అన్వేషించండి

Spirituality: అతిరథ మహారథులు అంటారు కదా.. వాళ్లెవరో తెలుసా...

అతిరథ మహారథులంతా వచ్చారనే మాట వింటుంటాం. వాళ్లెవరు.. వ్యక్తులా, శక్తులా...అసలు అతి రథమహారథులు అనే మాట ఎప్పటి నుంచి మొదలైంది..

అతిరథ మహరథులు అనగానే ఎవరో గొప్పవాళ్లు వచ్చారనే అర్థం స్పురిస్తుంది. మహా మహా గొప్పోళ్లకి ఆ మాట వాడతారని తెలుసు కానీ ఇంతకీ అతిరథ మహారథులంటే సరైన అర్థం చాలామందికి తెలియదు. వాస్తవానికి ఈ పదాలు వ్యక్తుల పేర్లు కాదు...పురాణాల్లో  కొన్ని పాత్రల యుద్ధనైపుణ్యాన్ని, యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్ధ్యాన్ని తెలుపుతాయి. వాళ్లవరో, వారి సామర్థ్యం ఏంటో తెలిపేందుకు  ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..
1)రథి
2)అతిరథి
3)మహారథి
4)అతి మహారథి
5) మహామహారథి

రథి: ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలవారిని రథి అని అంటారు.  సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, పాటు కౌరవుల్లో 96 మంది, శిఖండి, ఉత్తమౌజులు, ఉపపాండవులు వీరందరూ రథులు. 

అతిరథి : రథికి 12రెట్లు అంటే ఏకకాలంలో  60,000మందితో ఒకేసారి యుద్ధం చేయగలవారిని అతిరథి అని అంటారు. లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు వీరంతా అతిరథులు. ఏకకాలంలో 60వేల మందితో యుద్ధం చేయగల వీరులు.

మహారథి : అతిరథికి 12రెట్లు.. అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని మహారథి అని అంటారు. రాముడు, కృష్ణుడు, లక్ష్మణుడు , అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధుడు తదితర వీరులంతా మహారథుల కోవలోకి వస్తారు. వీరిని మహారథులు అంటారు. 

అతిమహారథి : మహారథికి 12రెట్లు అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని అతిమహారథుడు అని అంటారు. ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు వీరంతా అతి మహారథులు. వీరు ఏకకాలంలో  ఎనభై ఆరులక్షల నలభైవేల మందితో యుద్ధం చేయగలరు. సీతను విడిపించే సమయంలో జరిగిన రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు..రావణుడి కొడుకు ఇంద్రజిత్తు –రామ భక్తుడు ఆంజనేయుడు.

మహామహారథి: అతిమహారథికి 24రెట్లు అంటే ఏకకాలంలో 20,73,60,000 మందితో ఏకకాలంలో యుద్ధం చేయగల వీరుడిని మహామహారథి అని అంటారు.  త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి , సుబ్రహ్మణ్య స్వామి వస్తారు.  వీరంతా..మహామహారథులు.. ఒకేసారి ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలమందితో యుద్ధం చేయగల నైపుణ్యం వీరి సొంతం. 

అతిరథమహారథులు అనే పదం వాడుక భాషలోకి వచ్చేసరికి ..ఎంతో గొప్పవాళ్లకి వినియోగిస్తుంటారు. అలా  ఈ పదానికి అర్థం చాలామందికి తెలియకపోయినా ఉపయోగించేవారి సంఖ్య మాత్రం ఎక్కువే....

Also Read:పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
06-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే లోపలి కన్ను రహస్యం!
చీకటిలోనూ వెలుగు: గబ్బిలం నేర్పే అంతర్ధృష్టి రహస్యం!
Nag Panchami 2026 Date: నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
నాగ పంచమి 2026 తేదీ, పూజావిధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!
Gen Z ఫోటో స్టిల్స్! ఆలయాలను సందర్శించేటప్పుడు ఫొటోలు ఇలా తీసుకుంటే అదిరిపోతాయ్!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget