Leo Horoscope 8th June 2022: జూన్ 8 సింహ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో సింహ రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

సింహ రాశి అధిపతి - సూర్యుడు
సింహరాశి వారి పేర్లలో మొదటి అక్షరాలు -మా, నేను, మూ, మే, మో, ట, టీ, తో, టే
సింహరాశివారికి మంచి రోజులు- ఆదివారం, మంగళవారం, గురువారం
జూన్ 8 సింహ రాశిఫలితం ( Leo Horoscope 8th June 2022)
సింహ రాశివారు ఈ రోజు తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తులను, ఉద్యోగులైతే ఉన్నతాధికారులను కలుస్తారు. ప్రత్యర్థుల కన్నా ఈ రోజు పై స్థాయిలో ఉంటారు. మీ ప్రత్యర్థులు మరింత బలహీనంగా ఉంటారు. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేసుకునేందుకు ఈ రోజు మంచి రోజు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆస్తి సంబంధింత విషయంలో పురోగతి ఉంటుంది.
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
సింహ రాశి వార ఫలం ( Leo Weekly Horoscope June 6 to June 12)
సింహరాశివారు ఈ వారం ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే యోచనలో ఉంటారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులకు ఒత్తడి తొలగిపోతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలవుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయనాయకులకు అంతా శుభసమయం.
Also Read: రామాయణం, మహాభారతం, భాగవతం ఈ ఒక్క శ్లోకంలో చదివేసుకోండి
సింహ రాశి జూన్ నెల ఫలితం ( Leo 2022 June Horoscope)
సింహ రాశి వారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉండడంతో చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు, టెలికమ్యూనికేషన్, ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రతివిషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు.
Also Read: తలకిందులుగా ఉండే ఈ శివయ్య దీర్ఘకాలిక రోగాలు నయం చేస్తాడట
నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Before You Go
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















