అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ramappa Temple: మేడారం వచ్చే భక్తులు తప్పకుండా ఇవి చూడాల్సిందే, జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతులు ఇంటికి తీసుకెళ్లొచ్చు.

Medaram News: మేడారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న రామప్ప ఆలయం, చెరువు అందాలు, పెద్దఎత్తున తరలివెళ్తున్న భక్తులు

Spiritual Tourism In Warangal : ఇప్పుడు దేశంలో ట్రెండింగ్ గా నడుస్తోంది ఆధ్యాత్మిక పర్యాటకం(Spiritual Tourism)..అవును ఒకప్పుడు గుడికి వెళ్లాలంటే కేవలం దేవుడి దర్శనం కోసమే వెళ్లేవారు. కానీ ఇప్పటితరం అభిరుచులు మారాయి. భక్తితోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను తనివితీరా ఆశ్వాదించాలనుకుంటున్నారు. ప్రజల అభిరుచి మేరకు ప్రభుత్వాలు సైతం దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత...యూపీ(UP)లో పర్యాటకరంగ ఆదాయం దాదాపు రెట్టింపవుతుందని యోగి సర్కార్ భావిస్తోంది. ఆధ్యాత్మిక పర్యటనలో ప్రజలు ఆహ్లాదాన్ని కోరుకోవడమే ఇందుకు కారణం. అందుకే షిర్డీ(Shiride) వెళ్లిన వారు తప్పకుండా అజంతా ఎల్లోరా గుహలు సందర్శిస్తారు. తిరుపతి(Tirupathi) వెళ్లిన వారు తప్పకుండా తమ జాబితాలో గోల్డెన్ టెంపుల్ చేర్చుకుంటారు. మరి కోటి మంది భక్తులు తరలివచ్చే జనజాతర మేడారం(Medaram) వచ్చిన భక్తులు తప్పకుండా చూడాల్సిన ప్రాంతాల లిస్ట్‌ను ఏబీపీ దేశం మీకు అందిస్తుంది.

ఆధ్యాత్మిక పర్యాటకం

రెండేళ్లకు ఒకసారి వచ్చే మేడారం(Medaram) వన జాతరకు దాదాపు కోటిమంది భక్తులు తరలివస్తారు. గద్దెపై కొలువుదీరిన సమ్మక్క, సారళమ్మను దర్శించుకుంటారు. దేశంలోని ఎక్కడెక్కడ నుంచో వ్యయప్రయాసు ఓర్చి భక్తులు మేడారం చేరుకుంటారు. మళ్లీ వస్తామో లేదో ఇంతదూరం అని భక్తులు చుట్టూ ఉన్న ప్రదేశాలను ఒక లుక్కు వేద్దామనుకుంటున్నారు. అలాంటి వారికి అద్భుతమైన అనుభూతిని కలిగించేదే రామప్ప దేవాలయం(Ramappa Temple). రామప్ప చెరువు. మేడారానికి 58 కిలో మీటర్ల దూరంలో పాలంపేట గ్రామంలో కాకతీయుల కాలంలో 8 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రక రామప్ప దేవాలయం ఉంది. కాకతీయుల కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఆలయం. మేడారం వచ్చిన భక్తులు ములుగు సమీపంలోని జంగలపల్లి మీదుగా పాలంపేటకు చేరుకోవచ్చు. రామప్ప ఆలయంలోపాటు, రామప్ప చెరువు అందాలను తిలకించవచ్చు. చెరువు ఒడ్డున హరిత కాకతీయ రూమ్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉన్నాయి. మేడారం నుంచి పాలంపేట రామప్పకు చేరుకోవాడానికి సుమారు గంటన్నర పడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన భక్తులు ములుగు(Mulugu)లో లేదా జంగాలపల్లి లో దిగి ప్రైవేటు వాహనాల్లో వెళ్లవచ్చు..

దర్శనీయ ప్రదేశాలు
మేడారంకు సమీపంలోనే చారిత్రక ఓరుగల్లు నగరం ఉంది. ఇక్కడి నుంచి సుమారు వందకిలోమీటర్ల లోపే ఉంటుంది. ప్రైవేట్ వాహనాలు, బస్సు ద్వారా వరంగల్(Warangal) చేరుకోవచ్చు. కాకతీయుల వైభవం, చారిత్రక సంపదకు ఓరుగల్లు కోట నిదర్శనం, రాణిరుద్రమదేవి సాధించిన విజయాలు నేటికి సజీవ సాక్ష్యంగా కనిపిస్తాయి. ఓరుగల్లు కోట, వెయిస్తంభాల గుడి, భద్రకాళి టెంపులు , జైన్ మందిరం వీక్షించొచ్చు. వేయి స్తంభాల గుడి అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక కాకతీయ పోర్టులో రాజరికం ఆనవాళ్లు నేటికి కనిపిస్తాయి. తెలంగాణకే తలమానికంగా నిలచే కాకతీయుల కళాతోరణం తప్పకుండా వీక్షించాల్సిందే. భద్రకాళి అమ్మవారి ఆలయం, ఆపక్కనే ఉండే చెరువు అందాలను తనివితీరా వీక్షాంచాల్సిందే. ఇవేగాక సమీపంలో చూడాలనుకుంటే పాకాల చెరువు, ఏటూరునాగారం అటవీ అందాలు, భీమునిపాదం వాటర్ ఫాల్స్, లక్కవరం చెరువు అందాలు వీక్షించవచ్చు. మరెందుకు ఆలస్యం మీరు మేడారం వెళ్తుంటే మాత్రం మీ విజిటింగ్ లిస్ట్‌లో ఈ ప్రాంతాలను ప్లేస్‌ చేసుకోండి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget