అన్వేషించండి

Ramayana: రావణుడిని రావణబ్రహ్మ అని ఎందుకంటారు? అసలు రహస్యం ఇదే!

Ramayana Ravana: రావణుడిని రావణ బ్రహ్మ అంటారెందుకు? సృష్టికర్త బ్రహ్మకి రావణుడికి ఏంటి సంబంధం? యష్ రావణుడిగా నటించిన రామాయణం విడుదలైన సందర్భంగా ఈ వివరాలు మీకోసం

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రావణుడు సృష్టికర్త బ్రహ్మ వంశంలో జన్మించిన మునిమనవడు.
  • జ్ఞానం, శివభక్తితో పాటు అహంకారం, అధికార కాంక్ష కలవాడు.
  • వేదశాస్త్ర, సంగీత, జ్యోతిష పండితుడు, గొప్ప శివభక్తుడు.
  • జ్ఞానం ఉన్నా ధర్మం వీడితే పతనం తప్పదని నిరూపించాడు.

 

Ravana Brahma: రామాయణంలో రావణుడిని సాధారణంగా ప్రతినాయకుడిగా చూస్తాం కానీ ఆధ్యాత్మిక, పౌరాణిక సంప్రదాయాల్లో రావణుడి వ్యక్తిత్వం ఎంతో విస్తృతమమైనది. ఇంతకీ రావణుడిని రావణ బ్రహ్మ అంటారెందుకు? సృష్టికర్త బ్రహ్మకు, లంకాధిపతి రావణుడికి ఉన్న సంబంధం ఏంటి?  ఈ ప్రశ్నలకు సమమాధానం తెలుసుకుంటే రావణుడి వ్యక్తిత్వంలో మరో కోణం ఆవిష్కృతమవుతుంది.  
 
సృష్టికర్త బ్రహ్మతో రావణుడికి ఉన్న సంబంధం ఏంటి?

రావణుడు అంటే కేవలం ఓ ప్రతినాయకుడు మాత్రమే కాదు. అపారమైన జ్ఞానం, అసాధారణమైన శివభక్తి, మహోన్నతమమైన తపశ్శక్తితో పాటూ అహంకారంతో కూడిన అపారమైన అధికార కాంక్ష కలిగిన సంక్లిష్టమైన వ్యక్తిత్వం. అందుకే ఆయనను రావణ బ్రహ్మ అంటారు.  

బ్రహ్మవంశంలో జన్మించిన రావణుడు
 
హిందూ పురాణాల ప్రకారం రావణుడు బ్రహ్మ వంశానికి చెందినవాడు. సృష్టికర్త బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరైన మహర్షి పులస్త్యుడు రావణుడి వంశానికి చెందిన మూలపురుషుడు.

పులస్త్యుడి కుమామరుడు విశ్రవసుడు

విశ్రవసుడి - కైకసికి జన్మించినవాడు రావణుడు

అంటే..
రావణుడు బ్రహ్మదేవుడికి మునిమనవడు
 
రావణుడికి బ్రహ్మతో ఉన్న సంబంధం కేవలం పేరులోది మాత్రమే కాదు..వంశపారపర్యమైనది కూడా. అయితే రావణుడే సృష్టికర్త బ్రహ్మ అని అర్థం కాదు. బ్రహ్మవంశంలో జన్మించినవాడు కావడం, బ్రాహ్మణ వంశానికి చెందినవాడు కావడం ఆయనకు ప్రత్యేకమైన పౌరాణిక నేపథ్యాన్నిచ్చాయ్.  

రావణబ్రహ్మ అనే పేరులో అంతరార్థం
 
రావణుడు సాధారణమైన రాజు కాదు. వేదాలు, శాస్త్రాలు, సంగీతం, జ్యోతిష్యం, ఆయుర్వేదం వంటి అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించి మహాపండితుడిగా పురాణాలు అభివర్ణించాయి. రావణుడు గొప్ప శివభక్తుడు కూడా. పరమేశ్వరుడిని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు, తన భక్తి, తపోబలంతో విశేషమైన వరాలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.  

శివతాండవ స్తోత్రం రావణుడి పేరుతో ప్రసిద్ధి చెందడం ఆయన భక్తి, కవితా ప్రతిభకు నిదర్శనంగా భావిస్తారు. ఈ స్థాయి పాండిత్యం, తపస్సు, ఆధ్యాత్మిక సాధన కలిగిన వ్యక్తి కావడంతో ఆయనను గౌరవార్థంగా రావణబ్రహ్మ అని సంబోధించే సంప్రదాయం ఏర్పడింది. ఇక్కడ బ్రహ్మ అనే పదాన్ని సృష్టికర్త బ్రహ్మతో సమానమైన వ్యక్తి అనే అర్థంలో కాకుండా, బ్రహ్మజ్ఞానం, పాండిత్యం, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకగా కూడా అర్థం చేసుకోవాలి. 

జ్ఞానం ఉన్నా ధర్మ లేకపోతే?
 
రావణుడి జీవితంలో అసలైన ఆధ్యాత్మిక సందేశం ఇక్కడే ఉంది. అపారమమైన జ్ఞానం ఉన్నా, తపస్సుతో శక్తులను సంపాదించినా, ఇంద్రియ నిగ్రహం లేకపోతే పతనం తప్పదని రావణుడి పాత్ర మనకు బోధిస్తుంది. రావణుడికి వేదజ్ఞానం ఉంది. శివభక్తి ఉంది, అపారమైన పరాక్రమం ఉంది. కానీ కామం, క్రోధం, అహంకారం ఆయన వివేకాన్ని కప్పేశాయి. పరస్త్రీని అపహరించి ధర్మమార్గాన్ని అతిక్రమించాడు. తనకు తెలిసిన ధర్మాన్ని ఆచరణలో పెట్టలేపోయాడు. అందుకే రామాయణం మనకు చెప్పే సందేశం ఏంటంటే.. జ్ఞానం సంపాదించడం గొప్పే కానీ ఆ జ్ఞానాన్ని ధర్మబద్ధంగా ఉపయోగించడం అంతకన్నా గొప్పది. భక్తి ఉండడం గొప్పే కానీ భక్తితో పాటూ వినయం,మంచి ప్రవర్తన కూడా ఉండాలి.  

రావణుడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇదే
 
రావణుడిని పూర్తిగా దుష్టుడిగా మాత్రమే చూడడం సరికాదు..అలాగే ఆయన పాండిత్యాన్ని చూసి అధర్మాన్ని సమర్ధించడం కూడా అంతే పొరపాటు. రాముడు ధర్మానికి ప్రతీక అయితే రావణుడు జ్ఞానం, అహంకారం మధ్య జరిగిన సంఘర్షణకు ప్రతీక.  

రావణ బ్రహ్మ అనే సంబోధన ఓ విషయాన్ని గుర్తుచేస్తుంది. మనిషి ఎంతటి విద్యావంతుడైనా, శక్తిమంతుడైనా, ధర్మాన్ని విడిచిపెడితే పతనం తప్పదు
 
బ్రహ్మవంశంలో పుట్టడం గొప్పకావొచ్చు
బ్రహ్మజ్ఞానం సంపాదించడం విశిష్టత కావొచ్చు
కానీ..
ఆ జ్ఞానాన్ని ధర్మంగా మలుచుకున్నప్పుడే మహనీయుడు అవుతాడు

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.   

Frequently Asked Questions

రావణుడిని రావణ బ్రహ్మ అని ఎందుకు అంటారు?

ఆయన అపారమైన జ్ఞానం, శివభక్తి, తపశ్శక్తితో పాటు వేదాలు, శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. బ్రహ్మజ్ఞానం, పాండిత్యం, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకగా ఆయన్ను గౌరవార్థం అలా పిలుస్తారు.

సృష్టికర్త బ్రహ్మతో రావణుడికి ఉన్న సంబంధం ఏమిటి?

రావణుడు బ్రహ్మ వంశానికి చెందినవాడు. ఆయన సృష్టికర్త బ్రహ్మ మునిమనవడు. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్య మహర్షి కుమారుడు విశ్రవసుడికి, కైకసికి రావణుడు జన్మించాడు.

రావణుడి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి?

అపారమైన జ్ఞానం, శక్తులు ఉన్నా, ధర్మ మార్గాన్ని విడిచిపెడితే పతనం తప్పదని రావణుడి పాత్ర బోధిస్తుంది. జ్ఞానాన్ని ధర్మబద్ధంగా ఉపయోగించడం, భక్తితో పాటు వినయం, సత్ప్రవర్తన ఉండాలని తెలుపుతుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ధనుస్సు, మకరం, కుంభం, మీనం: నవంబర్ 25న మీ రాశిఫలం ఏం చెబుతోంది?
ధనుస్సు, మకరం, కుంభం, మీనం: నవంబర్ 25న మీ రాశిఫలం ఏం చెబుతోంది?
నవంబర్ 25 బుధవారం రాశి ఫలాలు: సింహం, కన్య, తుల, వృశ్చికం ఎవరికి అదృష్టం, ఎవరికి సవాళ్లు!
నవంబర్ 25 బుధవారం రాశి ఫలాలు: సింహం, కన్య, తుల, వృశ్చికం ఎవరికి అదృష్టం, ఎవరికి సవాళ్లు!
నవంబర్ 25, 2026 రాశిఫలాలు: మేషం, మిథునానికి కష్టాలు; వృషభం, కర్కాటకానికి లాభాలు!
నవంబర్ 25, 2026 రాశిఫలాలు: మేషం, మిథునానికి కష్టాలు; వృషభం, కర్కాటకానికి లాభాలు!
Tirumala: శ్రీవారికి ఏ రోజు ఏ ఆభరణాలు? కొత్త భక్తుడు ఇచ్చే 121 కిలోల బంగారు నగలు ఎప్పుడు వేస్తారు?
శ్రీవారికి ఏ రోజు ఏ ఆభరణాలు? కొత్త భక్తుడు ఇచ్చే 121 కిలోల బంగారు నగలు ఎప్పుడు వేస్తారు?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget