అన్వేషించండి

హనుమాన్ చాలీసా ఈ నియమాలతో పఠించండి, మీకు తిరుగుండదు

హనుమాన్ చాలీసా రోజూ పారాయణం చెయ్యడం వల్ల కేవలం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడం మాత్రమే కాదు రామచంద్రుడి కరుణ కటాక్షం కూడా కలుగుతుంది.

హనుమంతుడు అకుంఠిత భక్తితో దేవుడిగా మారిన భక్తుడు. అతడి తిరుగులేని రామభక్తి అతడిని దైవంగా మార్చింది. హనుమంతుడి ఆరాధన వల్ల జీవితంలో సాధించలేమని అనుకున్న కార్యాలను కూడా సాధించగలిగే ఆత్మవిశ్వాసం వస్తుంది. హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించడం దగ్గరి దారి. హనుమాన్ చాలీసా పఠించేందుకు కొన్ని చిన్న చిన్న నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా త్వరగా లక్ష్యాన్ని సాధించవచ్చు.

హనుమాన్ చాలీసా పఠించే వారి జీవితంలో కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కానీ హనుమాన్ చాలీసా పఠించే సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అలా నియమానుసారం పఠించినపుడు తప్పకుండా ఫలితం ఉంటుంది.

హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై శ్లోకాలు ఉంటాయి. ఈ పద్య సంపుటిని తులసీ దాస్ రచించారు. వీటిని దోహాలు అని కూడా అంటారు. శివుడి 11వ రుద్రావతారంగా హనుమంతుడిని భావిస్తారు. హనుమాన్ చాలీసా చదివినా, విన్న అత్యంత భక్తి భావానికి లోనవుతారు. హనుమాన్ చాలీసా పఠించే ఎవరికైనా అనారోగ్యం నుంచి విముక్తి దొరుకుతుంది. శత్రు బాధ నశిస్తుంది. హనుమంతుడి ఆరాధన ప్రాణ శక్తి పెరుగుతుంది.

  • హనుమాన్ చాలీసా పఠించడానికి మంగళ వారం చాలా అనువైన రోజు. మంగళ వారం నాడు ప్రదోష వేళ నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఆతర్వాత సీతా రాములను ఆరాధించాలి. అప్పుడు రామ భక్త హనుమాన్ కు నమస్కారం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తాననే ప్రతిజ్ఞ చేసుకోవాలి.
  • తర్వాత హనుమంతుడికి పువ్వులు సమర్పించి, ధూపం వెలిగించి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం మొదలు పెట్టాలి.
  • హనుమాన్ చాలీసా కుశాసనం మీద కూర్చుని చదవాలి. ఒక్కసారి పూర్తిగా చదవాలి లేదా చదవగలిగితే 11సార్లు కూడా చదువుకోవచ్చు. హనుమాన్ చాలీసా చదవాలని అనుకున్నపుడు మధ్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం తినకూడదు.
  • హనుమాన్ చాలీసా చదవడం పూర్తయిన తర్వాత బూందిలడ్డు లేదా పండ్లు హనుమంతుడికి సమర్పించాలి. తర్వాత ప్రసాదాన్ని మీరు తీసుకోవడంతో పాటు ఇతరులకు కూడా పంచాలి.

హనుమాన్ చాలీసా చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • హనుమాన్ చాలిసా క్రమం తప్పకుండా నలభై రోజుల పాటు పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.
  • భయాల నుంచి విముక్తి లభిస్తుంది.
  • కార్యసాధనలో ఏర్పడిన అడ్డంకులు తొలగి పోతాయి. అభివృద్ధి మార్గం సుగమం అవుతుంది.
  • మంగళ వారం సంకట్మోచన హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందకు అనువైన రోజు. హనుమంతుడు మాత్రమే కలియుగంలో సైతం సజీవంగా ఉన్న దైవంగా భక్తుల నమ్మకం.
  • హనుమంతుడి దయ వల్లే తులసీదాస్ కు రాముడి సాక్షాత్కారం కలిగిందని చెబుతారు.
  • రామకథ జరిగే చోట హనుమంతుడు తప్పక ఏదో ఒక రూపంలో ఉంటాడని నమ్మకం.
  • క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా చదవడం వల్ల దుష్టశక్తుల నుచి విముక్తి దొరికి ధైర్యవంతుడవుతాడు.
  • హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది.
  • పిల్లలు హనుమాన్ చాలీసా పఠిస్తే మేధావులుగా, సంస్కారవంతులుగా ఎదుగుతారు.

Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 10 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
నవంబర్ 10 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
నవంబర్ 10 రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఊహించని మలుపులు!
నవంబర్ 10 రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఊహించని మలుపులు!
నవంబర్ 10 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశులవారికి కార్తీకమాసం మొదటిరోజు ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 10 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశులవారికి కార్తీకమాసం మొదటిరోజు ఎలాంటి ఫలితాలు?
Karthika Masam 2026 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? కార్తీక పౌర్ణమి,క్షీరాబ్ధి ద్వాదశి సహా ముఖ్యమైన రోజులివే!
2026 కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? కార్తీక పౌర్ణమి,క్షీరాబ్ధి ద్వాదశి సహా ముఖ్యమైన రోజులివే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget