అన్వేషించండి

Money Plant: మనీ ప్లాంట్ ను ఇలా పెంచితే.. మీ ఇంట్లో డబ్బే డబ్బు

Vastu Tips For Money Plant: చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచుకుంటారు. ఇంట్లో మనీప్లాంట్ పెంచుకుంటే ఇంటికి ఆనందంతోపాటు వాస్తుపరంగా మేలు జరుగుతుందని నమ్ముతుంటారు.

Money Plant Benefits: మనీ ప్లాంట్.. చాలా మంది ఇళ్లలో కనిపిస్తుంది. మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే అందంతోపాటు ఆనందం, వాస్తు పరంగా అంతా మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. మనీ ప్లాంట్ పేరుకు తగ్గట్లుగానే ఈ ప్లాంట్ కు డబ్బును ఆకర్షించే గుణం కూడా ఉంటుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో అదృష్టంతోపాటు సంపదను కూడా తీసుకువస్తుంది. మీరు కూడా ఇంట్లో సంతోషం, సంపద వెల్లివిరిసేందుకు మనీ ప్లాంట్ పెంచుకోవాలని శాస్త్రం చెబుతోంది. అయితే పెంచుకునే మనీప్లాంట్ చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు చెబుతోంది. అయితే ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకొనేటప్పుడు ఈ వాస్తు చిట్కాలు మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం. 

మనీ ప్లాంట్ కోసం బెస్ట్ వాస్తు చిట్కాలు ఇవే: 

తూర్పు-పశ్చిమ దిశలో ఎప్పుడూ ఉంచకూడదు:

వాస్తు ప్రకారం..మనీ ప్లాంట్‌లను తూర్పు లేదా పడమర వైపు ఉంచితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాదు ఈ దిశలో నాటితే వైవాహిక జీవితంలో విభేదాలకు దారితీయవచ్చు. కాబట్టి, మనీ ప్లాంట్ ఈ దిశలో నాటకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. 

రెడ్ కలర్ వస్తువులను దూరంగా ఉంచండి:

మనీ ప్లాంట్ పక్కన ఎరుపు రంగులో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు. చాలా మంది ఇంట్లోని వంటగదిలో మనీ ప్లాంట్ ఉంచుతారు. ఇలా పెట్టడం మంచిదికాదని చెబుతోంది వాస్తు. వంటగదిలో మనీప్లాంట్ పెడితే దురదృష్టాన్ని తెస్తుంది. 

మీ ఇంటిని శుభ్రంగా ఉంచాలి:

వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చిందరవందరగా వస్తువులు ఉండకూడదు. ఎందుకంటే మనీ ప్లాంట్ ను ఇంట్లో ఉంచితే ఇల్లు శుభ్రంగా ఉండాలి. మనీ ప్లాంట్ కు ప్రత్యేకమైన స్థలం ఉండాలి. ఇంట్లో మూలలో మనీప్లాంట్ పెంచకూడదు.  

గుండె ఆకారపు ఆకులను ఎంచుకోండి:

మీరు మనీప్లాంట్ కొనుగోలు చేసేటప్పుడు గుండె ఆకారపు ఆకులతో కూడిన మనీ ప్లాంట్‌ను కొనాలి. ఇది సంపద, శ్రేయస్సును తెస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాలను ప్రోత్సహిస్తుంది.

గో గ్రీన్:

ఎల్లప్పుడూ గ్రీన్ మనీ ప్లాంట్‌ని ఎంచుకోండి. మనీ ప్లాంట్‌పై మీరు ఎంత శ్రద్ధ చూపుతారనేది ముఖ్యం. ఆకులు పచ్చగా ఉంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్ధం. 

మనీ ప్లాంట్‌కు నీళ్ళు పోయండి:

డ్రై మనీ ప్లాంట్ విపత్తు, దురదృష్టానికి సంకేతం. అందువల్ల, క్రమం తప్పకుండా నీరు పోయడం చాలా ముఖ్యం. మొక్క ఆకులు వాడిపోకూడదు. ఆరోగ్యంగా ఉండాలి. మొక్కను నేల నుండి దూరంగా ఉంచడం మంచిది. ఆకులు ఎండిపోవడం లేదా వాడిపోతుంటే వాటిని కత్తిరంచండి. 

మొక్కను ఆగ్నేయం వైపు ఉంచాలి:

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మీ ఇంటి ఆగ్నేయ మూలకు ఎదురుగా ఉండాలి. ఇది చెడు శక్తిని దూరం చేస్తుంది. శ్రేయస్సు, అదృష్టాన్ని ఇస్తుంది.

ఇండోర్ మనీ ప్లాంట్:

ఇంటి లోపల మనీ ప్లాంట్‌లను పెంచడం అనువైనది. మీ మొక్కను గాజు సీసాలో నిల్వ పెంచండి. సాధ్యమైనంత వరకు  సూర్యరశ్మి నుండి దూరంగా ఉంచడం మంచిది. 

మీ మనీ ప్లాంట్‌ను ఇతరులకు ఇవ్వకండి:

మీ మనీ ప్లాంట్‌ను కట్ చేసి ఇతరులకు ఎప్పటికీ ఇవ్వకండి. ఆకులు ఎండిపోయినా లేదా వాడిపోయినా, వాటిని కత్తిరించండి. మీ మనీ ప్లాంట్‌ను కట్ చేసి వేరేవారికి ఇవ్వకూడదు. ఒకవేళ వేరేవాళ్లకు ఇస్తే మీ సంపద, విజయాన్ని ఇతరులకు పంచిపెట్టినట్లవుతుంది. 

10. మనీ ప్లాంట్ దగ్గర గ్రీన్ లేదా బ్లూ కలర్ ఉండాలి:

మనీ ప్లాంట్ దగ్గర ఎరుపు రంగు వస్తువులు ఉండకూడదు. ఆకుపచ్చ లేదా నీలి రంగులో ఉన్న వస్తువులు ఉండాలి. మనీ ప్లాట్ తొట్టి కూడా ఎరుపు రంగులో ఉండకూడదు.  

Also Read : Pigeon Nest: ఇంట్లో పావురం గూడు కడితే మంచిదేనా? ఏం జరుగుతుంది?


వంట గదికి ఈ రంగులు వేస్తున్నారా? అస్సలు వద్దు - ఎందుకంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Embed widget