వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడికి పది భౌతిక తలలు ఉన్నాయి, లేదా వాటిని సృష్టించుకునే విద్య ఉండేది. అయితే కొన్ని జైన గ్రంథాలు అతను తొమ్మిది రత్నాలతో భ్రమ సృష్టించాడని చెబుతాయి.
Ramayana: రావణుడి 10 తలలు నిజమా? పురాణాలు చెప్పే అసలు రహస్యం!
Ramayana Ravana: రావణుడికి 10 తలలు ఉన్నాయని అందుకే దశకంఠుడు అని పిలుస్తారని పురాణాల్లో ఉంది. నిజంగా రావణుడికి పది తలలు ఉన్నాయా, లేక ఇది కేవలం ఒక పురాణ కథనా?

- వాల్మీకి ప్రకారం, రావణుడి పది తలలు జ్ఞానం, పాండిత్యానికి ప్రతీక.
- జైన గ్రంథాల ప్రకారం, పది తలలు రత్నాల భ్రమ మాత్రమే.
- పురాణాలు రావణుడికి శివుని వరంగా పది తలలు లభించాయి.
- దశమి నాడు మరణించినా, రావణుడు గొప్ప పండితుడు, భక్తుడు.
Ramayana: రామాయణంలో రావణుడు ఒక కీలక పాత్ర, తను లేకపోతే ఆ కథ అసంపూర్ణం. అత్యంత జ్ఞాని, వేద పండితుడైన రావణుడిని పది తలల కారణంగా దశానన్ అని పిలిచేవారు. కానీ రావణుడికి నిజంగా పది తలలు ఉన్నాయా?
Ramayana: రావణుడిని రావణబ్రహ్మ అని ఎందుకంటారు? అసలు రహస్యం ఇదే!
వాల్మీకి రామాయణం ప్రకారం..
రావణుడికి నిజంగానే 10 భౌతిక తలలు ఉన్నాయని , యుద్ధ సమయంలో లేదా ప్రత్యేక సమయాల్లో వాటిని సృష్టించుకోగల కామరూప విద్య కలిగి ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయ్. ఎందుకంటే రావణుడు శివభక్తుడు, మహాపండితుడు.. నాలుగు లేదాలు, ఆరు శాస్త్రాలు పూర్తిగా అధ్యయనం చేసి వాటిపై పట్టు సాధించాడు. 10 రకాలైన పాండిత్యానికి సంకేతంగా 10 తలలు ఉన్నాయని చెబుతారు. కానీ నిజానికి పదితలలు వ్యక్తిత్వానికి ప్రతీకలు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, చిత్తం, మానస, బుద్ధిని ప్రతిబింబిస్తాయి. రావణుడి వ్యక్తిత్వంలో భాగమైన పూర్తి శక్తి, యుక్తులను పది తలలు ప్రతీకలు అని వివరిస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు
జైన గ్రంథాల ప్రకారం..
రావణుడికి పది తలలు లేవు. తల్లి కైకసి అతనికి ఇచ్చిన తొమ్మిది పెద్ద, గుండ్రని రత్నాలు అతని మెడలో ఉండేవి. ఈ తొమ్మిది రత్నాల వల్లే రావణుడు తనకు పది తలలు ఉన్నాయనే భ్రమను సృష్టించాడు.
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
మత గ్రంథాల ప్రకారం..
రావణుడిని అనేక శక్తులు, విజయాలు సాధించిన మాంత్రికుడిగా వర్ణిస్తాయి. అతనికి వివిధ రకాల మాయవిద్యలు కూడా తెలుసు. తన శక్తులు , మాయలను ఉపయోగించి, రావణుడు తనకు పది తలలు ఉన్నాయనే భ్రమను సృష్టించాడు.
హిందూ పురాణాల ప్రకారం..
రావణుడు శివుని అనుగ్రహంతో పది తలలను పొందాడు. రావణుడు శివుని పరమ భక్తుడు. రావణుని భక్తికి సంతోషించిన శివుడు అతనికి దశానన వరాన్ని ప్రసాదించాడు. అయితే, రావణుని పది తలలు పది దుష్ట శక్తులకు ప్రతీకగా పరిగణిస్తారు
రామచరితమానస్ ప్రకారం..
రావణుడి పది శిరస్సుల గురించి కూడా చర్చిస్తుంది రామచరితమానస్. దాని ప్రకారం, కృష్ణ పక్షం (అంధకార పక్షం) అమావాస్య రోజున ప్రారంభమైన యుద్ధంలో, రావణుడి శిరస్సులు ఒక్కొక్కటిగా నరికివేశారు.. చివరకు శుక్ల పక్షం పదవ రోజున చంపబడ్డాడు. అందువల్ల, రావణుడిని దసరా లేదా విజయదశమి నాడు దహనం చేస్తారు.
Ramayana OTT : ఓటీటీలోకి మైథలాజికల్ ఎపిక్ రామాయణ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రామాయణంలో..
మత గ్రంథాలలోనూ రావణుడిని తరచుగా ప్రతినాయకుడిగా చిత్రీకరించినప్పటికీ, తనకి సద్గుణాలు కూడా ఉన్నాయి. గూఢవిద్య, వేదాలు, సంగీతంపై జ్ఞానం ఉండేది. గొప్ప పండితుడు, శివ భక్తుడు , గొప్ప సన్యాసి. అందుకే, తన మరణశయ్యపై శ్రీరాముడు లక్ష్మణుడిని రాజనీతి తెలుసుకోమమని రావణుడి దగ్గరకు పంపించాడు రాముడు.
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Shiva Tandava Stotram: రావణుడు రచించిన ఈ స్తోత్రమే 'బాహుబలి' సినిమాలో పాట!
Frequently Asked Questions
రావణుడికి నిజంగా పది తలలు ఉన్నాయా?
రావణుడి పది తలలు దేనికి ప్రతీకలు?
రావణుడి పది తలలు పది రకాల పాండిత్యానికి, కామం, క్రోధం వంటి వ్యక్తిత్వ లక్షణాలకు ప్రతీకలు. కొన్ని పురాణాల ప్రకారం, అవి పది దుష్టశక్తుల సంకేతం.
హిందూ పురాణాల ప్రకారం రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి?
హిందూ పురాణాల ప్రకారం, రావణుడు శివుని పరమ భక్తుడు. రావణుని భక్తికి సంతోషించిన శివుడు అతనికి దశానన (పది తలలు) వరాన్ని ప్రసాదించాడు.
రావణుడికి సద్గుణాలు కూడా ఉన్నాయా?
అవును, రామాయణంలో రావణుడు గొప్ప పండితుడు, శివ భక్తుడు, వేదాలు, సంగీతంపై జ్ఞానం ఉన్నవాడు. శ్రీరాముడు కూడా లక్ష్మణుడిని అతని నుండి రాజనీతి నేర్చుకోమని పంపాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























