By: ABP Desam | Updated at : 09 Aug 2021 06:10 PM (IST)
రామాయణ పాఠశాల
రామాయణంలో ఏ చిన్న ఘట్టాన్ని చూసినా అక్కడ రాముడి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉంటుంది. అందుకే రాముణ్ణి విగ్రహరూపం దాల్చిన ధర్మం (రామో విగ్రహవాన్ ధర్మః) అన్నారు. తల్లిదండ్రుల పట్ల పుత్రుడిగా రాముడి ప్రవర్తన పుత్ర ధర్మానికి ఆదర్శం. గురువైన విశ్వామిత్రుడితో ప్రవర్తన శిష్య ధర్మానికి ఆదర్శం. అడవిలో రుషులకు రక్షణ కల్పించడం, రాక్షసులను అణచడం రాజధర్మం. ఇంకా… భార్యను అత్యంత ప్రేమించడం, ప్రజలను కన్న బిడ్డల్లా చూడటం, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంతదూరమైనా వెళ్ళటం వంటి సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి…. స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, పదవీ వ్యామోహం వంటి దుర్గుణాలు లేని వ్యక్తి. మహా విష్ణువు అవతారాల్లో ఒకటైనప్పటికీ త్రేతా యుగంలో ఆదర్శ మానవ జీవితాన్ని గడిపి సామాన్యుడిగా అసామాన్య ప్రజ్ఞ చూపించిన మహావ్యక్తి శ్రీరాముడు. రామాయణం చదివి అనుసరించినవారంతా ఉత్తములుగానే ఉంటారన్నది పెద్దల మాట. అందుకే మంచి విలువలు నేర్పించడానికి బాల్యం నుంచి పిల్లలకు బోధించే కథ ఇది. రచయిత శంతను గుప్తా రామాయణ పాఠశాల ప్రారంభించడానికి...పిల్లలకు నేర్పించడానికి ఇదే కారణం కావొచ్చు..
నిత్యం ఆన్ లైన్ గేమ్స్ లో మునిగితేలే పిల్లలకు గేమ్స్, ఫజిల్స్ తో పాటూ రామాయణ పాఠాలు కూడా బోధించేందుకు ఓ స్కూల్ ప్రారంభించారు రచయిత శంతనుగుప్తా. ప్రాచీన భారతీయ ఇతిహాసాల నుంచి జీవిత పాఠాలు, ప్రవర్తనా నైపుణ్యాలను నేర్పించే లక్ష్యంతో శంతనుగుప్తా రామాయణం పాఠశాల స్టార్ట్ చేశారు. 14 ఏళ్లప్పుడు రాకుమారుడు శ్రీరామచంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు, వనవాసంలో ఉన్నప్పుడు... భార్య సీతని రావణుడు అపహరించుకుపోయాడు. వనవాసం పూర్తిచేసుకుని వచ్చి పట్టాభిషేకం అయిన ఆనందం కూడా మిగలకుండా భార్యను అడవులకు పంపించాడు. రాముడి జీవితం ఆద్యంతం కష్టాలే... అయినప్పటికీ ఎప్పుడూ మంచితనం, నిజాయితీ, విలువల మార్గాన్ని విడిచిపెట్టలేదు.... విజేతగానే నిలిచాడు. అందుకే రాముడిని మించి నాయకుడు, రామయాణాన్ని మించిన నాయకత్వ పాఠం ఏముందటారు శంతనుగుప్తా.
గతేడాది లాక్ డౌన్ సమయంలో రామాయణ పాఠశాల ప్రారంభించిన శంతనుగుప్తా... 7 నుంచి 14 ఏళ్ల పిల్లలకు నాయకత్వ పాఠాలు నేర్పించడం ప్రారంభించారు. ఒక్కో విద్యార్థి నుంచి కేవలం రూ.3 వేల రూపాయలు వసూలు చేసి...దాదాపు 2030 మంది విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇలా గతేడాది 60 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. విదేశాల్లో ఉన్న మనదేశ విద్యార్థులూ ఇందులో ఉన్నారు.
రామాయణం అంటే మతం కాదు…
రామాయణాన్ని మతాన్ని ముడిపెట్టి చూడడం సరికాదంటారు శంతనుగుప్తా. రాముడి లాంటి వ్యక్తిత్వం, ప్రవర్తనా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు…ఇంకా యువరాజు నుంచి రాజయ్యే వరకూ..ఆ తర్వాత కూడా అడుగడుగూ రాముడి నుంచి ఏం నేర్చుకోవచ్చో గుప్తా వివరించారు. ప్రస్తుతం రామాయణం పాఠశాలలో ఐదుగురు ఫుల్ టైమ్ వర్కర్లు...చాలామంది పార్ట్ టైం వర్కర్లు పనిచేస్తున్నారన్న శంతనుగుప్తా... వీరంతా పిల్లలకు బోధించేందుకు వీలుగా కంటెంట్ తయారు చేసి...కొత్త పుస్తకాల తయారు చేస్తున్నారని చెప్పారు.
పాఠశాలకు నిధులెలా అంటే…
గతేడాది స్నేహితులు,కుటుంబ సభ్యులనుంచి సేకరించిన నిధులతో పాఠశాల ప్రారంభించామన్న గుప్తా... ఈఏడాది జనవరి నుంచి ఫండ్ రైజింగ్ ప్రారంభించామన్నారు. దాదాపు పదికోట్ల వరకూ నిధులు వస్తాయని అంచనావేస్తున్నారు. ఈ పాఠశాలకోసం నిధులిచ్చిన వారిని ఇందులో ఒకశాతం భాగస్వాములను చేస్తూ..అందుకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇస్తామని చెప్పారు.
రామాయణం పాఠశాల గతేడాది ప్రారంభించినప్పటికీ...ఈ ఆలోచన మాత్రం కొన్నేళ్ల క్రితం నాటిదన్నారు గుప్తా. తన కొడుక్కి రామాయణాన్ని బోధించేటప్పుడు ఆయనకి ఈ ఆలోచన పుట్టిందట. ఆ తర్వాత నిపుణులతో మాట్లాడి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందానని...అయినప్పటికీ...సాధారణ వ్యక్తి అర్థం చేసుకునే దానికన్నా రామాయణంలో చాలా ఉందనిపించిందని చెప్పారు. ఆ ఆలోచన నుంచే రామాయణ పాఠశాల పుట్టిందన్నారు. కేవలం రామాయణం మాత్రమే కాదు... త్వరలో భగవద్గీత మరియు మహాభారతం నుంచి కూడా పాఠాలు బోధిస్తామన్నారు.
శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, వివేకానందుల శరీరాలు నేడు లేవు. కాని వారి గుణాలు శాశ్వతం అయ్యాయి. అందుకే శరీరం కోసం జీవించడం కాదు. లోకకళ్యాణం కోసం ఈ జీవితాన్ని అర్పించాలి. ఈ శరీరాన్ని ఉపయోగించి లోకకల్యాణ కారకమైన సద్గుణాలను సంపాదించుకోవాలి. హిందువులు విగ్రహారాధకులం మాత్రమే కాదు, గుణారాధకులు. ఆ మహాపురుషుల విగ్రహాలు పెట్టుకోవడం కాదు…వారి గుణాలనూ స్మరించాలి. అలాంటి ఆదర్శ జీవితం గడపాలంటున్నారు గుప్తా….
Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా
Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Panchang 2nd July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం
Jagannath Rath Yatra 2022: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!
Transfers In AP: దేవాదాయ శాఖలో సామూహిక బదిలీలు- అర్థరాత్రి జీవో విడుదల
Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్
Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు
The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్
BJP PLenary Plan On TRS : తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే