ఫినిక్స్ బర్డ్ నిజంగానే ఉందా? ఆ పక్షి బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుందా?
ఫినిక్స్ పక్షి రూపం విజయం, సానుకూలత, సమృద్ధి కి చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు ఈ పక్షిని అమర పక్షి లేదా మాయా పక్షి అని అభివర్ణిస్తుంది.
కొన్ని సార్లు ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఏదో ప్రతికూలత ఉన్నట్టు అనిపిస్తుంది. పెద్ద కారణాలేమీ లేకుండానే పనులన్నీ వాయిదా పడుతుంటాయి. లేదా విఫలమవుతుంటాయి. ఇంట్లో ఇలా జరుగుతున్నపుడు ఏదో ప్రతికూల శక్తి ఇంట్లో ఉందని వాస్తు భావిస్తుంది. ఇలాంటి ప్రతికూలతలను పారద్రోలేందుకు రకరకాల చిట్కాలు వాస్తులో వివరించారు. అటువంటి చిట్కాల్లో ఫినిక్స్ పక్షి బొమ్మ కూడా ఒకటి. ఫినెక్స్ పక్షి చిత్రానికి సంబంధించిన కొన్ని నియమాల గురించి వాస్తులో ఏం వివరించారో తెలుసుకుందాం.
వాస్తులో ఫినిక్స్ పక్షి
వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింప చేసే చిత్రాలను, విగ్రహాలను పెట్టుకోవాలి. పక్షి స్వేచ్ఛకు ప్రతిరూపం. అందుకే ఇంట్లో పక్షుల చిత్రాలు, విగ్రహాలు అలంకిరించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో ఫినిక్స్ పక్షి చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు. ఫినిక్స్ విగ్రహం లేదా చిత్ర పటాన్ని ఇంట్లో సరైన ప్రదేశంలో పెట్టుకోవడం మంచిది. ఈ పక్షి ఇంట్లో ఉంటే కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అభివృద్ధి పథంలో జీవితం సాగుతుందని నమ్మకం. అమరత్వానికి, అంతులేని విజయానికి ఫినిక్స్ పక్షిని ప్రతిరూపంగా భావిస్తారు.
ఈ పక్షి నిజం కాదు
ఫినిక్స్ అనే పక్షి ఈ సృష్టిలో ఎక్కడా కనిపించదు. అదొక కాల్పనిక పక్షి. గ్రీకు పురాణాలలో ఇది పునర్జన్మకు ప్రతీకగా చెబుతారు. తన పూర్వీకుల బూడిద నుంచి తిరిగి జీవం పోసుకునే పక్షి రూపం ఫినిక్స్. క్రిష్టియానిటీ తొలి రోజుల్లో దీన్ని మత చిహ్నంగా కూడా సూచించారు. ఈ పక్షి రూపం విజయం, సానుకూలత, సమృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు ఈ పక్షిని అమర పక్షి లేదా మాయా పక్షి అని అభివర్ణిస్తుంది. ఈ పక్షి చిత్రం లేదా విగ్రహాన్ని ఇంట్లోని దక్షిణం దిశలో అమర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అందరి చూపుకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని డ్రాయింగ్ రూమ్ లో అలంకరించుకోవడం మంచిది. లక్ష్య సాధనలో ఏర్పడే అడ్డంకులు తొలగి విజయ పథాన జీవితం కోనసాగడం కోసం ఇంట్లో ఫినిక్స్ పక్షిని పెట్టుకోవాలి. ఫినిక్స్ రగిలే అగ్నికి ప్రతీక. ఇది జీవశక్తిని సూచిస్తుంది.
ఈ పక్షుల చిత్రాలు ఇంట్లో ఉండకూడదు
వాస్తు కొన్ని పక్షుల చిత్రాలు లేదా విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదని సూచిస్తుంది. అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తు చెబుతోంది. రాబందు, గబ్బిలం, కాకి, గుడ్లగూబ వంటి పక్షుల విగ్రహాలు లేదా చిత్రాలను ఇంట్లో అలంకరించుకోకూడదు.
Also read : Hair Cut: శ్రావణ మాసంలో జుట్టు కత్తిరించుకోకూడదట - ఎందుకో తెలుసా?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial