Asia Cup 2022: ప్చ్.. జస్ట్ మిస్! ఆసియాకప్ ఫైనల్ చేరని టీమ్‌ఇండియా!
Asia Cup 2022: ఆసియా కప్ హాకీలో టీమ్‌ఇండియా ఫైనల్ చేరలేకపోయింది. సూపర్-4లోని ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచును విజయంతో ముగించలేదు.
Asia Cup 2022 India vs Korea match ends in a 4-4 draw in the Super 4-s stage: ఆసియా కప్ హాకీలో టీమ్‌ఇండియా ఫైనల్ చేరలేకపోయింది. సూపర్-4లోని ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచును విజయంతో ముగించలేదు. దక్షిణ కొరియాతో జరిగిన ఈ మ్యాచును 4-4తో డ్రా చేసుకుంది. లీగులో మెరుగైన గోల్ స్కోరు తేడాతో కొరియా ఫైనల్‌కు అర్హత సాధించింది. తుది పోరులో మలేషియాతో తలపడనుంది.
Asia Cup 2022: India vs Korea match ends in a 4-4 draw in the Super 4-s stage
— ANI (@ANI) May 31, 2022
India fails to make it to the final of Asia Cup 2022
టీమ్‌ఇండియా ఇప్పుడు మూడో స్థానం కోసం జపాన్‌తో తలపడనుంది. అందులో గెలిస్తే కాంస్య పతకం అందుకుంటుంది. ఆసియాకప్ కప్ ఫైనల్ చేరాలంటే దక్షిణ కొరియాను భారత్ కచ్చితంగా ఓడించాల్సిన పరిస్థితి నెలకొంది. దురదృష్టవశాత్తు రెండో శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు ఆ పనిచేయలేకపోయింది. ఆఖరి క్వార్టర్లో స్కోర్లు సమమైనా మూమెంటమ్ కొనసాగించలేదు. విన్నింగ్ గోల్ కొట్టలేక ఇబ్బంది పడింది. ఈ టోర్నీ సాంతం టీమ్‌ఇండియా ఇలాగే ఆడింది.
అంతకు ముందు సూపర్-4 టీమ్‌ఇండియా విచిత్రంగా క్వాలిఫై అయింది. ఇండోనేషియాతో మ్యాచులో ఏకంగా 16 గోల్స్ కొట్టింది. దీంతో పాకిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్ చివరి క్వార్టర్‌లో ఏకంగా ఏడు గోల్స్‌ను భారత్ సాధించడం విశేషం.
భారత ఆటగాళ్లలో డిప్సన్ టిర్కే ఐదు గోల్స్, పవర్ రాజ్‌భర్ మూడు గోల్స్‌తో చెలరేగారు. కార్తీక్ సెల్వం, అభరన్ సుదేవ్, ఎస్వీ సునీల్ రెండేసి గోల్స్ సాధించగా... నీలం సందీప్, ఉత్తం సింగ్ చెరో గోల్ కొట్టారు. ఇండోనేషియా అస్సలు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. అక్కడక్కడా ప్రయత్నించినా బలమైన భారత్ డిఫెన్స్ ముందు నిలబడలేకపోయారు.
భారత్ మొదటి క్వార్టర్ ముగిసేసరికి 3-0, రెండో క్వార్టర్ ముగిసేసరికి 6-0, మూడో క్వార్టర్ ముగిసేసరికి 10-0 ఆధిక్యంతో నిలిచింది. చివరి క్వార్టర్‌లో ఏకంగా ఆరు గోల్స్ సాధించి మ్యాచ్‌ను గెలుచుకోవడంతో పాటు సూపర్-4లోకి కూడా అడుగుపెట్టింది.
ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో భారత్ 1-1తో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఆ తర్వాత జపాన్ చేతితో 2-5తో ఓడింది. పాకిస్తాన్ కూడా జపాన్ చేతిలో 2-3తో ఓడటంతో... ఇండోనేషియాతో మ్యాచ్‌ను 15 గోల్స్ తేడాతో గెలిస్తే సూపర్-4లో అడుగు పెట్టే ఈక్వేషన్‌లోకి టీమిండియా ఎంటర్ అయింది. ఇండోనేషియాను 16-0తో ఓడించి సూపర్-4లోకి అడుగుపెట్టింది.
A scintillating game ends in a DRAW!! 💙
— Hockey India (@TheHockeyIndia) May 31, 2022
IND 4:4 KOR #IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsKOR @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/eor7QdAZuB