అన్వేషించండి

Virat Kohli: మోసగించా, నమ్మించేందుకు ప్రయత్నించా, బయటకు తెలీనివ్వలేదు- విరాట్‌ కోహ్లీ!

Virat kohli Mentally Down: తొలిసారి నెల రోజులు బ్యాటు ముట్టుకోలేదని మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. నాలుగైదేళ్లుగా ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడటంతో మానసికంగా అలసిపోయానని పేర్కొన్నాడు.

Virat kohli Mentally Down, Asia Cup 2022: కెరీర్లో తొలిసారి నెల రోజులు బ్యాటు ముట్టుకోలేదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. నాలుగైదేళ్లుగా ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడటంతో మానసికంగా అలసిపోయానని పేర్కొన్నాడు. బలహీనంగా ఉన్నామని అంగీకరించడంతో పోలిస్తే బలంగా ఉన్నామని మోసగించుకోవడం మరింత దారుణమని వెల్లడించాడు. రాబోయే రెండు నెలల్లో తమ జట్టు రెండు కీలక టోర్నీలు ఆడనుందని వివరించారు. అభిమానులు తమకు అండగా ఉండాలని కోరాడు.

నెల రోజులు విశ్రాంతి

ఆసియాకప్‌లో తొలి మ్యాచుకు ముందు విరాట్‌ కోహ్లీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాకిస్థాన్‌తో అత్యంత కీలకమైన మ్యాచుకు ముందు మనసు విప్పి మాట్లాడాడు. బ్యాటింగ్‌ పరంగా అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పిన విరాట్‌ మూడేళ్లుగా సెంచరీ చేయలేదు. ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరు అందుకోలేదు. ఐపీఎల్‌ ముందు నుంచీ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అతడి మానసిక ఒత్తిడి, పని భారం తగ్గించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత పూర్తిగా విశ్రాంతి ఇచ్చింది.

బలమైన వాడినే.. అయినా!

'ఈ పదేళ్లలో తొలిసారి నెల రోజుల పాటు నేను బ్యాటు పట్టుకోలేదు. నన్ను నేనే మోసం చేసుకుంటున్నానని గుర్తించాను. లేదు, నీలో ఇంటెన్సిటీ ఉందని ఇన్నాళ్లూ నన్ను నేనే నమ్మించుకొనే ప్రయత్నం చేశాను. కానీ నా శరీరం మాత్రం ఆపేయాలని చెప్పింది. వెనక్కి తగ్గి కాస్త విరామం తీసుకోవాలని నా మనసు చెప్పింది. మానసికంగా నేనెంతో బలంగా ఉంటాను. అలాగే ఉండేవాడిని. అయితే ప్రతి ఒక్కరికీ ఒక పరిమితి ఉంటుంది. దానిని గుర్తించడం అవసరం. లేదంటే పరిస్థితులు అనారోగ్యకరంగా మారతాయి' అని విరాట్‌ కోహ్లీ అన్నాడు.

నాకూ పరిమితి!

'ఫామ్‌లో లేని గడ్డు రోజులు నాకెన్నో పాఠాలు నేర్పించాయి. నేను వాటిని బయటకు తెలియనిచ్చేవాడిని కాదు. అవి వచ్చాక ఆస్వాదించడం మొదలుపెట్టాను. నేను మానసికంగా అలసిపోయానని చెప్పేందుకు సిగ్గుపడను. అందరికీ ఇదెంతో సామాన్య విషయం. కానీ మనం దాని గురించి బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరిస్తాం. మానసికంగా బలహీనంగా ఉన్నట్టు కనిపించేందుకు ఇష్టపడం. అందుకే బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కన్నా పటిష్ఠంగా ఉన్నామని మోసగించుకోవడం మరింత దారుణం' అని విరాట్‌ వివరించాడు.

ఎప్పట్లాగే అండగా ఉండండి

టీమ్‌ఇండియాలో నాణ్యమైన ప్రతిభావంతులు ఉన్నారని విరాట్‌ పేర్కొన్నాడు. అందరూ సమష్టిగా రాణిస్తామని తెలిపాడు. ఈ రెండు నెలల్లో ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌ ఉన్నాయని వివరించాడు. అందులో గెలిచేందుకు అభిమానులు తమకు ఎప్పట్లాగే అండగా ఉండాలని కోరాడు.

టాప్ హెడ్ లైన్స్

Abhishek ODI Place: వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
Ishan Milestone Record: సూర్యకుమార్  ఆల్ టైమ్ రికార్డును తుడిచిపెట్టిన ఇషాన్ కిషన్.. 2000 పరుగుల క్లబ్‌లోకి పాకెట్ డైనమో
సూర్యకుమార్  ఆల్ టైమ్ రికార్డును తుడిచిపెట్టిన ఇషాన్ కిషన్.. 2000 పరుగుల క్లబ్‌లోకి పాకెట్ డైనమో

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget