అన్వేషించండి

Solar Eclipse 2026: ఫిబ్రవరి 17న సంభవించే సూర్యగ్రహణం సమయం - ఇది భారతదేశంలో కనిపిస్తుందా?

Surya Grahan 2026: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యగ్రహణాలను శుభప్రదంగా పరిగణించరు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? ఈ గ్రహణాల సమయం గురించి ఇక్కడ తెలుసుకోండి.

Solar Eclipse 2026: శాస్త్రంలో గ్రహణాన్ని ఖగోళ సంఘటనగా పరిగణిస్తున్నప్పటికీ, జ్యోతిషశాస్త్రంలో ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.  ఎందుకంటే ఇది మన జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. 2026లో 15 రోజుల వ్యవధిలో సూర్యగ్రహణం,  చంద్రగ్రహణాలు ఉంటాయి.

భారతదేశంలో గ్రహణాలను శుభప్రదంగా పరిగణించరు. మార్గశిర మాసం అమావాస్య రోజు సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకుందాం.

2026 లో రెండు సూర్యగ్రహణాలు

మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026 మార్గశిర అమావాస్య రోజు కుంభరాశి శతభిష నక్షత్రంలో సంభవిస్తుంది. ఇది ఒక కంకణాకార సూర్యగ్రహణం అవుతుంది. సూర్యుడు, చంద్రుడు , భూమి సమలేఖనం అయినప్పుడు కంకణాకార సూర్యగ్రహణం సంభవిస్తుంది, కానీ చంద్రుడు, దాని కక్ష్య భూమి నుంచి కొంచెం దూరంలో ఉండటం వల్ల, సూర్యుడిని పూర్తిగా కప్పివేయడు. ఈ గ్రహణంలో  చంద్రుని చుట్టూ ప్రకాశవంతమైన సూర్యకాంతి వలయం కనిపిస్తుంది, దీనిని "రింగ్ ఆఫ్ ఫైర్" అని పిలుస్తారు.

ఇది భారతదేశంలో కనిపిస్తుందా? 

2026 లో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న సంభవిస్తుంది. అయితే, ఇది భారతదేశంలో కనిపించదు. భారతదేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా ఉండదు.

ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

జింబాబ్వే, దక్షిణాఫ్రికా, జాంబియా, మొజాంబిక్, మారిషస్, టాంజానియా, అంటార్కిటికా, దక్షిణ అమెరికా దేశాలలో కనిపిస్తుంది. 

రెండవ సూర్యగ్రహణం ఆగష్టు 12, 2026

ఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం ఆగష్టు 12న హరియాలి అమావాస్య  రోజు సంభవిస్తుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, చంద్రుడు భూమికి  సూర్యుడికి మధ్య నేరుగా వచ్చి, దానిని పూర్తిగా కప్పివేస్తాడు, దీనివల్ల భూమిలో ఒక చిన్న భాగం  చీకటిని అనుభవిస్తుంది.

రెండో సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా?

ఈ గ్రహణం కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో ప్రారంభమవుతుంది.ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ సమయం ప్రకారం ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది ఆఫ్రికా, యూరప్, ఆర్కిటిక్, స్పెయిన్, ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, ఐస్లాండ్ లలో కనిపిస్తుంది.

ఇక ఫిబ్రవరి 17 అమావాస్య రోజు సూర్యగ్రహణం తర్వాత.. 15 రోజుల గ్యాప్ లో మార్చి 03 పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతోంది.  ఫాల్గుణ శుక్ర పూర్ణిమ కేతుగ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం మనదేశంలో ఖండగ్రాస గ్రహణం. ఈ గ్రహణం సింహరాశి   , పుబ్బ నక్షత్రంలో సంభవిస్తోంది. పుబ్బ నక్షత్రం వారు, సింహరాశివారు ఈ గ్రహణం చూడకూడదు. ఉదయం నుంచి ఆలయాలు మూసివేసి గ్రహణ సమయం పూర్తైన తర్వాత సంప్రోక్షణ చేసి భక్తులను దర్శనానికి అనమతిస్తారు. మార్చి 3న ఏర్పడుతోన్న సంపూర్ణ చంద్రగ్రహణం మనదేశంలో కనిపిస్తుంది. అందుకే  మధ్యాహ్నం 3 గంటల 19 నిముషాల నుంచి 6 గంటల 46 నిముషాల వరకు ఉంటుంది. పుణ్యకాలం 42 నిముషాలు మాత్రమే.  గ్రహణం పట్టు విడుపు  సమయంలో స్నానం ఆచరించాలి..

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget