![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Panchang 14th July 2022: జులై 14 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏదైనా పనిపై వెళ్లేటప్పుడు పఠించాల్సిన జయ మంత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
![Panchang 14th July 2022: జులై 14 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏదైనా పనిపై వెళ్లేటప్పుడు పఠించాల్సిన జయ మంత్రం Panchang 14th July 2022: Thursday Panchang, lord rama pancha ratna strotram, know in deatils Panchang 14th July 2022: జులై 14 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏదైనా పనిపై వెళ్లేటప్పుడు పఠించాల్సిన జయ మంత్రం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/f0b88b00ec19bafe85e3fc89704067fc1657707352_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 14 గురువారం పంచాంగం
తేదీ: 14-07 -2022
వారం: గురువారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి : పాడ్యమి గురువారం రాత్రి 10.07 వరకూ తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తరాషాడ రాత్రి 10.47 వరకు తదుపరి శ్రవణం
వర్జ్యం : ఉదయం 7.52 నుంచి 09.21 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 9.56 నుంచి 10.48 వరకు
అమృతఘడియలు : సాయంత్రం 4.49 నుంచి 6.18 వరకు తిరిగి రాత్రి 2.31 నుంచి తెల్లవారుజామున 4.00 వరకు
సూర్యోదయం: 05:36
సూర్యాస్తమయం : 06:34
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: జులై 14 గురువారం రాశిఫలాలు ఇక్కడ చూసుకోవచ్చు
Also Read: మహాభారతంలో ఈ పాత్రల్లో మీరు ఏటైపు, ఓ సారి చూసుకోండి
పాఠకులకోసం శ్రీరామ పంచ రత్న స్త్రోత్రం, రామాయణ జయ మంత్రం
శ్రీ రామ పంచ రత్న స్తోత్రం
కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 1 ॥
విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 2 ॥
సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 3 ॥
పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 4 ॥
నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 5 ॥
ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ॥
ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం సంపూర్ణం
Also Read: రోజూ పెరుగుతున్న దేవుడి విగ్రహం.. విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
రామాయణ జయ మంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥
పూర్వ కాలంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు రామాయణ జయ మంత్రాన్ని స్మరించుకుంటూ వెళ్లేవారు. రామాయణ జయమంత్రం పఠించి వెళితే అనుకున్న పని శుభప్రదంగా పూర్తై క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని నమ్మేవారు. ఇప్పటికీ చాలామందికి ఆ విశ్వాసం ఉంది.
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)