By: ABP Desam | Updated at : 21 Apr 2022 10:33 AM (IST)
Edited By: RamaLakshmibai
Mahabharat
కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు జరిగింది. భీకరంగా సాగిన పోరులో ఎవరి పాండవులు, కౌరవులు ఎవరి వ్యూహాలు వారివి. విజేతలుగా నిలిచేందుకు ఇరు వర్గాలు సర్వశక్తులు ఒడ్డారు. పాండవుల పక్షాన దృష్టద్యుమ్నుడు సేనాధిపతిగా వ్యవహరించగా... కౌరవుల పక్షాల మొదట ద్రోణుడు సేనానిగా ఉన్నాడు. ద్రోణుడి మరణానంతరం కర్ణుడు, ఆ తర్వాత శల్యుడు సేనాధిపతిగా వ్యవహరించారు. యుద్ధంలో గెలుపోటములు నిర్ణయించేవి వ్యూహాలే. వ్యూహం లేకుండా అడుగేస్తే రణభూమిలో ప్రత్యర్థులను నిలువరించేలేరు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఏడు అక్షౌహిణీలు, కౌరవులు పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించారు. రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. 18 రోజులు 18 వ్యూహాలు అనుసరించారు. అంటే పాండవులు 18 వ్యూహాలు, కౌరవులు 18 వ్యూహాలు మొత్తం 36 వ్యూహాలు అనుసరించారు. వాటిలో ముఖ్యమైన వ్యూహాలివే....
కురుక్షేత్ర సంగ్రామం పాండవులు కౌరవులు
మొదటి రోజు వజ్ర వ్యూహం సర్వతోముఖ వ్యూహం
రెండో రోజు క్రౌంచ వ్యూహం త్రికూట వ్యూహం
మూడో రోజు అర్ధచంద్ర వ్యూహం గరుడ వ్యూహం
నాలుగో రోజు శృంగాటక వ్యూహం వ్యాల వ్యూహం
ఐదవ రోజు శ్యేన వ్యూహం మకర వ్యూహం
ఆరో రోజు మకర వ్యూహం క్రౌంచ వ్యూహం
ఏడో రోజు వజ్ర వ్యూహం మండల వ్యూహం
ఎనిమిదో రోజు శృంగాటక వ్యూహం కూర్మ వ్యూహం
తొమ్మిదో రోజు దళవ్యూహం సర్వతోభద్ర వ్యూహం
పదో రోజు దేవ వ్యూహం అసుర వ్యూహం
పదకొండో రోజు క్రౌంచ వ్యూహం శకట వ్యూహం
పన్నెండో రోజు మండలార్ధ వ్యూహం గరుడ వ్యూహం
పదమూడో రోజు సాధారణ వ్యూహం చక్ర వ్యూహం
పద్నాలుగవ రోజు శకటవ్యూహం చక్రార్థక్ వ్యూహం
పదిహేనో రోజు వజ్రవ్యూహం పద్మ వ్యూహం
పదహారో రోజు అర్ధచంద్ర వ్యూహం మకర వ్యూహం
పదిహేడో రోజు దుర్జయ వ్యూహం బార్హస్పత్య వ్యూహం
పద్దెనిమిదో రోజు త్రిశూల వ్యూహం సర్వతోభద్ర వ్యూహం
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
మొత్తం ఈ యుద్ధ వ్యూహాల్లో త్రిశూల వ్యూహం గురించి దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే బాహుబలి సినిమాలో యుద్ధ సమయంలో ఈ వ్యూహం గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించాడు, సన్నివేశాలను కూడా క్లియర్ గా తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి. ఆ వ్యూహాన్ని చూసిన ప్రేక్షకులు యుద్ధవ్యూహాలంటే ఇలా ఉంటాయా, ఇంట్రెస్టింగ్ అనుకున్నారు. మరి మిగిలిన యుద్ధ వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఏ వ్యూహంలో ఎవరు ఎవర్ని నిలువరించారో తదుపతి కథనంలో తెలుసుకుందాం....
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు
Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం
Horoscope Today 27th May 2022: ఈ రాశులవారికి అనారోగ్య సూచనలున్నాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!