Divine Powers: మీకు ఇలాంటి సంకేతాలు అందుతున్నాయా? దైవిక శక్తులు ఏదో చెప్పాలనుకుంటున్నాయ్!
కర్మలను అనుసరించే మన జీవితం ఆధారపడి ఉందని అందరూ భావిస్తారు. దైవానుగ్రహంతోనే కష్టాలను అధిగమిస్తామని విశ్వసిస్తారు. మరి దైవం సహాయపడాలనుకుంటే ఎలాంటి సంకేతాలు పంపుతుంది.
Divine Powers: సమీప భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి మనందరికీ అర్ధమయ్యే సందర్భాలు ఉంటాయి. ఇది ముందస్తుకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సందర్భంలో ఏమి జరగబోతోందో స్పష్టంగా చూడలేరు. కానీ ఏదో జరగబోతోందనే బలమైన అనుభూతిని మాత్రం పొందుతుంటారు. మీకు ఎదురయ్యే ఇలాంటి అనుభూతులను ఎప్పుడూ విస్మరించకూడదు.
ఈ సంకేతాలు దైవిక శక్తులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి మనల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం. ఫలితంగా భవిష్యత్‌లో ఎదురయ్యే అనూహ్యమైన లేదా అవాంఛనీయ సంఘటనల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. రాబోయే సంఘటనల గురించి మనల్ని హెచ్చరించే అలాంటి నాలుగు సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.
పక్షుల ఈకలు దొరుకుతున్నాయా
మీరు వెళ్లే దారిలో ఎక్కడో ఒకచోట పక్షుల ఈకలు చెల్లాచెదురుగా పడిఉండటం తరచుగా మీకు కనిపిస్తుంటే, మిమ్మల్ని రక్షించడానికి ఒక అదృశ్య శక్తి ఎల్లప్పుడూ నీడలా మీ వెన్నంటి ఉందని దైవిక శక్తుల నుంచి వచ్చిన సంకేతం. ఇది కష్ట సమయాల్లో మీకు సహాయపడే అదృశ్య సానుకూల శక్తి. మీరు సంక్షోభాల్లో కూరుకుపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా సహాయం కోసం ఆ శక్తిని ప్రార్థించవచ్చు.
నిర్దిష్ట సంఖ్యలు తరచూ కనిపించడం
జ్యోతిషశాస్త్రంలో కొన్ని సంఖ్యలను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. అలాంటి వాటిలో 3, 8 అనే రెండు సంఖ్యలు ముఖ్యమైనవి. ఎవరైనా ఈ సంఖ్యలను పదే పదే చూసినట్లయితే, ఏదో ఒక దైవిక శక్తి మీతో నిరంతరం ఉంటుంది, అది మీకు ఏదైనా తెలియజేయాలనుకుంటోందని సంకేతంగా చెబుతారు. రెండెంకల సంఖ్యలను మళ్లీ మళ్లీ చూడటం కూడా ఈ అంశానికి సూచికగా భావించాలి.
మీ నాడీ వ్యవస్థలో ప్రకంపనలు
మన శరీరానికి కేంద్ర బిందువు మణిపూరక చక్రం. ఇది మన నాడీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు నుంచి మన శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు పంపుతూ.. అదే సమయంలో ఆ భాగాల సందేశాలు మెదడుకు అందుతాయి. మీరు ఈ ప్రదేశంలో పదే పదే ఏదైనా అనుభూతి చెందుతుంటే లేదా మీరు ఆందోళన చెందుతుంటే, దైవిక శక్తులు మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం.
చెవిలో గుసగుసలు
మీ చెవిలో ఎవరైనా మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారని మీరు పదేపదే అనుభూతి చెందుతుంటే, మీ చుట్టూ ఎవరి భౌతిక ఉనికిని మీరు చూడలేకపోతే.. దైవిక శక్తులు మీతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయని అర్థం. దైవిక శక్తులు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది మీ మంచి కోసమే అని గుర్తుంచుకోండి. అందువల్ల, అలాంటి గుసగుసలు విన్న వెంటనే మీరు వెంటనే అప్రమత్తంగా ఉండాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించగలరు.