిసార్న్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో లు గ్వాంగ్ జును అతడు 18-21, 21-14, 21-11 తేడాతో ఓడించాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సేన్ మినహా మిగతా భారతీయులు అంతా ఇంటిముఖం పట్టారు. నేడు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో కిరన్ జార్జ్‌ను టోమా జూనియర్ పాపోవ్ 21-16, 21-17 తేడాతో ఓడించాడు.
Also Read: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
Kiran's thrilling run comes to an end 💔
— BAI Media (@BAI_Media) June 2, 2023
We comeback stronger 💪
📸: @badmintonphoto#ThailandOpen2023 #IndiaontheRise#Badminton pic.twitter.com/hjrYo4Thrb
అంతకు ముందే సైనా నెహ్వాల్ సైతం ఓటమి చవిచూసింది. ప్రి క్వార్టర్స్‌లో 21-11, 21-14 తేడాతో ఆమెను హీ బింగ్ జియావో ఓడించింది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్ కరోలినా మారిన్ 21-18, 21-13 తేడాతో అస్మిత చాలిహాను దెబ్బకొట్టింది. పురుషుల డబుల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ ప్రి క్వార్టర్లో ఇండోనేసియా జోడీ మహ్మద్ షోబుల ఫిక్రి, బగాస్ మౌలానా చేతిలో ఓటమి చూశారు.
Go well boys 💪🔥
— BAI Media (@BAI_Media) June 1, 2023
📸: @badmintonphoto #ThailandOpen2023 #IndiaontheRise#Badminton pic.twitter.com/canPLnDyiR
Narendra Modi Stadium: వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్
నాకు ముందుకు సాగడమే తెలుసు , మిచెల్ జాన్సన్ విమర్శలపై వార్నర్
Sreesanth vs Gambhir: ముదురుతున్న గంభీర్- శ్రీశాంత్ వివాదం, శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు జారీ
T20 World Cup 2024 logo: టీ 20 ప్రపంచకప్ ఏర్పాట్లు షురూ, ఆకట్టుకుంటున్న లోగోలు
sreesanth vs gambhir : శ్రీశాంత్-గంభీర్ మాటల యుద్ధం, షాక్ అయ్యానన్న శ్రీశాంత్ భార్య
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
/body>