ఆ రోజు చీపిరి కొంటే అంతా శుభమే - డబ్బే డబ్బు
vastu tips: మీ ఇంటికి డబ్బుతో పాటు సంతోషాన్ని తీసుకురావడంలో సహాయపడటానికి అనేక వాస్తు చిట్కాలు సూచించారు. శనివారం చీపురు కొనడం వల్ల మీ నివాసంలో సంపద సమృద్ధిగా పెరుగుతుంది.
మన దేశంలో పురాతన గ్రంథాలు, వాస్తు శాస్త్రాల ఆధారంగా సాంప్రదాయ భారతీయ నిర్మాణ వ్యవస్థను చాలా మంది నమ్ముతారు. ఈ వ్యవస్థ ఇళ్ల నిర్మాణాల డిజైన్, లేఅవుట్, కొలతలు, ఫ్లోరింగ్ సూత్రాలను వివరిస్తుంది. ఇది భవనానికి సంబంధించిన రంగు, కొలతలు, ఆకృతిని కూడా సూచిస్తుంది, ఇది స్పష్టంగా ఇంట్లో సానుకూలతను, ఆనందాన్ని నిర్ధారిస్తుంది.
వాస్తు శాస్త్రంలో మీ ఇంటికి డబ్బును తద్వారా ఆనందాన్ని తీసుకురావడంలో సహాయపడటానికి అనేక చిట్కాలు సూచించారు. వాటిలో కొన్ని గది ఆకారం, ఫర్నిచర్ ఉంచడం, నిద్రించే దిశ సహా అనేక అంశాలు ఉన్నాయి. అయితే, చీపుర్లు మీ ఇంటికి డబ్బును కూడా ఆకర్షించగలవని మీకు తెలుసా? అవును, మీరు చదివింది నిజమే. వాస్తు నిపుణులు చెబుతున్న మాట ఇది. వారంలో ఒక నిర్దిష్టమైన రోజున మీ ఇంటికి చీపురు కొనడం వల్ల మీ నివాసానికి సంపద సమృద్ధిగా తరలివస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, శనివారం చీపుర్లు కొనుగోలు చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇంట్లో సంపదను ఆకర్షించడానికి ఎప్పుడూ శనివారం చీపురు కొనడంతో పాటు, దానిని దక్షిణ లేదా నైరుతి దిశలో ఉంచాలని స్పష్టంచేశారు. అలాగే చీపురును ఎప్పుడూ బయటి వారికి త్వరగా కనిపించని చోట ఉంచడమే మంచిదని పేర్కొంటున్నారు. ఒకవేళ అది బయటకు కనబడితే కుటుంబానికి దురదృష్టాన్ని తీసుకురావచ్చు. శుభకార్యాల కోసం బయటకు వెళ్లేటప్పుడు చీపురు చూడటం అశుభం. ఇంట్లోని లక్ష్మీ దేవిని బయటకు రాకుండా చీపురు కాపాడుతుందని, ఇది అదృష్టానికి చిహ్నంగా భావించాలని వెల్లడించారు.
వెల్త్ ప్లాంట్ అని కూడా పిలిచే గ్రీన్ జాడే మొక్కను ఇళ్లలో ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం, సంపద నిచ్చే మొక్క అని కూడా పిలిచే ఈ మొక్కను ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచితే సంపదను, అదృష్టాన్ని తెస్తుంది. అందువల్ల దీనిని మీ ఇంట్లో లేదా పని ప్రదేశాల్లో ఉంచాలని పేర్కొంటున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా చీపురు శుభానికి చిహ్నం. హిందూ గ్రంథాల ప్రకారం, చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఆనందం. శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పాడైన చీపురు పారేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవి పాటించకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. పురాణాల ప్రకారం, చీపురును తొక్కినా, చీపురుపై అడుగుపడినా లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది. ఇది ఆ వ్యక్తి జీవితంలో అత్యంత పేదరికానికి దారి తీస్తుంది. కాబట్టి పాత చీపురును ఎవరూ నడవని చోట పాడేయాలి.
పాత చీపురు పారేసే ముందు ఈ తప్పులు చేయకండి
1. ఇంట్లోని పాత చీపురును గురువారం, శుక్రవారం బయట పారేయకూడదు. ఏకాదశి నాడు చీపురు పారేయడం అశుభం.
2. చీపురు శుభానికి చిహ్నం, చీపురును పారే కాలువలో లేదా చెట్టు కింద పడేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం రావచ్చు.
3. జ్యోతిష్యం ప్రకారం విరిగిన, పాత చీపురుతో ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు. విరిగిన లేదా పాత చీపురును కాల్చకూడదు.
4. శనివారం చీపుర్లు పారేయడానికి అనుకూలమైన రోజు. అమావాస్య రాత్రి కూడా చీపురు పారేయవచ్చు. అయితే ఎవరికీ చెప్పకుండా ఇంటి బయట పారేయాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.