అన్వేషించండి

వినాయకుడి పూజకు తులసిని వాడకూడదట - ఎందుకో తెలుసా?

తులసిని మాత్రం గణేష పూజకు ఉపయోగించరు. అలా ఎందుకు ఉపయోగించరో మీకు తెలుసా? పురాణాల్లో ఈ విషయం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

పూజల్లో మొదటి పూజ గణపతికే. ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజయినా. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలుగకూడదని మొదటి పూజ ఆయనకు చేస్తారు. ఆయన్ని స్మరించనిదే ఏ పని తలపెట్టరు. అయితే, తులసి ఆకులను మాత్రం ఉపయోగించరు. ఎందుకో తెలుసా?

బుధవారం రోజున వినాయక పూజ చేస్తే మంచి ఫలితాల లభిస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. కార్యభంగం, జాప్యం లేకుండా ఉంటుందని నమ్మకం, ఆటంకాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది. వినాయక పూజలో రకరకాల మోదకాలు సమర్పిస్తారు. అంతే కాదు వీటితోపాటు కుంకుమ, అక్షతలు, దర్భలు, పువ్వలు, సుగంధ ద్రవ్యాలు, సింధూరం వంటివన్నీ గణేష పూజలో వాడుతారు. కానీ తులసిని మాత్రం గణేష పూజకు ఉపయోగించరు. అలా ఎందుకు ఉపయోగించరో మీకు తెలుసా? పురాణాల్లో ఈ విషయం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

‘‘నాక్షతైః అర్చయేద్విష్ణుం
న తులస్యా గణాధిపం!’’

అంటే అక్షతలతో విష్ణుమూర్తికి, తులసితో గణపతిని పూజించరాదని శాస్త్ర ప్రమాణం. ఇందుకు పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది.

ఒక సారి వినాయకుడు గంగా నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్నాడు. అదే సమయంలో ధర్మాధ్వజుడి కుమార్తే తులసి తన వివాహ కోరిక ఫలించేందుకు తీర్థయాత్రలో ఉంటుంది. అనేక తీర్థయాత్రలు చేస్తూ అందులో భాగంగా గంగా తీరానికి చేరుకుంటుంది. గణపతి గంగా తీరంలో తపస్సులో ఉండటాన్ని గమనిస్తుంది. తపస్సు చేస్తున్న గణేషుడు రత్నఖచిత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అతడి శరీరం సుగంధ ద్రవ్యాల లేపనంతో, మెడలో పారిజాతాల మాలతో, అనేక అందమైన బంగారు, రత్నహారాలతో అలంకరించబడి ఉంది. అతడి నడుముకు ఎర్రని మృదువైన పట్టు వస్త్రం ఉంది.

తులసీ దేవి అతడి అందమైన రూపానికి ఆకర్శితురాలవుతుంది. గణేషుని వివాహమాడాలనే కోరిక మనసులో కలిగింది. ఆమె మనసులోని ఆ కోరిక వల్ల అతడికి తపోభంగం అయ్యింది. తులసి వల్ల తన తపోభంగం జరిగిందని తెలుసుకుని తులసికి తాను బ్రహ్మచారినని, ఆమె కోరికను తిరస్కరించాడు. ఆ తిరస్కారానికి ఆమెకు కోపం వచ్చింది. దీర్ఘకాలం పాటు బ్రహ్మచారిగా ఉండిపొమ్మని శపిస్తుంది. అకారణంగా శాపానికి లోనైన వినాయకుడికి కూడా కోపం వచ్చి తులసిని అసురుడిని భర్తగా పొందుతావని, అతడి చరలో ఉండిపోతావని  శపిస్తాడు.

అది విని తులసి.. గణేషుడిని క్షమించమని వేడుకుంటుంది. గణేష శాపం వల్ల తులసికి చంకచూడుడనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది. అతడికి కృష్ణ కవచం ఉందనే గర్వంతో లోక కంటకుడిగా మారి అందరిని బాధిస్తుంటాడు. తులసి పాతివ్రత్య మహత్మ్యం వల్ల అతడిని సంహరించడం విష్ణుమూర్తికి దుర్లభం అవుతుంది. వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత శ్రీహరి అనుగ్రహం వల్ల తులసి.. మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్య భంగానికి వినాయకుడు కారణమని తెలుసుకుని శిరస్సులేకుండా జీవించమని తులసి శపిస్తుంది. అది తెలుసుకున్న గణపతి తులసి సాన్నిహిత్యాన్ని తాను సహించబోనని ప్రకటించాడు. అందుకే గణేష పూజలో తులసి నిషిద్ధం. కానీ వినాయక చవితి నాడు మాత్రం ఈ నియమానికి మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త  పురాణంలో ఉంది. అందుకే వినాయక చవితి మినహా మరే రోజునా తులసిని వినాయక సేవకు వినియోగించరు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget