అన్వేషించండి

పూజ పూర్తిచేసిన తర్వాత తలుపులు వేసి ఉంచాలా? తెరిచి ఉంచాలా?

Pooja Room Vastu: నిత్యం ఇంట్లో పూజ చేసేవారుంటారు. భక్తిశ్రద్ధలతో పూజ పూర్తైన తర్వాత..నైవేద్యం సమర్పిస్తారు. అయితే పూజ పూర్తైన తర్వాత పూజగది తలుపులు మూసి ఉంచాలా? తెరిచి ఉంచాలా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పవళింపు సేవ, దైవికశక్తి నిలుపడానికి పూజగది తలుపులు మూయవచ్చు.

Spirituality: పూజలు, వ్రతాలు సహా నిత్యం ఇంట్లో పాటించే నియమాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతుంటారు. ఇలా చేయాలని కొందరు, అలా చేయాలని కొందరు ఎవరి నమ్మకాలు వారివి. అయితే పూజ పూర్తైన తర్వాత పూజా మందిరం తలుపులు తెరిచి ఉంచాలా? మూసి ఉంచాలా? ఏం చేస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీనికి ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన సమాధానమేంటి తెలుసుకోండి? 

చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ తర్వాత..దీపం వెలుగుతున్నంతసేపూ తలుపులు తెరిచి ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. 

దీప జ్యోతి నుంచి వెలువడే సానుకూల శక్తి ఇల్లంతా వ్యాపించి శాంతి, సౌభాగ్యాలను కలిగిస్తుందని విశ్వాసం.

సాయంత్రం సమయంలో కూడా వెలిగించే దీపం మహాలక్ష్మీ ప్రవేశానికి సంకేతంగా భావిస్తారు...తలుపులు తెరిచి ఉంచడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు భావిస్తారు
 
దీపం వెలగడానికి ఆక్సిజన్ అవసరం. తలుపులు మూసివేస్తే గాలి ప్రసరణ తగ్గి దీపం ఘనమయ్యే అవకాశం ఉండొచ్చు..అందుకోసం కూడా తలుపులు తెరిచి ఉంచాలని చెబుతారు. దీపం పూర్తిగా ఘనమయ్యాక డోర్స్ మూసేయవచ్చు.

జూలై 2026లో కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ కోతల ముప్పు లేదా గొప్ప పదోన్నతి? మీ కెరీర్ ఎటువైపు?

పూజగది తలుపులు ఎప్పుడు మూయవచ్చు?

దేవుడి పవళింపు సేవ తర్వాత పూజగది తలుపులు మూయవచ్చు

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజ గది తలుపులు మూసి ఉంచాలి

గాలి ఎక్కువగా వీచి దీపం ఘనమవుతుంది అనిపిస్తే కొద్దిసేపు దీపానికి రక్షణగా పెట్టి ఆ తర్వాత తలుపులు మూసివేయాలి
 
అవకాశం ఉన్నంతవరకూ దీపం వెలిగేటప్పుడు తలుపు తెరిచి ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.  

పూజ సమయంలో ఆహ్వానించిన దైవిక శక్తి, పాజిటివ్ ఎనర్జీని అక్కడే ఉంచడానికి వేసి ఉంచడం మంచిది

ధూపం, దీపం, పూల వాసనలు ఇంటి నుంచి బయటకు వ్యాపించకుండా డోర్స్ మూసివేస్తారు
 
ధూళి, క్రిములు, ప్రతికూల శక్తులు లేదా..పిల్లలు, ఇతరులు ముట్టుకోకుండా కూడా డోర్స్ రక్షణ
 
ఉదయం పూజ తర్వాత కాసేపు తెరిచి ఉంచి మిగిలిన సమయం మూసివేయాలి.   

మీ పూజా మందిరానికి తలుపులు లేకుంటే కర్టెన్లు ఉపయోగించవచ్చు

వక్రగతిలో బుధుడు! మిథునం, కన్య, ధనుస్సు , మీన రాశులపై కెరీర్‌పై ప్రభావం!

దీపంవెలిగించేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం

దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే 

దీపం జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగించి..దేవుడి కన్నా ముందు ఆ దివ్యమైన రూపానికి ప్రతిరూపం అయిన దీపాన్ని ఆరాధిస్తారు. షోడసోపచారాల్లో దీపం మొదటిది. ఉపచారాలు అన్నీ చేసినా లేకున్నా.. దీపం, ధూపం, నైవేద్యం తప్పనిసరిగా అనుసరించాల్సిన ఉపచారాలు.

మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Frequently Asked Questions

పూజ మందిరానికి తలుపులు లేకపోతే ఏం చేయాలి?

మీ పూజా మందిరానికి తలుపులు లేకపోతే, కర్టెన్లు ఉపయోగించవచ్చు. అవి తలుపులకు ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
02-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
02-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
Happy Friendship Day 2026: స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఆధ్యాత్మిక స్నేహ శ్లోకాలు, అర్థాలు!
స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ఆధ్యాత్మిక స్నేహ శ్లోకాలు, అర్థాలు!
Spiritual Energy : జ్యోతిర్లింగ దర్శనం తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం!
జ్యోతిర్లింగ దర్శనం తర్వాత అనారోగ్యానికి గురవుతున్నారా? దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యం!
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget