అన్వేషించండి

Laddu Holi: అక్కడ లడ్డూలతో హోలీ జరుపుకుంటారట - ఎందుకో తెలుసా?

హోలీ అంటే కలర్స్‌తో జరుపుకుంటారని మనకు తెలుసు. కానీ, ఇదేంటీ కొత్తగా లడ్డూలతో హోలీ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, అక్కడి సాంప్రదాయం గురించి మీరు తప్పక తెలుసుకోవల్సిందే.

ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగ జరుపుకుంటారు. కులమత బేధాలు లేకుండా అందరూ హోలీ సంబరాల్లో పాల్గొంటారు. కానీ దేశంలో ఒక చోట మాత్రం హోలీని భిన్నంగా జరుపుకుంటారు. కలర్స్‌తోపాటు లడ్డూలతో కూడా హోలీ చేసేకోవడం అక్కడి ప్రత్యేకత. బ్రజ్‌లోని మథుర, బర్సానా, గోకుల్, బృందావన్ ప్రాంతాల్లో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఇది చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారు. వసంత కాల ప్రారంభంలో బ్రజ్ లో రంగోత్సవ్ దాదాపు 40 రోజుల పాటు సాగుతుంది. హోలీతోపాటు లడ్డూ హోలీ, ఫూలన్ హోలీ, లత్మార్ హోలీలను రంగ్వాలీ హోలీతో పాటుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష అష్టమి తేదన బర్సానలో లడ్డూ హోలీ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆ పర్వదినం ఫిబ్రవరి 27న వస్తోంది. అంటే హోలీ కంటే ముందుగానే లడ్డుల హోలీ ప్రారంభం కానుందన్నమాట. మరి దాని ప్రత్యేకత ఏమిటో చూసేయండి.

లడ్డూ హోలీ ఎలా మొదలైంది?

మామూలుగా ఆనంద సమయాల్లో లడ్డులు పంచుకోవడం ఆనవాయితి. కానీ బర్సానలో లత్మార్ హోలీకి ముందు లడ్డులను గులాల్, అబీర్ మాదిరిగానే ఒకరి మీద ఒకరు విసురుకుంటారు. బర్సానాకు రావల్సిందిగా నందగావ్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించడం కూడా ఇక్కడ ఒక సాంప్రదాయం. ఈ సంప్రదాయం ఈ లడ్డూ హోలీతో ముడి పడి ఉందని చెబుతుంటారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వందల కిలోల లడ్డుల వర్షం కురిపిస్తారు. ఈవేడుక చూసేందు దేశవిదేశాల నుంచి జనం వస్తారు. వచ్చిన వారంతా లడ్డూ ప్రసాదం తీసుకొని ఆనందిస్తారు.

లడ్డూ హోలీ ప్రత్యేకత ఇదే

లడ్డూ హోలి గురించి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ద్వాపర యుగంలో బర్సానా నుంచి హోలీ ఆహ్వానం తీసుకుని స్నేహితులు నందగావ్ వెళ్లారు. అప్పుడు నందుడు ఈ ఆహ్వానాన్ని అంగీకరించి తన పూజారి ద్వారా బర్సానాలోన వృషభానుకి వార్తను పంపించారు. ఈ సమయంలో బర్సానాలోని గోపికలు ఆ పూజారి చెంపలకు గులాల్ పూశారు. పూజారి దగ్గర గులాల్ లేకపోవడంతో గోపికల మీద లడ్డూలు విసరడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి లడ్డూ హోలీ ప్రాచూర్యంలో ఉంది. ఇప్పటికీ బర్సానాలో లడ్డూ హోలీ చాలా ఘనంగా చేస్తారు. లడ్డూ హోలీ రోజున ఆలయ ప్రాంగణం మొత్తం రాధా కృష్ణుల ప్రేమతో తడిసి ముద్దవుతుంది. ఆలయం ప్రాంగణంలో రాధాకృష్ణుల కీర్తనలు హోలీ పాటల రూపంలో మారు మోగుతాయి. భక్తజనం కూడా రాధాకృష్ణుల ప్రేమతో ఆడి పాడుతారు. లడ్డూ ప్రసాదం స్వీకరించి వారి ఆశీర్వాదం దొరికినట్టుగా భావిస్తారు. ఈ రోజు వందలాది లడ్డులు అమ్ముడవుతాయి. ఆలయాల్లో ప్రత్యేకంగా ఈ లడ్డులను తయారు చేస్తారు. రంగులకు బదులుగా ‘తియ్యని’ వేడుక జరుపుకుంటారు. మరి మీకు కూడా ఈ వేడుకలో పాల్గోవాలని ఉందా? హోలీకి ముందే అక్కడికి చేరుకోండి. వారం రోజుల వేడుకలో పాలు పంచుకోండి.

Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

టాప్ హెడ్ లైన్స్

05-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
05-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!
భారతదేశ దేవాలయాల్లో విలక్షణ నైవేద్యాలు: మీ ఊహకు అందని ఆచారాలు!
భారతదేశ దేవాలయాల్లో విలక్షణ నైవేద్యాలు: మీ ఊహకు అందని ఆచారాలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget