అన్వేషించండి

దక్షిణంలో ఈ వస్తువులుంటే వెంటనే తీసేయండి

దక్షిణ దిక్కు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చు. ఎలాంటి వస్తువులు తప్పనిసరిగా పెడితే సంపద చేకూరుతుంది వంటి విషయాలగురించి తెలుసుకుందాం.

వాస్తులో దిక్కుల గురించి ప్రధానంగా వివరించారు. ఒక నిర్మాణం చేపడుతున్నపుడు వాటి ప్రత్యేకత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. దిక్కులను సరిగా చూసుకోకుండా నిర్మాణాలు చేపడితే వాస్తుదోషాలు ఏర్పడతాయి. ఇవి ఆ ఇంట్లో నివసించే వారి మీద తప్పనిసరిగా ప్రభావాన్ని చూపుతాయి.

వాస్తు నిర్మాణ శాస్త్రంగా జీవితంలో సుఖ సంతోషాలు నింపడం లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో పట్టణాలలో వాస్తును అనుసరించి అన్ని నిర్మాణాలు జరగడం లేదనేది కాదనలేని నిజం. ఇంటి, బయటి వాస్తును మనం ఎలాగూ మార్చలేము. కానీ ఇంటిలోపలి నిర్మాణాలు, వస్తువులు, ఇతర అంశాలు వాస్తును అనుసరించి ఏర్పాటు చేసుకుంటే కొంత వరకు నెగెటివ్ ఫలితాలను తప్పించుకోవచ్చు.

ఒక నిర్మాణం అందమైన ఇల్లుగా మారాలంటే మంచి ఎనర్జీతో ఉండాలి. అటువంటి ప్రదేశంలో నివసించే వారి మీద దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందనేది వాస్తు శాస్త్ర వాదన. వాస్తు శాస్త్రం ప్రస్తావించిన పరిష్కారాలు ఈ ఎనర్జీని సంతులన పరచడంలో సహకరిస్తాయి. ఎన్నో గుళ్లు, గోపురాలు, కట్టడాలు వేలాది సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా నిలిచి ఉండడానికి కారణం సరైన వాస్తు కలిగి ఉండడమే.

దిక్కులు ఎనిమిది. వీటిలో నాలుగు దిక్కులు కాగా మిగతా నాలుగు మూలలుగా చెప్పుకుంటారు. ఈ ఎనిమిది దిక్కులను పాలిస్తూ అష్టదిక్పాలకులు ఉంటారు. ఒక్కో దిక్పాలకుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దక్షిణం దిక్కుకు అధిపతి. యమధర్మరాజు. ఈ దిక్కును పితృదేవతల దిక్కుగా పరిగణిస్తారు.

దక్షిణం వైపు ఇవి పెట్టుకుంటే..

  • దక్షిణం వైపు గ్రీకు పురాణాల్లో చెప్పుకునే ఫినిక్స్ పక్షి చిత్రాన్ని పెట్టుకోవడం మంచిది. ఇది సమృద్ధికి సంకేతం.
  • చీపురును ఇంట్లో దక్షిణం వైపు ఉంచాలి. అందువల్ల ఇంట్లో సంపద చేరుతుంది.
  • జేడ్ మొక్కలను కూడా ఇంట్లో దక్షిణ దిక్కున లేదా హాల్ లేదా డ్రాయింగ్ రూమ్ లో దక్షిణం వైపు పెట్టుకోవాలి.
  • బెడ్ రూమ్ లో మంచం దక్షిణం వైపు తల ఉండేలా అమర్చుకోవాలి. అందువల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆగ్నేయం నిద్రకు మంచిది. ఈ దిక్కున భారీ వస్తువులు పెట్టుకోవడం మంచిది.
  • విలువైన వస్తువులు, తిజోరీ, బీరువా వంటి సంపద దాచుకునే వస్తువులను దక్షిణం వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

ఈవస్తువులు దక్షిణంలోఉంచకూడదు

  • దక్షిణ దిక్కున చెప్పులు పెట్ట కూడదు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ దక్షిణాన పెట్టుకోవద్దు. ఇది ఇంట్లో గొడవలకు కారణం అవుతుంది.
  • దక్షిణం వైపు పొరపాటున కూడా తులసి మొక్క పెట్టుకోవద్దు.
  • దక్షిణం వైపు పూజ గది నిర్మించుకోవద్దు.
  • పడక గదిలో పడుకున్నపుడు పాదాలు దక్షిణం వైపు ఉండకూడదు. వైవాహిక జీవితంలో కలతలు రావచ్చు.
  • దక్షిణంలో వంట చెయ్యడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో వంట గది దక్షిణం వైపు ఉండకూడదు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

Also Read:  ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!

టాప్ హెడ్ లైన్స్

మనుస్మృతిపై వివాదం ఎందుకు, అందులో మహిళల గురించి ఏం రాసిఉంది?
మనుస్మృతిపై వివాదం ఎందుకు, అందులో మహిళల గురించి ఏం రాసిఉంది?
25-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
25-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
25-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
25-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
25-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
25-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget