అన్వేషించండి

Karungali Mala Rules In Telugu: కరుంగలి మాలకు ఇతర మాలలకు తేడా ఏంటీ? ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

Karungali Mala : కరుంగలి మాలకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు మిగతా మాలలతో ఉన్న తేడా ఏంటీ? ఈ మాల ధరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ ?

Karungali Mala Rules In Telugu: భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక నమ్మకాలు ఎప్పటి నుంచో ప్రజల జీననంలో భాగంగా ఉన్నాయి. ఈ క్రమంలో రుద్రాక్ష, తులసి, స్పటిక మాలలతోపాటు కరుంగలి మాల గురించి ఇటీవల కాలంలో చర్చ ఎక్కువైంది. ఈ మాల ధరించడం వల్ల ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు, అయితే ఈ మాలను ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతర మాలలతో పోలిస్తే దీనికి ప్రత్యేక స్థానం ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఈ కథనంలో కరుంగలి మాల ధరించేటప్డుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర మాలలతో దాని తేడాలు, దీని ప్రాముఖ్యతను వివరంగా చూద్దాం. 

కరుంగలి మాల అంటే ఏంటీ?
కరుంగలి మాల జమ్మి జెట్టు నుంచి తయారు అవుతుంది. దీనిని ఆంగ్లంలో ఎబోనీ అని అంటారు. ఈ చెట్టు కలప నల్లగా, గట్టిగా బరువుగా ఉంటుంది. సాధారణంగా 108 పూసలతో తయారయ్యే ఈ మాలలు తమిళనాడు, కేరళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మాల ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, వాస్తుల దోషాలు, వ్యాపారాభివృద్ధి వంటి ప్రయోజనాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. ఈ మాలను సినీ సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు ధరించడంతో దీని ప్రాచుర్యం బాగా పెరిగింది. 

కరుంగలి మాల ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరుంగలి మాల ఒక పవిత్రమైన హారంగా భావిస్తారు. కాబట్టి దీనిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటించాలి. 

మద్యం, మాంసాహారం, శృంగార కార్యకలాపాలు నిషేధం:- కరుంగలి మాల ధరించినప్పుడు మద్యపాన, మాంసాహారం తీసుకోకూడదు. అలాగనే శృంగారంలో పాల్గొనకూడదు. ఇటువంటి చర్యలు మాలలోని శక్తిని క్షీణింపజేస్తాయి. అది వినియోగానికి పనికి రాకుండా పోవచ్చు అని నమ్ముతారు. ఒక వేళ బయట మాంసాహారం తినవలసి వస్తే మాలను తీసి ఒక కరవర్‌లో ఉంచి మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత ధరించాలి. 

రాత్రి సమయంలో తీసివేయాలి:- రాత్రి నిద్రపోయేటప్పుడు కరుంగలి మాలను తీసివేయాలి. దీనిని పూజా మందిరంలో భద్రపరిచి ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించాలి. ఈ నియమం శృంగార ఆలోచనలు కార్యకలాపాల సమయంలో మాల శక్తిని కాపాడటానికి ఉపయోగపడుతుంది. 

నెలసరి మయంలో జాగ్రత్త:- స్త్రీలు నెలసరి సమయంలో మాలను తీసివేయాలి. ఈ సమయంలో దినిని పూజామందిరంలో ఉంచి నెలసరి పూర్తిన అయిన ఆరో రోజు ఉదయం స్నాం చేసిన తర్వాత మళ్లీ ధరించాలి. అయితే కొందరు నిపుణులు నెలసరి సహజ ప్రక్రియ కాబట్టి ఈ సమయంలో ధరించవచ్చని చెబుతున్నారు. కానీ మనసు నిర్మలంగా ఉండాలని సూచిస్తున్నారు. 

అభిషేకం తర్వాత ధరించడం:- మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి అభిషేకంలో ఉంచిన కరుంగలి మాలను మరో మంగళవారం రోజు ధరించి శుభప్రదంగా భావిస్తారు. ఈ అభిషేకం మాలకు అదనపు శక్తిని, పవిత్రతను జోడిస్తుందని నమ్ముతారు. 

స్వచ్ఛత, ధర్మం పాటించడం: కరుంగలి మాల ధరించినప్పుడు శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. మాల ధరించినప్పుడు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలి. 

ఇతర మాలలతో కురంగలి మాలకు ఉన్న తేడా ఏంటీ?
కరుంగలి మాల ఇతర మాలలతో పోల్చినప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. 

మూలం, తయారీ: రుద్రాక్ష మాల రుద్రాక్ష చెట్టు గింజలతో, తులసి మాల తులసి చెట్టు కాడంతో, స్పటిక మాల స్పటిక రాళ్లతో తయారవుతాయి. కానీ కరుంగలి మాల జమ్మిచెట్టు కలపతో తయారవుతుంది. ఈ చెట్టు విద్యుదయస్కాంత శక్తిని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఇతర మాలలకు ఉండదు. 

ఆధ్యాత్మిక ప్రయోజనాలు:- రుద్రాక్ష మాల శివ భక్తులకు, తులసి మాల విష్ణు భక్తులకు, స్పటిక మాల ధ్యానం, మానసిక స్వచ్ఛత కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ కరుంగలి మాల అంగారక గ్రహ దోషాలు నివారణకు, వాస్తు దోషాలు తొలగింపునకు, దృష్టి దోష నివారణకు ఉపయోగిస్తారని అంటారు. సుబ్రహ్మణ్యం స్వామి జపం చేసేవారికి అదనపు ఫలితాలు ఇస్తుందని మరికొందరి నమ్మకం. 

ఆరోగ్య ప్రయోజనాలు: కరుంగలి మాల రేడియేషన్‌ను గ్రహించే గుణం కలిగి ఉంటుంది. దీని వల్ల ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతారు. ఈ లక్షణం రుద్రాక్ష, తులసి మాలకు ఈ శక్తి లేదని అంటారు. అలాగే కరుంగలి చెట్టు వేరు, బెరడు నుంచి తీసిన కషాయం మధుమేహం, గర్భాశయ సమస్యలకు, అల్సర్‌ సమస్యను పరిష్కారిస్తుందనే ప్రచారం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
ధనుస్సు రాశి ఆగస్టు 2-8 వారఫలం: ఈ వారం కొత్త అవకాశాలు, ఆర్థిక వృద్ధి, ప్రేమలో శుభం!
ధనుస్సు రాశి ఆగస్టు 2-8 వారఫలం: ఈ వారం కొత్త అవకాశాలు, ఆర్థిక వృద్ధి, ప్రేమలో శుభం!
ఆగస్టు 2 నుంచి 8 - ఈ వారంలో వృశ్చిక రాశివారి కెరీర్, డబ్బు, ప్రేమ, కుటుంబం,  ఆరోగ్య ఫలితాలు!
ఆగస్టు 2 నుంచి 8 - ఈ వారంలో వృశ్చిక రాశివారి కెరీర్, డబ్బు, ప్రేమ, కుటుంబం,  ఆరోగ్య ఫలితాలు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Embed widget