అన్వేషించండి

బెడ్ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటే దరిద్రం వెంటాడుతుందా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..

రాత్రి వేళం దాహం వేస్తే తాగడం కోసం వాటర్ బాటిల్‌ను పక్కనే పెట్టుకుని నిద్రపోవడం మనకు అలవాటు. కానీ, వాస్తు శాస్త్రం మాత్రం అలా చేయొద్దని హెచ్చరిస్తోంది.

రోజూ మనం తెలిసో తెలియకో కొన్ని చెయ్యకూడని పనులు చేస్తుంటాం. అయితే, వాటికి ఊహించని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. శ్రమకు తగిన ఫలితం ఎందుకు రావడం లేదనే బాధ వెంటాడుతుంది. అలాంటి చెయ్యకూడని పనులు అలవాటుగా మారితే లక్ష్మీ కటాక్షం దొరకదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫలితంగా దారిద్ర్యం వెంటాడుతుంది. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఆ గది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలంటే.. ఎలాంటి పనులు చేయకూడదనేది వాస్తు శాస్త్రం వివరిస్తోంది. ఆ వివరాలు మీ కోసం. 

  • పడుకునే సమయంలో మంచం దగ్గర మంచి నీళ్లు పెట్టుకొనే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే.. వాస్తు ప్రకారం అది అశుభం. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందువల్ల రకరకాల సమస్యలు ఎదురు కావచ్చు.
  • మనలో చాలామంది నిద్రకు ముందు పుస్తకం లేదా పేపర్ చదివే అలవాటు ఉంటుంది. ఏదైనా చదివితే కానీ నిద్రపోరు. ఇలా చదువుకోవాలని అనుకునే పుస్తకాలు కొంచెం చదివి దిండు కింద పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. ఇలా చెయ్యడం వల్ల ఇప్పటికే ఉన్న సమస్యలు తీవ్రంగా మారుతాయి. లేని కొత్త సమస్యలు వస్తాయి.
  • ఈ మధ్య కాలంలో చాలా మందికి పడక గదిలో భోంచేసే అలవాటయ్యింది. ఇలా మంచంపై కూర్చుని తినడం అంత మంచి అలవాటు కాదు. కొందరు మంచంపై కూర్చుని తినకపోయినా తిన్న తర్వాత ఎంగిలి పాత్రలు అలాగే మంచం పక్కన పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇది అసలు మంచిది కాదు. రాత్రిపూట పీడకలలు వస్తాయి. అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా అడ్డంకులు రావచ్చు. కాబట్టి పడకగదిలో భోంచెయ్యడం, భోజనం తర్వాత పాత్రలు అక్కడే పెట్టుకోవడం అంత మంచిది కాదు.
  • చాలా మంది మహిళలు పడుకునే ముందు తాము అలంకరించుకున్న నగలు తీసి దిండు కింద పెట్టుకుని పడుకుంటారు. అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా నగలు దిండు కింద పెట్టకుంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందట. కాబట్టి నగలు తీసి సరైన స్థానంలో భద్రపరిచిన తర్వాత మాత్రమే నిద్రకు ఉపక్రమించడం మంచిది.
  • ఒకసారి వేసుకున్న బట్టలు మరోసారి వేసుకున్నాక ఉతకడానికి వెయ్యాలని చాలా మంది అనుకుంటారు. తరచుగా ఉతకడం వల్ల బట్టలు పాడైపోతాయని ఇలా చేస్తుంటారు. అయితే ఒకసారి వాడిన బట్టలు ఉతక కుండా మంచం మీద వెయ్యకూడదు. కొందరు అలా వేసి వదిలేస్తారు కూడా. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కోవడం లేదా ఒకసారి వేసుకున్నవాటిని సరైన స్థానంలో పెట్టుకోవడం అవసరం.

Also Read: మీ ఇంటి గోడలపై ఈ చిత్రాలు ఉంటే - సంపద మీ వెంటే!

టాప్ హెడ్ లైన్స్

09-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
09-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
Ashadha Gupt Navratri 2026 Date: 12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం!ఆషాఢ గుప్త నవరాత్రులు ఘటస్థాపన శుభసమయం, పూజా విధానం! 
12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం!ఆషాఢ గుప్త నవరాత్రులు ఘటస్థాపన శుభసమయం, పూజా విధానం! 
Mirror Superstition: పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!
పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!
పూజ పూర్తిచేసిన తర్వాత తలుపులు వేసి ఉంచాలా? తెరిచి ఉంచాలా?
పూజ పూర్తిచేసిన తర్వాత తలుపులు వేసి ఉంచాలా? తెరిచి ఉంచాలా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget