అన్వేషించండి

ఎవరైనా గెలవచ్చు, కానీ ఇంగ్లండ్ తప్ప - యూరో 2020 ఫైనల్‌పై ఒక భారతీయుడి ఆలోచన!

యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఇటలీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ మ్యాచ్‌పై ఒక భారతీయుడి అభిప్రాయం.

ఆదివారం మధ్యాహ్నాలు మనం సాధారణంగా కుటుంబంతో రిలాక్స్ అవుతూ ఉంటాం. అయితే సుదీర్ఘ కాలం తర్వాత ట్రోఫీ కోసం జూలై 11వ తేదీన పోటీ పడుతున్న ఇంగ్లండ్, ఇటలీల మధ్య జరగనున్న యూరో 2020 ఫైనల్‌ను చూడటం కంటే విశ్రాంతి తీసుకోవడానికి మంచి మార్గం ఏం ఉంటుంది? ఇటలీ చివరిసారిగా 1968లో యూరో కప్‌ను గెలుచుకుంది. ఇక ఇంగ్లాండ్ చివరిసారిగా 1966లో జర్మనీపై 4-2 తేడాతో విజయం సాధించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ అసలు ఎప్పుడూ యూరోపియన్ కప్‌ను సొంతం చేసుకోలేదు. ఇంగ్లండ్ ఒక ఫుట్‌బాల్ దేశం కాకపోతే దానికి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు. అయితే ఇంగ్లండ్ అభిమానులు తమ పోకిరిలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నిజానికి అమెరికన్ జర్నలిస్ట్ బిల్ బుఫోర్డ్ 1990లో ఫుట్‌బాల్ పోకిరిలపై ఒక ఆకర్షణీయమైన పుస్తకాన్ని రాశాడు. దాని పేరే ‘అమాంగ్ ది థగ్స్’. చాలా మ్యాచ్‌ల కోసం ప్రయాణించిన మాంచెస్టర్ యునైటెడ్‌లోని ఇంగ్లీష్ ఫుట్‌బాల్ అభిమానులపై బిల్ ఎక్కువగా దృష్టి సారించాడు. అక్కడే అతను ఈ ఫుట్‌బాల్ పోకిరీలను చూశాడు. మతోన్మాదులు పరమతాల వారిపై ఎంత తీవ్రమైన కోపంతో ఉంటారో వీరు కూడా ఇతర ఫుట్ బాల్ జట్లపై అంతే కోపంతో ఉంటారు. శ్వేత జాతీయవాద పార్టీ అయిన నేషనల్ ఫ్రంట్‌కు అనుబంధంగా ఉన్న ఆంగ్లేయులలో ఉండే కొన్ని లక్షణాలు వీరి వద్ద కూడా ఉన్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, 1990లో ప్రపంచ కప్ ఆడుతున్న సార్డినియాలో ఈ ఫుట్‌బాల్ అభిమానుల మధ్య బిల్ బుఫోర్డ్ అల్లర్లలో చిక్కుకున్నప్పుడు, వారు హింసను ఎంజాయ్ చేయడాన్ని గుర్తించాడు. హింస, ఈ ఫుట్‌బాల్ అభిమానుల గురించి ఇలా వ్రాశాడు, 'వారి సంఘవిద్రోహ ఆనందం, వారి మనస్సును మార్చే అనుభవం, అడ్రినలిన్ ప్రేరేపించే ఆనందం' అది 'సింథటిక్‌గా ఉత్పత్తి చేయబడిన మాదకద్రవ్యాలు తీసుకునే వారిలో ఉండే లక్షణాల లాగా ఉన్నాయి.’

లాస్ ఏంజెల్స్‌లోని నా ఇంటి వద్ద ఆదివారం మధ్యాహ్నం యూరో కప్‌ని చూస్తున్నప్పుడు, అది కేవలం మధ్యాహ్నం విశ్రాంతి మాత్రమే. కొన్ని సమయాల్లో ఈ 'అందమైన ఆట'కు నేను ఆసక్తిగల అనుచరుడిని అయినప్పటికీ, నేను ఫుట్‌బాల్ అభిమానానికి దూరంగా ఉన్నప్పటికీ ఈ 'అభిమాని' అనే పదానికి నాకు సరిగ్గా అర్థం తెలియదు. ఒకరు ఒక జట్టు లేదా మరొక జట్టుకు ఎలా 'అభిమాని' అవుతారనేది ఏదో ఒక రహస్యం. ఒక వ్యక్తి తన అభిమానిగా మారినప్పుడు, బొంగురుగా అరవడం, ఇతరులపై బీరు సీసాలు విసరడం, ముష్టిఘాతాలకు దిగడం, విధ్వంసానికి పాల్పడడం వంటివి అస్సలు అర్థం కాదు. వెంబ్లీలో సరిగ్గా అదే జరిగింది. అక్కడ టిక్కెట్లు లేకుండా కొన్ని వేల మంది ఇంగ్లీష్ అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించి, పెద్ద గొడవను సృష్టించారు. కొంతమందిని విపరీతంగా కొట్టారు. బుఫోర్డ్ వివరించినట్లుగా ఆట ప్రారంభం కాబోతున్నందున్న ఉత్సాహంలోనే వారు అలా ప్రవర్తించారు. అదే ఉత్సాహం నాకు మధ్యాహ్న సమయంలో విశ్రాంతిగా ఉండాల్సిన దాదాపు మూడు గంటల సమయాన్ని పూర్తి స్థాయి టెన్షన్‌గా మార్చింది. నిర్ణీత సమయంలో 1-1తో స్కోర్లు సమయం అయ్యాక, ఇటలీ పెనాల్టీ కిక్‌లతో ఇంగ్లండ్‌ను ఓడించిన తర్వాత మాత్రమే నాకు ఉపశమనం లభించింది.

డెన్మార్క్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌లో ఉండాలా వద్దా అనే ప్రశ్న ఎదురైంది. డెన్మార్క్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు పెనాల్టీ కిక్ ఇవ్వడాన్ని ప్రశ్నించింది నేను ఒక్కడినే కాదు, నాలోని భారతీయుడు కూడా. వలసవాదం, ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన లోని జీవితకాల విద్యార్థి అయిన నాలోని భారతీయుడు, 18వ శతాబ్దం సగం నుంచి భారత పాలకులతో సంతకం చేసిన ఏ ఒప్పందాన్ని కూడా గౌరవించకుండా ఎప్పుడూ న్యాయం, ఫెయిర్‌ప్లే గురించి మాట్లాడే దేశంగానే ఇంగ్లండ్‌ను చూస్తాడు. యునైటెడ్ స్టేట్స్‌లోని ఈ బ్రిటన్‌ల సోదరులు ఇంకా అధ్వాన్నంగా ఉన్నారు. ఎందుకంటే వారు ఇతర భారతీయులతో-స్థానిక అమెరికన్లతో ప్రతి ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా వారిని నిర్మూలించేందుకు చక్కగా సహకరించారు. ఇంగ్లండ్ అర్హత లేకపోయినా ఈ పెనాల్టీని పొందినట్లయితే, అది లోపభూయిష్టమైన రిఫరీ తీర్పు నుంచి ఈ ప్రయోజనాన్ని పొందింది. దీని గురించి చింతించడంలో పెద్దగా ప్రయోజనం లేదనిపించింది. నేను ఇంగ్లండ్ లేదా ఇటలీకి ఎవ్వరికీ అభిమానిని కాదు. ఈ విషయంలో, ఇంగ్లండ్, ఇతర దేశాల మధ్య ఎవరిని ఎంచుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు. నేను సాధారణంగా క్రికెట్, జాత్యహంకారం, జాతీయవాదంపై దివంగత మార్క్ మార్క్‌సీ రాసిన పుస్తకం శీర్షికను ఎంచుకుంటాను. అదే  Anyone but England (2005). అయితే దీనికి మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగితే, నేను ఇంగ్లండ్‌నే ఎంచుకుంటాను. ఎందుకంటే ఆస్ట్రేలియా జాత్యహంకారం మరింత అసహ్యంగా ఉంటుంది.

మ్యాచ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లో, ఇంగ్లీష్ డిఫెండర్ ల్యూక్ షా స్కోర్ చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో అతని మొదటి గోల్ . అలాగే యూరో ఫైనల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన గోల్. ఇది మంచి గోల్. టోర్నమెంట్ అంతటా ఉన్నట్లుగా ఇంగ్లండ్ మంచి ఆరంభాన్ని పొందింది. నా గుండె ఆవేశంగా కొట్టుకోవడం ప్రారంభించింది కానీ నేను ఫుట్‌బాల్ పోకిరిని కాదు. కనీసం అభిమానిని కూడా కాదు. ఇక వెంబ్లీ, ఇంగ్లండ్‌లోని సమూహాలను ఊహించండి. నా ఆలోచనల కంటే బీర్ వేగంగా ప్రవహించే లెక్కలేనన్ని పబ్బులు. ఇతర ఆలోచనలు నా మనస్సులో పరుగెత్తాయి. ఇంగ్లాండ్ గెలిస్తే, యూరోపియన్ యూనియన్ నుండి ఇంగ్లాండ్ నిష్క్రమణ  ఆ దేశంలో ఫుట్‌బాల్‌ను పునరుజ్జీవింపజేసిందని బ్రెగ్జిట్‌ను సమర్థించే వారు పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌కు అనుకూల లేదా వ్యతిరేక వాదనలకు ఇంగ్లండ్ విజయానికి ఏదైనా అంతర్గత సంబంధం ఉందా అనేది ప్రశ్న కాదు. లోగోలు ప్రపంచాన్ని ఆదేశిస్తాయనే భ్రమల్లో లేని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇంగ్లీష్ విజయం దాని స్వంత రెడ్‌నెక్స్ మరియు ట్రోగ్లోడైట్‌లను మరింత బలపరుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Embed widget