అన్వేషించండి

అన్యోన్య దాంపత్యం 63లా ఉండాలి అంటారెందుకు? ఈ సంఖ్యకు భార్యభర్తల బంధానికి ఏంటి సంబంధం?

Spiritual Lessons: భార్య భర్త 63లా ఉండాలి..అప్పుడే అన్యోన్య దాంపత్యం అనిపించుకుంటుంది అంటారు ఆధ్యాత్మివేత్తలు. ఇంతకీ 63 కి అన్యోన్య దాంపత్యానికి ఏంటి సంబంధం?

63 Nnayanars Lessons for Happy Marriage:  అన్యోన్య దాంపత్యం అంటే భార్యభర్తల మధ్య ఉండే శాశ్వతమైన, ఆధ్యాత్మికమైన బంధం. హిందూ  సంప్రదాయంలో ఇది కేవలం భౌతిక సంబందం కాదు, మోక్ష మార్గంలో ఓ సంస్కారం. 6 మూడుని చూస్తుంటే.. 3 ఆరు వైపు ఉంటుంది. ఇద్దరి మార్గం ఇద్దరూ అయి ఉండాలని దీని వెనుకున్న ఆంతర్యం. ఇక అన్యోన్య దాంపత్యం 63లా ఉండాలి అనే మాట 63 నాయనార్లను సూచిస్తుంది. నాయనార్లు తమిళ శైవ సంప్రదాయంలో 63 మంది మహాభక్తులు, వారు శివుడిపట్ల చూపించిన అపారమైన భక్తి, త్యాగం, సమర్పణలు దాంపత్య జీవితానికి ఆదర్శం అని చెబుతారు. ఈ భక్తులు శివుడిని సమానంగా ఆరాధించి , ఆధ్యాత్మికంగా జీవించారు. అదే విధంగా దాంపత్యంలో భార్యభర్తలు ఒకరినొకరు దైవత్వంగా చూసి, భక్తితో జీవించాలని దీనివెనుకున్న ఆంతర్యం.  ఇది కేవలం భౌతిక సుఖాలకు మాత్రమే కాదు.. ఆత్మీయ ఎదుగుదలకు, మోక్షానికి మార్గం అవుతుంది. 

ఈ 63 నాయనార్ల జీవితాలు దాంపత్యానికి 10 ముఖ్యమైన పాఠాలు బోధిస్తాయి

అచంచల భక్తి (Unwavering Devotion)

నాయనార్లు శివుడిపట్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ మారని భక్తి చూపించారు. కన్నప్ప నాయనార్ తన కళ్లను శివుడికి సమర్పించాడు. దాంపత్యంలో కూడా భార్యభర్తలు ఒకరినొకరు దైవంగా భావించి.. జీవితంలో సవాళ్లు ఎదుర్కొనేటప్పుడు ఈ భక్తి ఉండాలి. హిందూ ధర్మంలో వివాహం ఓ సంస్కారం..ఇది కామ పురుషార్థాన్ని నెరవేర్చి మోక్షానికి మార్గం తెరుస్తుంది. భక్తి లేకుండా దాంపత్యం భౌతికమే అవుతుంది. కానీ నాయనార్లలా ఉంటే అది ఆత్మీయ యాత్ర అవుతుంది. ఇది దాంపత్యాన్ని బలపరుస్తుంది. ఈగోని తగ్గిస్తుంది, ప్రేమను పెంచుతుంది. భార్యను శక్తిగా.. భర్తను శివుడిగా చూసే దృక్పథాన్ని ఇస్తుంది. ఫలితంగా అన్యోన్యత పెరుగుతుంది
 
సమర్పణ భావన (Self-Surrender)

నాయనార్లు తమను తాము పూర్తిగా శివుడికి సమర్పించారు. అమరనీడి నాయనార్ తన సంపదనంతా శివుడికి ఇచ్చేశాడు. దాంపత్యంలో, బార్యభర్తలు ఒకరికొకరు ఈ సమర్పణ భావనతో ఉండాలి. ఈగోను, స్వార్థాన్ని వీడి ‍ఒకే ఆత్మలా జీవించాలి. లేదంటే ఆ దాంపత్యం తగాదాలతో నిండిపోతుంది. నాయనార్ల జీవితాలు చూపినట్టు, సమర్పణ ద్వారా దైవిక అనుభూతి కలుగుతుంది. ఆధ్యాత్మికవేత్తలు దీనిని ఆత్మనివేదనం అంటారు
 
