Dwadasa Jyotirlinga Stotram: ఏడు జన్మల పాపాలు హరించే శివ స్తోత్రం, జాగరణ చేసేవారంతా ఓసారి చదవండి
శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం కుదరకపోయినా రుద్రాభిషేకం చూసినా చాలు విశేష ఫలితం దక్కుతుంది. ఇదీ కుదరకపోతే శివ పంచాక్షరి, దారిద్ర్య దహన స్తోత్రం, జ్యోతిర్లింగ స్త్రోత్రం పఠిస్తే అంతా శుభమే
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
లఘు స్తోత్రమ్
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ||
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ |
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||
సంపూర్ణ స్తోత్రమ్
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||
శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ||
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ||
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||
యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ||
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ||
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||
Also Read: శివుడుని 'లయకారుడు' అని ఎందుకంటారు
దారిద్ర్య దహన శివస్తోత్రమ్
విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |
కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||
గౌరిప్రియాయ రజనీశకలాధరాయ కాలాన్తకాయ భుజగాధిపకఙ్కణాయ |
గఙ్గాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||
భక్తిప్రియాయ భయరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||
చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ |
మఞ్జీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||
పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ |
ఆనన్దభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||
భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాన్తకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||
రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ |
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |
మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ |
త్రిసన్ధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ||
దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ ||
ఏదీ సాధ్యం కాకపోతే ‘ఓం నమశ్శివాయ’ అంటూ శివపంచాక్షరిని స్మరించినా ఆ భోళాశంకరుడి అనుగ్రహం లభిస్తుంది.
Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది