అన్వేషించండి

Sri Rama Navami 2022: నారదుడికే షాకిచ్చిన 'రామ' నామం

ఏప్రిల్ 10 ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా….శ్రీరామచంద్రుడిపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనాలు. ఇందులో భాగంగా రామనామం మహిమను వివరించే కథనం మీకోసం..

త్రిలోకసంచారి అయిన నారదుడు...ఓసారి శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వెళ్లాడు. భక్తితో నమస్కరించి..స్వామీ రామనామం మహిమ గురించి తెలుసుకోవాలి అనుకుంటన్నాను అన్నాడు. అయ్యో నారదా నీకు రామనామం గురించి తెలియదా..అదిగో ఆ చెట్టుకొమ్మపై చిలుక ఉంది అడుగు అని చెప్పాడు శ్రీహరి. ఆ ఆజ్ఞను శిరసావహించి నారదుడు చెట్టు దగ్గరకు వెళ్లాడు.

చిలుకను ప్రశ్నించిన నారదుడు: ఓ చిలుకా! రామ అంటే నీకు అర్ధం తెలుసా అని ప్రశ్నించాడు. 'రామ అనే శబ్దం వినేటప్పటికీ ఆ చిలుక చెట్టుపై నుంచి కిందపడి ప్రాణం విడిచింది. అదేంటి రామా అంటే అర్థం ప్రాణం పోవడమా ఇలా జరిగిందేటంని మళ్లీ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి మీరు చెప్పినట్టే చిలుకలను అడిగితే అది వెంటనే కిందపడి ప్రాణం వదిలింది. ఆ చిలుక చావుకు నేను కారకకుడను. ఎంత పాపం చేశానని బాధపడ్డాడు. ఓదార్చిన నారాయణకుడు బాధపడకు నారదా..భూలోకంలో ఓ బ్రాహ్మణుడి ఇంట్లో ఓ ఆవుకు దూడ పుట్టింది వెళ్లి  ఆ దూడను అడుగు అన్నాడు. సరే అని చెప్పినప్పటికీ నారదుడికి భయం వేసింది.

Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే

దూడను ప్రశ్నించిన నారదుడు: చిలుక లానే ఆవుదూడ కూడా చనిపోతే ఆ యజమాని తనను కొరడా పట్టుకుని కొడతాడేమో అనుకుంటాడు. ఏదైనా కానీ రామానామం మహిమ, అర్థం తెలుసుకోవాల్సిందే అనుకుంటూ ఆ దూడ దగ్గరకు వెళ్లి  'ఓ దూడా! రామ అంటే అర్ధం ఏంటి అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడుస్తుంది. అనుకున్నంతా అయిందనుకున్న నారదుడు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. మళ్లీ నారాయణుని వద్దకు వెళ్లి స్వామీ! ఆవు దూడకు కూడా చిలుకకు పట్టిన గతే పట్టింది. దీని అర్ధం ఇంతేనా అని అడిగాడు. 

రాకుమారుడిని ప్రశ్నించిన నారదుడు: నారదా... ఇప్పుడే ఓ మహారాజుకు లేక లేక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని అడుగు అన్నాడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు బయలుదేరాడు. కానీ కొంతదూరం పోయి వెనుకకు తిరిగి వచ్చాడు. ఆ చిలుకకు, దూడకు ఎవ్వరూ లేరుకాబట్టి నాకేం కాలేదు కానీ ఇప్పుడా రాకుమారుడికి ఏమైనా జరిగితే పరిస్థితేంటి నాకు నీ దర్శనం కూడా లేకుండా పోతుందంటీనే... సరే ఏం జరిగినా అంతా నీదే భారం అనుకుంటూ రాజ్యానికి వెళతాడు. వారసుడు పుట్టినందుకు సంతోషించిన ఆ రాజు నారదుడిని చూసి సకల మర్యాదలతో ఆహ్వానం పలుకుతాడు. మీరు మంచి సమయానికి వచ్చారు. లేక లేక నాకు కుమారుడు జన్మించాడు. మీరు ఆశీర్వదించండి అని ప్రార్థిస్తాడు. లోపల భయం ఉన్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాకుమారుడిని చేతుల్లోకి తీసుకుంటాడు నారదుడు. 
 
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే

తన సందేహం తీర్చుకునే సమయం ఆసన్నమైనదనుకుని నాయనా! రాజకుమారా! శతమానం భవతి, అంటూ వేదమంత్రాలను చదువుతూ మంత్రాలతో కలసి పోయేటట్లుగా సంస్కృతంలో, ఓ రాజకుమారా! రామ అంటే అర్ధం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్ని వింటూనే రాజకుమారుడు నవ్వుతాడు. హమ్మయ్య బతికిపోయాను రాకుమారుడికి ఏం కాలేదని అనుకుంటాడు నారదుడు. అప్పుడు ఆ చిన్నారి ఇలా చెబుతాడు...'బ్రహ్మమానసపుత్రా! సర్వం తెలిసిన మీకు రామనామం  అర్థం, మహిమ తెలియదా... నేను చెట్టు మీద చిలుకగా ఉన్నప్పుడు మీరు వచ్చి రామనామం అర్ధం ఏంటని ప్రశ్నించారు. ఒక్కసారి రామనామం వినేసరికి నా జన్మ సార్థకమైంది. వెంటనే దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవు దూడనై పుట్టాను. మీరు అక్కడికి వచ్చి అదే ప్రశ్న వేసారు. రెండవసారి రామనామం విని ఆ జన్మను కూడ విసర్జించి ఇప్పుడు రాజకుమారుడిగా పుట్టాను అన్నాడు. 

పక్షి, ఆవుదూడ, రాకుమారుడు...అంటే రామనామ శ్రవణంలోనే ఇంత మహిమ ఉంటే రామానామ కీర్తనం వల్ల ముక్తికలుగుతుందనడంలో సందేహం లేదంటారు పండితులు. ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పొందుతామని... ఈ జన్మలో అంతఃకరణ శుద్ధికి, మరుజన్మ లేకుండా ఉండేందుకు రామనామ కీర్తనం చేయాలంటారు.

ఎవరి విశ్వాసాలు వారివి..ఏ మత గ్రంధం అయినా మంచి నేర్చుకోమని, చెడును వదిలేయాలనే చెబుతుంది. అందులో భాగమే ఇలాంటి పురాణ కథలు...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
Chaitra Navratri 2026 : 72 ఏళ్ల తర్వాత అమావాస్య, ఉగాది, చైత్ర నవరాత్రి ప్రారంభం అన్నీ ఒకే రోజు! శుభ సమయం, నియమాలు తెలుసుకోండి!
72 ఏళ్ల తర్వాత అమావాస్య, ఉగాది, చైత్ర నవరాత్రి ప్రారంభం అన్నీ ఒకే రోజు! శుభ సమయం, నియమాలు తెలుసుకోండి!
Guru Margi 2026: మార్చి 11న ఈ 5 రాశుల అదృష్టం తలుపు తడుతుంది! కెరీర్, సంపదలో భారీ మార్పులు!
మార్చి 11న ఈ 5 రాశుల అదృష్టం తలుపు తడుతుంది! కెరీర్, సంపదలో భారీ మార్పులు!
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!
మార్చి 13 నుంచి 40 రోజులు బలహీనంగా శని! కానీ..ఈ 4 రాశులకు ప్రయోజనం!

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Honda Dio 125 కొనబోతున్నారా? స్టాండర్డ్, X ఎడిషన్, DLX వేరియంట్ల ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు
హోండా డియో 125 స్కూటర్‌ వేరియంట్లు, ధరలు ఇవే - ఏ మోడల్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
సైకిల్ తొక్కుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందే ఇక్కడ!
సైకిల్ తొక్కుతున్నప్పుడు గొడుగు పట్టుకుంటే ఫైన్ కట్టాల్సిందే ఇక్కడ!
Embed widget