పవిత్రత శుద్ధి (Purity and Holiness)
 
నాయనార్లు భస్మాన్ని ధరించి , మూడు మలలాలను( అవనం, కర్మ, మాయ) నాశనం చేశారు. దాంపత్యంలో కూడా మనసు, శరీరం, ఆత్మ పవిత్రంగా ఉండాలి. ఇది భౌతిక కోరికలను ఆధ్యాత్మిక ప్రేమగా మారుస్తుంది. రామాయణంలో సీతారాముడిలా. దాంపత్యం పవిత్ర బంధం.. పవిత్రత లేకుండా దాంపత్యం భారమవుతుంది . నాయనార్లు శివుడి పవిత్రత కాపాడినట్టు భార్యభర్త ఒకరి పవిత్రతను మరొకరు గౌరవించాలి
 
సేవ - త్యాగం  (Service and Sacrifice)
 
సుందరర్ నాయనార్ వివాహాన్ని వదులుకుని శివారాధనలో ఉండిపోయాడు . దాంపత్యంలో ఒకరికోసం మరొకరు త్యాగం చేయాలి. ఇది ప్రేమను బలపరుస్తుంది. ఆధ్యాత్మికంగా , త్యాగ యజ్ఞంలా , కోరికలను కాల్చి పవిత్రతను ఇస్తుంది. నాయనార్లలా త్యాగం ఉంటే దాంపత్యం దైవికమవుతుంది
 
అహంకార నాశనం (Overcoming Ego)

నాయనార్లు అహంకారాన్ని శివుడికి సమర్పించారు. దాంపత్యంలో , ఈగో తగాదాలకు కారణం. నాయనార్లు చూపినట్టు ఈగోను వదిలేస్తే అన్యోన్యత పెరుగుతుంది. హిందూ ధర్మంలో .. వివాహం మూడు వాసనలను ( లోక, దేహ, శాస్త్ర) నాశనం చేస్తుంది
  
సామరస్యం - ఐక్యత (Harmony and Unity)
 
63 నాయనార్లు ఒకే భక్తి గమ్యంతో ఐక్యమయ్యారు. దాంపత్యంలో  ఇద్దరూ ఒకే ఆధ్యాత్మిక లక్ష్యంతో జీవించాలి. ఇది హార్మోనీని తెలుస్తుంది. హిందూ వివాహం రెండు ఆత్మల ఐక్యం, మోక్షానికి మార్గం. 

సామూహిక ఆధ్యాత్మిక ఎదుగుదల (Spiritual Growth Together)
 
నాయనార్లు ఒకరినొకరు ప్రేరేపించుకున్నారు. దాంపత్యంలో భార్యభర్తలు ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరకొరు సహాయం చేయాలి. ఇది ధర్మ, అర్థ, కామాలను సమతుల్యం చేస్తుంది
 
విశ్వాసం నమ్మకం (Faith and Trust)
 
నాయనార్లు శివుడిపై పూర్తి విశ్వాసం ఉంచారు. దాంపత్యంలో ఒకరిపై మరొకరు ఈ విశ్వాసం ఉంచాలి. ఇది బంధాన్ని బలపరుస్తుంది
 
 భౌతికాతీత ప్రేమ (Love Beyond Material)

శివుడిపై పిచ్చి ప్రేమను చూపించి నాయనార్లు బౌతికాలను వదిలేశారు. దాంపత్యంలో ప్రేమ భౌతిక సుఖాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆధ్యాత్మికంగా ఉండాలి
 
దైవిక ఐక్యం (Ultimate Union with Divine)

నాయనార్లు అచంచలమైన భక్తిభావంతో శివుడిలో ఐక్యం అయ్యారు. దాంపత్య కూడా ఇద్దరినీ దైవికంగా ఐక్యం చేసి మోక్షంవైపు నడిపిస్తుంది. ఇది 63 నాయనార్ల ఆదర్శం

ఇవి దాంపత్యాన్ని ఆధ్యాత్మికయాత్రలా మారుస్తాయి...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget