అన్వేషించండి
Advertisement
Sri Ramanujacharya Jayanti 2022: అవతారం చాలించేముందు రామానుజులు చెప్పిన విషయాలివే
120 సంవత్సరాలపాటు అవనీ సంచారం చేసిన రామానుజులు తమ అవతారాన్ని చాలించబోయే ముందు శిష్యులకు 72 అంశాలు చెప్పారు. వాటిని ‘వైణవన్ కురల్’ అనే ద్రవిడ గ్రంథంలో ప్రస్తావించారు. అందులో ముఖ్యాంశాలేంటో చూద్దాం..
వేదానికి సరైన అర్ధం చెప్పిన వ్యక్తి, అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త, భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యులు. ఆయన అవతారం చాలించేటప్పుడు కూడా శిష్యులకు కొన్ని విషయాలు చెప్పారు..
రామానుజాచార్యులు శిష్యులకు చెప్పిన విషయాలు
- గురువుల పట్ల మీరు చూపే భక్తిలో బేధం పాటించవద్దు
- ఇంద్రియాలకు దాసులు కావద్దు, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించండి
- భగవంతుడి లీలను తెలిపే రచనలను చదవండి
- విష్ణు భక్తులకు సేవా కైంకర్యాలు చేయండి
- మీరు వెళ్లే దారిలో ఎక్కడైనా భాగవత గోష్ఠి కనిపిస్తే భగవంతుడి కన్నా ముందుగా భాగవతులకు నమస్కారం చేయాలి
- కోవెలను, గోపురాన్ని చూడగానే భక్తితో చేతులు జోడించండి. ఎంత అందంగా మలిచినా వింత దేవుళ్లను చూడొద్దు
- శ్రీవైష్ణవులు భగవంతుణ్ణి, భాగవతులైన వైష్ణవులను, ఆచార్య గ్రంథాలను సేవించే సమయంలో వారితో వాదనకు దిగకండి.
- ఎవరైనా మీకు నమస్కరించి దాసుడిని అంటే..మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవద్దు
- జ్ఞాన, వైరాగ్య, భక్తి సంపన్నులు ఈ దేహాన్ని ఒక వస్త్రంగా భావించేవారికి కైంకర్యం చేయండి.
- ఆత్మస్తుతి, పరనింద వద్దు...
రోజులో కనీసం గంటపాటూ ఆచార్య సూక్తులు చెప్పుకోవాలి.. రోజూ ఆళ్వారుల, ఆచార్యుల రచనలు చదవాలి. - భగవంతుణ్ణి, ఆయన భక్తులను దూషణ చేసే వారి వైపు చూపు తిప్పకండి. సత్యాన్ని విశ్వసించే విషయంలో ద్వైదీభావం గల కుహనా మేధావులతో చేరకండి.
మోక్షానికి ప్రపత్తి కాకుండా ఇతర మార్గాలను అవలంబించే వారితో సహవాసం చేయొద్దు - భగవంతుణ్ణి రాతి విగ్రహంగా, ఆచార్యులను సామాన్యునిగా, పవిత్ర జలాన్ని సాధారణ నీరుగా, పవిత్ర మంత్రాన్ని కేవల శబ్దంగా… భావిస్తూ భగవంతుడిని చిన్నచూపు చూసేవారు నరకంలో ఉంటారని గుర్తించాలి.
- భగవంతుడికి సమర్పించే గంధం, నైవేద్య, పుష్పాలను వాసన చూడరాదు
- భగవంతుడికి సమర్పించే ప్రసాదాల పవిత్రత కంటే…దానిని స్వీకరించేవాడు పరమ పవిత్రుడని తెలుసుకోవాలి.
- కంటికి ఇంపైనవన్నీ భగవతుడికి సమర్పించ రాదు. భగవంతుడికి సమర్పించ తగిన పదార్థములు గ్రాంథాల్లో విడిగా పేర్కొన్నారు..వాటిని మాత్రేమ సమర్పించాలి
ఐశ్వర్యం, లౌకిక సుఖాల వెంట పరుగులు తీసేవారికి దూరంగా ఉండాలి. - కలిగినంతలో భగవంతుడికి సమర్పించి సంతోషంగా జీవనం సాగించాలి.
Also Read: చోళరాజుల కంటపడకుండా రామానుజాచార్యులు తిరుపతికి తరలించిన గోవిందరాజస్వామి విగ్రహం ఏమైంది.. ఇప్పుడు ఎక్కడుంది..
Also Read: రామానుజాచార్యుల పైనా కీర్తనలు రాసిన అన్నమయ్య
Also Read: రామానుజాచార్యుల దివ్యశరీరం ఇంకా భద్రపరిచే ఉంది... మీరు చూశారా...
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement