అన్వేషించండి

Laughing Buddha: లాఫింగ్ బుద్ధ ఎవరు? ఆ విగ్రహం ఇంట్లో ఉండటం మంచిదేనా? ఎక్కడ పెడితే శ్రేయస్కరం?

లాఫింగ్ బుద్ధ విగ్రహం చాలామంది తమ ఇళ్లలో ఆఫీసుల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇది సరైన దిశలో ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు చెబుతోంది

లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదం. కానీ లాఫింగ్ బుద్ధ విగ్రహం అలంకార వస్తువు కాదు. దాన్ని సరైన దిశలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక వేళ సరైన దిశలో లేనపుడు దాని నుంచి రావల్సిన శుభఫలితాలు రావు. అందుకే ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకోవడానికి ముందు సరైన దిశలో పెట్టాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

లాఫింగ్ బుద్ద ఎవరు?

జపాన్ నివాసి హోతాయ్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. హోతాయ్ కఠోర తపస్సు చేయడం ద్వారా జ్ఞానోదయం పొందాడు. జ్ఞానం సంపాదించిన తర్వాత హొతాయ్ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. జీవితంలో ప్రజలను నవ్వించడానికే పని చేస్తానని నిర్ణయించుకున్నాడు. హొతాయ్ అనేక దేశాలు పర్యటించాడు. అతడు ఎక్కడికి వెళ్లినా ప్రజలను నవ్విస్తూ, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. అందుకే లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది.

లాఫింగ్ బుద్ధ ప్రాశస్త్యం

లాఫింగ్ బుద్ధ ను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి ఆనందం, సంపద వచ్చి చేరుతుంది. అదే సమయంలో ఇంట్లోని నెగెటివిటి తొలగిపోతుంది. ఫలితంగా ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది.

ఇంట్లో ఎక్కడ ఉండాలి

లాఫింగ్ బుద్ధ ఎక్కడ పెట్టుకోవాలనే విషయం గురించి వాస్తు చాలా స్పష్టమైన వివరణలు ఇచ్చింది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండాలి. తూర్పు వైపున లాఫింగ్ బుద్దుని పెట్టడం శుభప్రదం. పిల్లల స్టడి రూమ్ లో లాఫింగ్ బుద్దుని విగ్రహం పెడితే అది పిల్లల మనస్సుపై సానుకూల ప్రభావం చూపుతుంది. పిల్లల మనసు ఏకాగ్రతతో చదువులో నమగ్నం అవుతారు.

ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార స్థలంలో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల వ్యాపారం క్రమంగా మెరుగుపడుతుంది.

బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని వాస్తు చెబుతోంది. మీ గదిలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులను నిరోధించవచ్చు. బంగారు రంగులో ఉండేది మరింత మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రతి విగ్రహం ప్రత్యేకమైందే. ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవద్దు. ఈ విగ్రహం దేవుడి విగ్రహం వంటిది.

  • నేలమీద విగ్రహాన్ని అసలు పెట్టకూడదు
  • చీకటిగా ఉండే ప్రదేశంలో కూడా పెట్టకూడదు
  • తరచుగా చూసే ప్రదేశాల్లో పెట్టుకోవాలి.
  • లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని టీవి లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఉంచకూడదు.
  • పూజా స్థానంలో కూడా ఉంచకూడదు.
  • షూరాక్ మీద కూడా ఉంచకూడదు.
  • ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచడం అన్నింటికంటే చాలా మంచిది.

Also read : Vastu Tips: వాస్తు టిప్స్ - గడియారం ఇంట్లో ఇక్కడ పెడితే కష్టాలు తప్పవు

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget